Share News

kumaram bheem asifabad-నిధులు లేకుండా.. నిర్వహణ ఎలా..?

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:31 PM

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహ ణకు నిధులు సమస్యగా మారాయి. ఇప్పటికే తొలి, రెండో, మూడో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలో నిర్వహణ వ్యయం విడుదల చేయకపోవ డంతో చర్చనీయంశాంగ మారింది. నామినేషన్లు స్వీకరించే క్లస్టర్‌ కేంద్రాల్లో ఆర్‌ఓ, ఏఆర్‌ఓతో పాటు పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. వీరికి అల్పాహారం, భోజనం, తాగునీ రు సమకూర్చాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ భవనాల్లోనే క్లస్టరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఆయా కేంద్రాల ఎదుట నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

kumaram bheem asifabad-నిధులు లేకుండా.. నిర్వహణ ఎలా..?
లోగో

- సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్న వైనం

- ప్రభుత్వం నుంచి విడుదల కాక అవస్థలు

ఆసిఫాబాద్‌రూరల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహ ణకు నిధులు సమస్యగా మారాయి. ఇప్పటికే తొలి, రెండో, మూడో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలో నిర్వహణ వ్యయం విడుదల చేయకపోవ డంతో చర్చనీయంశాంగ మారింది. నామినేషన్లు స్వీకరించే క్లస్టర్‌ కేంద్రాల్లో ఆర్‌ఓ, ఏఆర్‌ఓతో పాటు పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. వీరికి అల్పాహారం, భోజనం, తాగునీ రు సమకూర్చాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ భవనాల్లోనే క్లస్టరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఆయా కేంద్రాల ఎదుట నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సమకూరక ఆర్థికంగా పంచాయతీలు కొట్టుమిట్డాడుతున్నాయి. ఈనేప థ్యంలో పంచాయతీ కార్యదర్శులే సొంత డబ్బుతో నిర్వహణను నెట్టుకొస్త్తున్నారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల ఖర్చు అదనపు ఆర్థిక భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం

చేసే ఏజెన్సీల ద్వారా క్లస్టరు సిబ్బందికి భోజనం సమకూర్చేందుకు యత్నిస్తు న్నారు. మరి కొందరు గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న హోటల్‌ యాజమానులను బతిమాలి ఎన్నికల అనంతరం చెల్లింపు బాధ్యత తమదేనంటూ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.

- పరిస్థితి అయోమయం..

ఎంకి పెళ్లి సుబ్బిచావుకు అన్నట్లుగా మారింది అధికారుల పరిస్థితి ఆయోమయంగా మారింది. పంచాయతీల ఎన్నికల ఏర్పాట్లకు అధికారుల, కార్యదర్శులకు చేతి చమురు వదులుతోంది. ఎన్నికల నిర్వహణకు ముందస్తుగా నిధులు ఇవ్వక పోవడంతో ఖర్చు భారం పంచాయతీ కార్యదర్శులపై పడుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కార్యదర్శుల పాత్ర కీలకం. అన్ని దశల్లో వారి భాగస్వామ్యం తప్పనిసరి. మరీ ముఖ్యంగా నామినేషన్ల స్వీకరణ, పోలింగ్‌ నిర్వహణ తదితర దశల్లో వారు ముందుండాల్సి ఉంటుంది. పోలింగ్‌ సిబ్బందికి అవసరమైనవనీ వారే దగ్గరుండి సమకూర్చాల్సి ఉంటుంది. ఇందు కోసం కార్యదర్శులు తమ జేబులో నుంచి ఖర్చు పెట్టుకోవల్సిన పరిస్థితి నెలకొన్నది. నామినేషన్ల కేంద్రాల వద్ద అల్పాహారం, భోజనం, తాగునీరు నామినేషన్లు వేయడానికి వచ్చే వారికి నీడ కోసం టెంట్లు, కుర్చీలు తదితర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత పంచాయతీ కార్యదర్శులదే. ఉన్నతాధికారుల మౌలిక ఆదేశాలతో కార్యదర్శులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చును ప్రస్తుతం వారే భరిస్తున్నారు. దీనితో ఇప్పటికే రూ.

20 నుంచి 35 వేల వరకు ఖర్చు చేసినట్లు కార్య దర్శులు మాటలను బట్టి తెలుస్తోంది. ఎన్నికలు పూర్త య్యే వరకు మరింత ఖర్చులు పెట్టాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- మూడు విడతల్లో..

జిల్లాలో 335 పంచాయతీలు 2,874 వార్డు స్థానా లకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించను న్నారు. మొదటి విడతలో జైనూరు, కెరమెరి, లింగాపూర్‌, సిర్పూర్‌(యు), వాంకిడి మండలాల్లోని 114 గ్రామ పంచాయతీలు 944 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందు కోసం 944 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఒక్కొక్క పోలీంగ్‌ కేంద్రానికి ఒక పీవో, ఒక ఓపీఓలతో పాటు 20 శాతం అదనంగా రిజర్వ్‌ సిబ్బందిని నియమించారు. తొలి విడతలో మొత్తం 2,340 మంది అదికారులు ఎన్నికల విధులకు హాజరు కానున్నారు. రెండో విడతలో బెజ్జూరు, చింతలమా నేపల్లి, కౌటాల, దహెగాం, పెంచికల్‌పేట, సిర్పూర్‌(టి) మండలాల్లోని 113 పంచాయతీలు

992 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 992 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి 2,544 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. మూడో విడతలో కాగజ్‌నగర్‌, రెబ్బన, ఆసిఫా బాద్‌, తిర్యాణి మండలాల్లోని 108 పంచాయతీలు, 938 వార్డు స్థానాలకు 938 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,408 మంది పోలింగ్‌ సిబ్బందిని ఎన్నికల విధుల కోసం నియ

Updated Date - Dec 09 , 2025 | 11:31 PM