Share News

మహిళా అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:13 PM

మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుప టేల్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలో రైతు వేదికలలో మహిళ లకు ప్రభుత్వం ద్వారా అందించిన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశా రు.

మహిళా అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

జన్నారం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుప టేల్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలో రైతు వేదికలలో మహిళ లకు ప్రభుత్వం ద్వారా అందించిన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్ర భుత్వం సాధిధికారత కోసం కృషి చేస్తుందన్నారు. మహిళల కోసం చేప ట్టిన ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళల కు ఆర్టీసీలో ఉచిత బస్సు, కల్యాణలక్ష్మీ కాకుండా పలు సంక్షేమ పథ కాలు ప్రవేశపెట్టామన్నారు. ఆరు గ్యారంటీల్లో అమలు పరిచేందుకు పా టుపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ నాయకులు ఎఎంసీ చైర్మన్‌ దుర్గం లక్ష్మీనారాయణ, ఐకేపీ ఏపీఎం లలితాకుమారి, డిప్యూటీ తహసీల్దార్‌ రామ్మోహన్‌, మండల అధ్యక్షుడు ముజాఫర్‌ అలీ, నాయకులు ఫసియుల్లా, మాణిక్యం, ముత్యం సతీష్‌, దుమ్మల రమేశ్‌, వెంకటరాజం, ఇంధయ్య, మోహన్‌రెడ్డి, ప్రవీణ్‌లు పాల్గొన్నారు.

జైపూర్‌ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథ కాల్లో భాగంగా మండలంలో ఇందిర మహిళ శక్తి చీరల పంపిణీ కార్య క్రమాన్ని శనివారం ఐకేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని మహిళ సంఘాలకు ప్రభుత్వం పంపిన చీరలను డీఆర్‌ డీవో కిషన్‌ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహి ళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అ మలు చేస్తుందన్నారు. మహిళల స్వయం సమృద్ధికి, ఆత్మ విశ్వాసం పెం పు కోసం మహిళాశక్తి పథకం ఎంతో ఉపయోగకరంగా మారిందన్నా రు. ప్రతీ అర్హురాలుకు చీరలు చేరేలా ప్రత్యేక పర్యవేక్షణతో పంపిణీ ఉం టుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయ ణ, కాంగ్రెస్‌ నాయకులు రిక్కుల శ్రీనివాస్‌ రెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్య క్షుడు ఫయాజ్‌, మహిళ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:13 PM