kumaram bheem asifabad- మహిళలకే అందలం
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:22 PM
జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నిక ల్లో మహిళలు సత్తా చాటారు. మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ఇందులో భాగంగా వారికి కేటాయించిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీప డ్డారు.
- కలిసి వచ్చిన రిజర్వేషన్లు.. పాలకవర్గంలో సగానికిపైగా వారే
- గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని గ్రామస్థుల ఆకాంక్ష
ఆసిఫాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నిక ల్లో మహిళలు సత్తా చాటారు. మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ఇందులో భాగంగా వారికి కేటాయించిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీప డ్డారు. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నారు. ఇందులో వాంకిడి మండలం తేజగూడ, ఆసిఫాబాద్ మండలం రహపల్లి, చిలాటిగూడలలో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగలేదు. దీంతో 332 గ్రామ పంచాయతీలలో జరిగిన ఎన్నికల్లో 170 మంది మహిళ సర్పంచ్‌లు గెలుపొందారు.
- మొదటి విడతలో..
జిల్లాలో జైనూరు, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్ (యు), వాంకిడి మండలాల్లో మొదటి విడత 113 పంచాయతీలకు ఎన్నికలు జరుగగా ఇందులో 60 మంది మహిళా సర్పంచులు గెలుపొందారు. జైనూరు మండలంలో 26 పంచాయతీలలో 15 మంది మహిళలు, 11 మంది పురుషులు సర్పంచ్‌లుగా గెలు పొందారు. కెరమెరిలో 31 పంచాయతీలకు 14 మంది మహిళలు, పురుషులు 17 మంది గెలుపొందారు, లింగాపూర్‌లో 14 పంచాయతీలలో 9 మంది మహిళలు, ఐదుగురు పురుషులు గెలుపొందారు. సిర్పూర్(యూ)లో 15 పంచాయతీలలో ఎనిమిది మంది మహిళలు, ఏడుగురు పురుషులు గెలుపొం దారు. వాంకిడిలో 28 పంచాయతీలలో 14 మంది మహిళలు, 13 మంది పురుషులు గెలుపొందారు.
- రెండో విడతలో..
జిల్లాలోని సిర్పూర్(టి), పెంచికల్‌పేట, దహె గాం, చింతలమానేపల్లి, కౌటాల, బెజూరు మండ లాల్లో మొత్తం 113 పంచాయతీ స్థానాలకు ఎన్ని కలు జరుగగా ఇందులో 54 మంది మహిళలు సర్పంచ్‌లుగా గెలుపొందారు. సిర్పూర్(టి)లో 16 పంచాయతీలకు ఎనిమిది మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు సర్పంచ్‌లుగా ఎన్నిక య్యారు. పెంచికలపేటలో 12 పంచాయతీలలో అరుగురు మహిళలు, అరుగురు పురుషులు, దహెగాంలో 24 పంచాయతీలలో 12 మంది మహిళలు, 12 మంది పురుషులు, చింతల మానేపల్లి మండలంలో 19 పంచాయతీలలో తొమ్మిది మంది మహిళలు, 10 మంది పురుషులు, కౌటాలలో 20 పంచాయతీలలో తొమ్మిది మంది మహిళలు, 11 మంది పురుషులు, బెజ్జూరు మండ లంలో 22 పంచాయతీలలో 10 మంది మహిళలు, 12 మంది పురుషులు గెలుపొందారు.
- మూడో విడతలో..
జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రెబ్బన, తిర్యాణి మండలాల్లో మొత్తం 106 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగగా 56 మంది మహి ళలు సర్పంచ్‌లుగా గెలుపొందారు. ఆసిఫాబాద్ మండలంలో మొత్తం 25 పంచాయతీలలో 15 మం ది మహిళలు, 10 మంది పురుషులు గెలుపొందా రు. రెబ్బన మండలంలో 24 పంచాయతీలలో 12 మంది మహిళలు, 12 మంది పురుషులు, కాగజ్‌నగర్ మండలంలో 28 గ్రామపంచాయతీల లో 15 మంది మహిళలు, 13 మంది పురుషులు, తిర్యాణి మండలంలో 29 పంచా యతీలలో 14 మంది మహిళలు, 15 మంది పురు షులు సర్పంచులుగా గెలుపొందారు. పంచాయ తీ ఎన్నికల్లో మహిళల ఓట్లు సైతం ప్రభావరం చూ పాయి. జిల్లాలో పురుష ఓటర్లతో పోలిస్తే ఆమెదే పై చేయి కనిపిస్తోంది. జిల్లాలో ఎనిమిది మండ లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ. జిల్లాలో 3,53,8 95 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,76,606 మంది పురుషులు, 1,77,269 మంది మహిళలు, 20 మంది ఇతరులు ఉన్నారు.