kumaram bheem asifabad-మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:43 PM
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తే ఆ కుటుం బాలు స్థిరమైన ఎదుగుదల సాధ్యమవుతుందని అదనపు డీఆర్డీవో రామకృష్ణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కౌటాల, ముత్యంపేట, రవీంద్రనగర్ బ్రాంచ్‌ల పరిధిలోని మహిళా సంఘాలకు రూ.5.36 కోట్ల రుణాలు అందజేశారు.
కౌటాల, జూన్ 20(ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తే ఆ కుటుం బాలు స్థిరమైన ఎదుగుదల సాధ్యమవుతుందని అదనపు డీఆర్డీవో రామకృష్ణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కౌటాల, ముత్యంపేట, రవీంద్రనగర్ బ్రాంచ్‌ల పరిధిలోని మహిళా సంఘాలకు రూ.5.36 కోట్ల రుణాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాయంకులను రిక్వెస్ట్ చేసే స్థాయి నుంచి హక్కుగా లోన్లు పొందేలా మారాలన్నారు. తీసుకున్న రుణాలను సక్రమంగా తిరిగి చెల్లిస్తే పావలా వడ్డీ వస్తుందని చెప్పారు. స్త్రీ వక్తి పథకం ద్వారా మహా అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్ని రంగాల్లో మహిళలకు వ్యాపారం, స్వయం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి గ్యారంటీ లేకుండా రుణాలు అందించడమే గాక నైపుణ్యం కోసం ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. మనిషి జీవితంతో బీమా ప్రాధాన్యత కీలకమని చెప్పారు. అందరు బీమా చేయించుకోవాలన్నారు. ఎస్బీఐ జనరల్ కింద బీమా చేయించుకుని రైలు ప్రమాదంలో కాఆలు కోల్పోయిన కర్జవెల్లికిచెందిన చౌదరి ఓంకార్‌కు రూ.10 లక్షల బీమా పరిహారం అందజేశారు. కార్యక్రమంలో ఏపీఎంలు ముక్తేవ్వర్, దేవానందం, బ్యాంకు మేనేజర్‌లు రమేష్, కిరణ్, రాజ్‌కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్, మండల సమాఖ్య అధ్యక్షురాలు కుసుమ, సీసీలు పాల్గొన్నారు.