Share News

kumaram bheem asifabad- మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలి

ABN , Publish Date - Aug 12 , 2025 | 10:48 PM

: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత గల ప్రతీ మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేర్పించాలి కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గ్రామైక్య సంఘాల వీవోలు, ఏపీవోలు కమ్యూనిటీ సమన్వయకర్తలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

kumaram bheem asifabad-  మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత గల ప్రతీ మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేర్పించాలి కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గ్రామైక్య సంఘాల వీవోలు, ఏపీవోలు కమ్యూనిటీ సమన్వయకర్తలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల పేరిట అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద అనే వ్యాపారాలు నిర్వహిం చేందుకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. క్యాంటీన్‌లు, పెట్రోల్‌ బంక్‌ల నిర్వహణ, ఇతర ఎంటర్‌ప్రైజేస్‌ల నిర్వహణకు తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తే కుటుంబానికి మేలు కలుగుతుందని, అర్హత కలిగిన ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేర్పించే విధంగా ఏపీఎంలు, సీసీలు కృషి చేయాలన్నారు. సంఘంలో సభ్యులుగా చేరితే కలిగే ప్రయోజనాలపై మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ నెల చివరిలోగా ప్రతి మహిళ సంఘంలో సభ్యులుగా ఉండేలా సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో ప్రాజెక్టు మేనేజర్‌ యాదగిరి, శేషరావు, యశోద, నరేందర్‌, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, గౌరవ అధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్‌ మండలం అడ గ్రామ పంచాయతీ పరిధిలోని వాడిగూడ మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వంట శాల, రిజిస్టర్‌లు, పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని పరీక్షించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపతం చేసి విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన రుచికరమైన ఆహారాన్ని అందించాలని ఉపాద్యాయులకు సూచించారు. పాఠశాల పరిశీలోని విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు హాజరు కావాలని, బడి బయటపిల్లలు, మధ్యలో బడి మానేసిన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలకు వచ్చే విధం గా వారి తల్లితండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశు భ్రంగా ఉంచాలని తెలిపారు. ఆయన వెంట విద్యాధికారి ఉదయ్‌బాబు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 11:05 PM