Minister Seethakka: మహిళా సాధికారతే లక్ష్యం
ABN , Publish Date - Dec 03 , 2025 | 04:05 AM
తెలంగాణ విజన్ డాక్యుమెంట్- 2047 రూపకల్పనలో మహిళా సాధికారత, ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క...
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విజన్ డాక్యుమెంట్- 2047 రూపకల్పనలో మహిళా సాధికారత, ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రజా భవన్‌లో మంగళవారం నాడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం 52.7 శాతం ఉన్న మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటును 2047 నాటికి 95 శాతానికి చేరేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని మంత్రి పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యంతో, విభిన్న వ్యాపారాల్లో వారిని ప్రోత్సహించేలా డాక్యుమెంట్ ఉండాలన్నారు. ప్రైవేట్ స్కూళ్లు, హాస్టళ్ల యూనిఫాం తయారీ పనులను కూడా మహిళా సంఘాలకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.