Share News

మహిళా ఓటర్లే అధికం...

ABN , Publish Date - Dec 08 , 2025 | 09:52 PM

పంచా యతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా మహిళా ఓటర్లే కీలక భూమిక పోషించనున్నారు.

మహిళా ఓటర్లే అధికం...

-పంచాయతీ ఎన్నికల్లో కీలక భూమిక వారిదే

-జిల్లాలోని 16 మండలాల్లో 3.76 లక్షల ఓటర్లు

-పురుషుల కంటే ఐదు వేలు అధికంగా స్ర్తీలు

-15 మండలాల్లో స్త్రీలదే ఆదిపత్యం

మంచిర్యాల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పంచా యతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా మహిళా ఓటర్లే కీలక భూమిక పోషించనున్నారు. ఇటీవల అధికారులు ప్రక టించిన గ్రామ పంచాయతీలు, ఓటర్ల జాబితాలో పు రుషుల కంటే మహిళలు ఐదు వేల పై చిలుకు అధి కంగా ఉన్నారు. జిల్లాలోని 16 మండలాలకు గాను 15 మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గ మనార్హం. ఒక్క భీమిని మండలం మినహా మిగతా అ న్ని మండలాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉం ది. మహిళా ఓటర్ల మద్దతు పొందడానికి వివిధ పా ర్టీలు తాము బలపరిచే అభ్యర్థులుగా ఎక్కువ మంది మహిళలనే రంగంలోకి దింపుతున్నారు. అధికార కాం గ్రెస్‌ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలతో మహిళలకు పెద్దపీట వేస్తుండగా, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు సైతం వారిని ఆకర్శించే ప్రయత్నాలు చేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 306 గ్రామ పంచాయతీలలో వార్డుకు ఒక పోలింగ్‌ బూత్‌ చొప్పున ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని మొత్తం 306 గ్రామ పంచాయతీల పరిధిలో 2680 వార్డులు ఉ న్నాయి. ఒక్కో వార్డుకు ఒకటి చొప్పున మొత్తంగా 2680 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు స న్నాహాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల తుది జా బితానే మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల కోసం ము సా యిదా కింద తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తుది ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లా పరిధిలో మొత్తం 3,76,669 ఓటర్లు ఉన్నారు. వీరిలో స్త్రీలు 1,91,011 మంది ఉండగా, పురుషులు 1,85,643, ఇతరు లు 15 మంది ఓటర్లు ఉన్నారు.

50 శాతం సీట్లు మహిళలకే...

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకారం మహి ళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తారు. ప్రత్యేకంగా మహిళల రిజర్వేషన్‌ స్థానాలతోపాటు మిగతా 50 శాతం సీట్లలో జనరల్‌ కేటగరీకి కేటాయించే స్థానాల్లో నూ సింహభాగం మహిళలే బరిలో దిగుతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో జనరల్‌ స్థానాల్లో పోటీచేసి, గెలిచిన మహిళల సంఖ్య అధికంగానే ఉంది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లను ఆక ర్శించేందుకు జనరల్‌ స్థానాల్లో కూడా కొందరు మ హి ళలను రంగంలోకి దింపుతున్నారు. ప్రతి ఎన్నికల్లో నూ మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయి స్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు గ్రామా ల్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం కూడా మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం ఉపాధి కోసం యూనిట్లు మంజూరు చేస్తూ రుణాలు అందజేస్తోంది. ఆర్టీసీ అద్దె బస్సుల్లో మహిళలను పాత్రదారులను చేయడం, పెట్రో ల్‌ బంకుల ఏర్పాటు, తదితర పథకాలు ప్రత్యేకంగా రూపొందిస్తోంది. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉ చిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం, ఇంది రమ్మ ఇళ్లు మహిళల పేరిట ఇవ్వడం ద్వారా వారికి పెద్దపీట వేస్తోంది. అధికార పార్టీతోపాటు ప్రతి పక్ష పార్టీల నా యకులు సైతం మహిళల ఓట్లపై ఎక్కువగా దృష్టి సా రిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం మించి రిజర్వేషన్లు కల్పించరాదనే సుప్రీం కో ర్టు ఆదేశాల మేరకు ఆ తీర్పుకు లోబడి రాష్ట్ర ప్రభు త్వం కేటగరీల వారీగా రిజర్వేషన్లు ప్రకటించింది. అయి నప్పటికీ రిజర్వేషన్లకు అతీతంగా అన్‌ రిజర్వ్‌డ్‌ స్థానా ల్లోనూ మహిళలే రంగంలోకి దిగుతుండటం గమనార్హం.

మండలాల వారీగా ఓటర్ల వివరాలు...

మండలం మొత్తం పురుషులు స్త్రీలు ఇతరులు

బెల్లంపల్లి 23464 11625 11838 01

భీమిని 11529 5844 5684 01

భీమారం 13093 6394 6699 00

చెన్నూర్‌ 26475 13040 13435 00

దండేపల్లి 42101 20486 21614 01

హాజీపూర్‌ 16954 8361 8593 00

జైపూర్‌ 30626 15278 15347 01

జన్నారం 44412 21670 22740 02

కన్నెపల్లి 15490 7614 7875 01

కాసిపేట 26472 13127 13342 03

కోటపల్లి 26990 13320 13668 02

లక్షెట్టిపేట 25227 12261 12966 00

మందమర్రి 11482 5678 5803 01

నెన్నెల 19371 9636 9734 01

తాండూర్‌ 27757 13741 14016 00

వేమనపల్లి 15226 7568 7657 01

............ ........... .............. ......

మొత్తం 376669 185643 191011 15

............. ........... .............. ......

Updated Date - Dec 08 , 2025 | 09:52 PM