మహిళలే మహారాణులు...!
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:31 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో మ హిళలు బరిలోకి దిగనున్నారు. బీసీ రిజర్వేషన్లతోపాటు ప్రత్యేక మహిళా కోటాతో కలిపి ప్రభుత్వం వారికే అధిక సీట్లు కేటాయించింది. దీంతో రాజకీయ పార్టీలు సైతం మహిళలను రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చే స్తున్నాయి.
-స్థానిక’ ఎన్నికల రిజర్వేషన్లలో వారికే అందలం
-జనరల్ కేటగరీలోనూ బరిలో నిలవనున్న అతివలు
-మొత్తంగా 50 శాతం రిజర్వేషన్లు మహిళలకే
-జడ్పీ పీఠాన్నీ అధిరోహించనున్న బీసీ మహిళ
మంచిర్యాల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో మ హిళలు బరిలోకి దిగనున్నారు. బీసీ రిజర్వేషన్లతోపాటు ప్రత్యేక మహిళా కోటాతో కలిపి ప్రభుత్వం వారికే అధిక సీట్లు కేటాయించింది. దీంతో రాజకీయ పార్టీలు సైతం మహిళలను రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చే స్తున్నాయి. ఇప్పటి దాకా రాజకీయానుభవం లేకపో యినా, రిజర్వేషన్లు అనుకూలించినందున తమ కుటుం బాల్లోని మహిళలను పోటీలో నిలబెట్టడం ద్వారా పురు షులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు మహిళలు బరిలో ని లిస్తే ఆ విభాగం ఓట్లు తేలిగ్గా రాబట్టుకోవడంతో పా టు, చట్ట సభల్లోకి నారీమణులు అధికంగా వెళ్లేలా ప్ర జలే ప్రోత్సహించే అవకాశాలున్నాయి. ఈ కారణంగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళ ల భాగస్వామ్యం పెరగనుంది.
రిజర్వేషన్లు మహిళలకే అనుకూలం...
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు వారికే అను కూలిస్తుండగా, నిబంధనల ప్రకారం చూసినా వారికి 50 శాతం సీట్లు కేటాయించాల్సిన పరిస్థితులు ఉన్నా యి. ఇవే గాకుండా మిగతా 50 శాతం సీట్లలో జనరల్ కేటగరీకి కేటాయించే స్థానాల్లోనూ మహిళలు పోటీ చే సే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీచేసి, గెలిచిన మహి ళల సంఖ్య అధికంగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లను ఆకర్శించేందుకు జనరల్ స్థానాల్లో కూడా కొందరు మహిళలను రంగంలోకి దింపాలని ఆ యా పార్టీల ముఖ్య నేతలు భావిస్తున్నారు. స్థానిక సం స్థల ఎన్నికలకు సంబంఽధించి జిల్లా వ్యాప్తంగా మహి ళా ఓటర్లే అధికంగా ఉండటంతోపాటు ప్రతి ఎన్నికల్లో నూ వారే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తున్నా రు. దీంతో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సైతం గ్రామాల్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా వివిధంగా కార్యాచరణ రూపొందిస్తు న్నారు. అలాగే ప్రభుత్వం కూడా మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వారి కోసం ప్రత్యేకంగా పలు పథ కాలు ప్రవేశపెట్టింది. పలు పథకాలు ప్రత్యేకంగా మ హిళల కోసం ఉద్దేశించినవే కావడంతో మహిళా ఓట ర్లను ఆకర్శించడం తేలికనే భావనతో అధికార పార్టీ నా యకులు ఉన్నారు. కాంగ్రెస్‌తోపాటు ప్రధాన ప్రతిప క్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీలు సైతం మహిళలను రంగం లోకి దింపాలన్న యోచనలో ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో మహిళలను రంగంలోకి దింపితేనే తమ పని సులువు అవుతుందనే ఉద్దేశంతో ఆయా పార్టీల నాయకులు ఉన్నారు.
జడ్పీటీసీ ఎన్నికల్లో....
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 16 మండలాల పరిధిలో మొత్తం 16 జడ్పీటీసీలు, 16 ఎం పీపీలతోపాటు 129 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వా టికి సంబంధించి ఈ నెల 27న స్థానాల వారీగా రిజర్వే షన్లు సైతం ఖరారయ్యాయి. కులగణన ఆధారంగా జ నాభా దామాషా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు కల్పించగా, ఎస్సీ, ఎస్టీ, తదితర కులాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయను న్నారు. స్థానిక ఎన్నికల్లో మహిళల రిజర్వేషన్ స్థానాల తోపాటు ఆయా సామాజిక వర్గాల జనరల్ కేటగరీల్లో నూ మహిళలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. జడ్పీ టీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని మొత్తం 16 స్థానాలకుగాను ఏడు సీట్లను మహిళలకు కేటాయిం చారు. వీటితోపాటు జనరల్ కేటగరీకి మూడు సీట్లు కేటాయించగా, అందులోనూ మహిళలు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే 16 ఎంపీపీ స్థానాలకు గాను మహిళా కోటా కింద 7 సీట్లను స్త్రీలకు కేటాయిం చారు. అలాగే వీటిలోనూ మూడు సీట్లు జనరల్ కేట గరీకి కేటాయించారు. వాటిలోనూ మహిళలు పోటీపడే అవకాశాలు ఉన్నాయి. తద్వారా జడ్పీటీసీ, ఎంపీపీ ఎ న్నికల్లో 50 శాతం మేర మహిళలు రంగంలోకి దిగనున్నారు.
ఎంపీటీసీ విభాగంలో....
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ విభా గంలోనూ రిజర్వేషన్ దామాషానా ఎస్టీ, ఎస్సీ, బీసీతో పాటు జనరల్ స్థానాల్లో మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వు చేశారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో మొత్తం 129 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 50 శాతం మేర మహిళల కోటాతో కలిపి దాదాపు స గం సీట్లలో అతివరలు బరిలో నిలిచే అవకాశాలు ఉ న్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ ఎన్నికల్లో 28 జనర ల్ స్థానాలు ఉన్నాయి. వాటిలో అత్యధిక సీట్లలో మహి ళలే బరిలో దిగే అవకాశాలు అనేకం ఉన్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ విభాగాలతోపాటు ఆయా కేటగరీల్లో మహిళలకు కేటాయించిన సీట్లలోనూ వారి ప్రాతిని థ్యం అధికంగా ఉండనుంది.
సర్పంచ్ ఎన్నికల్లోనూ....
జిల్లా వ్యాప్తంగా 306 గ్రామ పంచాయతీలు ఉండ గా, సర్పంచ్ ఎన్నికల్లో మహిళలు అధిక సంఖ్యలో బరి లోకి దిగనున్నారు. జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో 52 జనరల్ స్థానాలు ఉన్నాయి. వాటిలో సింహభాగం మహిళలే బరిలో దిగే అవకాశాలు అనేకం ఉన్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ విభాగాలతోపాటు ఆయా కేటగరీల్లోని మహిళా కోటాలోనూ వారి ప్రాతినిథ్యం అధికంగా ఉండే అవకాశం ఉంది.
జడ్పీ పీఠం మహిళదే....
పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో మహిళలు తమ సత్తా చాటే అవకాశాలే మెండుగా ఉన్నాయి. పురు షులతో పోల్చితే అధిక సీట్లలో వారే పాగా వేయను న్నారు. ఇదిలా ఉండగా జిల్లా ప్రథమ మహిళ స్థానం అయిన జిల్లా పరిషత్ చైర్మపర్సన్ పీఠాన్ని సైతం బీసీ మహిళకే రిజర్వు చేయడం గమనార్హం. జిల్లాలోని బీసీ సామాజిక వర్గం జనాభా ఆధారంగా జడ్పీ 42 శాతం రిజర్వేషన్ ప్రకారం జడ్పీ చైర్మన్ పదవి బీసీ మహిళను వరించనుంది. జడ్పీ చైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకొనే అవకాశం ఉండటంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు నారీమణులకు, ముఖ్యంగా బీసీ విభాగంలో పెద్దపీట వేసే అవకాశాలు ఉన్నాయి.