Share News

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:13 PM

బ్యాంకు రుణాలను స్త్రీనిధి ద్వారా అందించే రు ణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆ ర్థికంగా ఎదగాలని అడిషనల్‌ డీఆర్‌డీఏ రాజేశ్వ రి అన్నారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి
మహిళా సమాఖ్య సిబ్బందితో మాట్లాడుతున్న అడిషనల్‌ డీఆర్‌డీఏ రాజేశ్వరి

- అడిషనల్‌ డీఆర్‌డీఏ రాజేశ్వరి

తిమ్మాజిపేట, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : బ్యాంకు రుణాలను స్త్రీనిధి ద్వారా అందించే రు ణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆ ర్థికంగా ఎదగాలని అడిషనల్‌ డీఆర్‌డీఏ రాజేశ్వ రి అన్నారు. మండల కేంద్రంలోని మహిళా స మాఖ్య కార్యాలయాన్ని ఆమె శనివారం తనిఖీ చేశారు. ఆమె రికార్డులను పరిశీలించి మహిళ లనుద్దేశించి మాట్లాడారు. గ్రామాల్లో మహిళ లను చైతన్యం చేయాలని మహిళా సంఘాలు పంచ సూత్రాలు పాటించాలన్నారు. స్త్రీనిధి రూ. 2లక్షల రుణం పొందిన మంజుల అనే మహిళ తిమ్మాజిపేటలో ఫొటో స్టూడియో నడుపుతూ జీవనం సాగించడానికి ఆమె అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ నిరంజన్‌, ఎంపీడీవో లక్ష్మీదేవి, సీసీలు నాగరా జు, యాదమ్మ, వెంకటేశ్వరమ్మ ఉన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:13 PM