Tragic Incident: కూలి పని ఇస్తామని తీసుకెళ్లి హత్యాచారం
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:09 AM
మెదక్‌లో ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకానికి తెగబడ్డారు. పొట్టకూటికి కూలి పని వెతుక్కుంటున్న మహిళకు పని ఇస్తామని చెప్పి నిర్మానుష్య...
మెదక్‌లో ఓ మహిళపై కిరాతకం
నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దాడి
వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసిన వైనం
చికిత్స కోసం తరలిస్తుండగా మృతి
మెదక్/కొల్చారం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): మెదక్‌లో ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకానికి తెగబడ్డారు. పొట్టకూటికి కూలి పని వెతుక్కుంటున్న మహిళకు పని ఇస్తామని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను చిత్రహింసలు పెట్టి తీవ్రంగా గాయపరిచారు. అత్యాచారానికి పాల్పడడమే కాక.. వివస్త్రను చేసి అక్కడి ఓ చిన్న స్తంభానికి కట్టేసి పరారయ్యారు. రాత్రంతా ఆ నిర్మానుష్య ప్రదేశంలోనే ఉన్న ఆ మహిళను ఉదయాన్నే అటుగా వచ్చిన వారు గుర్తించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిపాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. బాధి తురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం జానకంపల్లి పంచాయతీలోని ఓ తండా వాసి మహిళ కూలి పనికి శుక్రవారం ఉదయం మెదక్ వచ్చింది. అక్కడి ఓ అడ్డాలో పని కోసం ఎదురు చూస్తుండగా పని ఉందని నమ్మబలికిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఆమెను కొల్చారం మండల పరిధిలోని అప్పాజీపల్లి శివారు ఏడుపాయల వెళ్లే రోడ్డులోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. అక్కడ అత్యాచారం, ఆపై హత్యాయత్నం చేసి.. చివరకు వివస్త్రను చేసి ఆమె 2 చేతులను ఓ స్తంభానికి కట్టేసి వెళ్లిపోయారు. శనివారం ఉదయం అటు వచ్చిన వారు అపస్మారక స్థి తిలో ఉన్న మహిళను చూసి పోలీసులకు సమాచా రమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న మెదక్ డీఎ స్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బాధితురాలిని మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి.. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు శనివారం రాత్రి ఆమెను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణం విడిచింది.