Share News

Woman Beggar Assaulted: యాచకురాలిపై అత్యాచారం!

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:34 AM

ఓ కామాంధుడు కన్నూమిన్ను కానకుండా యాచకురాలిని చెరబట్టాడు. ఈ ఘటన సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బస్టాండులో చోటు చేసుకుంది..

Woman Beggar Assaulted: యాచకురాలిపై అత్యాచారం!

  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన

  • మరో ఘటనలో ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం

ఇబ్రహీంపట్నం/రాజేంద్రనగర్‌/కుషాయిగూడ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఓ కామాంధుడు కన్నూమిన్ను కానకుండా యాచకురాలిని చెరబట్టాడు. ఈ ఘటన సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బస్టాండులో చోటు చేసుకుంది. గుజరాత్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ కొంతకాలంగా ఇబ్రహీంపట్నంలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో బస్టాండులో నిద్రిస్తున్న ఆమెపై గుర్తు తెలియని దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు రక్తస్రావంతో పడిపోయి ఉన్న బాధితురాలిని వనస్థలీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దుండగుణ్ని త్వరలోనే పట్టుకుంటామని సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. మరో ఘటనలో ఇద్దరు గుర్తు తెలియని మహిళల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కిస్మిత్‌పూర్‌ బ్రిడ్జి కింద మృతదేహం ఉన్నట్లు రాజేంద్రనగర్‌ పోలీసులకు మంగళవారం సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సుమారు 25 నుంచి 28 సంవత్సరాల వయసు ఉన్న యువతి మృతదేహంగా గుర్తించారు. ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండడంతో ఈ హత్య మూడు రోజుల క్రితమే జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, చర్లపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ గోనే సంచిలో మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఓ సంచిలో గోడ పక్కన పడేసిన మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహం బాగా కుళ్లిన స్థితిలో ఉన్న ఉన్నట్లు తెలిపారు. దుండగులు ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి వెళ్లి ఉంటారని, పరిసర ప్రాంతాల సీసీ ఫుుటేజీలు పరిశీలిస్తున్నట్లు చర్లపల్లి పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 17 , 2025 | 05:34 AM