kumaram bheem asifabad- పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:20 PM
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో విద్యా, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో పాఠశాలలో మౌలిక వసతులు, తరగతి గదుల నిర్మాణం, అదనపు గదుల నిర్మాణం అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహఙంచారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో విద్యా, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో పాఠశాలలో మౌలిక వసతులు, తరగతి గదుల నిర్మాణం, అదనపు గదుల నిర్మాణం అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహఙంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ విద్యాలయాల్లో మౌలిక వసతులు, తాగునీరు మూత్రశాలలు, బాలికల కోసం ప్రత్యేక మూత్రశాలలు, విద్యుత్ సరఫరా, గదుల నిర్మాణాలు, అదనపు గదుల నిర్మాణాలు ఇతర పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధాన మత్రి జుగా, ప్రధాన మంత్రి జన్‌మన్ పథకాల కింద చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో విద్యారంగంలో చేపట్టిన పనులు త్వరగాపూర్తి చేసి వినియోగంలోకి తీసుకు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిలిచి పోయిన పనులపై సంబంధిత కాంట్రాక్టర్‌లతో సంప్రదించాలని చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మౌలిక వసతుల పనులు పూర్తి చే యాలన్నారు. సమావేశంలో విద్యాశాఖాధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.