‘మీ డబ్బు మీ హక్కు’తో.. క్లైయిమ్ చేయని సొమ్మును తిరిగి పొందవచ్చు
ABN , Publish Date - Dec 24 , 2025 | 10:59 PM
‘మీ డబ్బు మీ హక్కు’ కార్యక్రమం ద్వారా బ్యాంకులు, బీమా సంస్థలు, పోస్టాఫీసు ఖాతా లు కలిగి క్లైయిమ్ చేయని సొమ్మును తిరిగి పొందేందుకు అవకాశం కల్పిం చారని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ‘మీ డబ్బు మీ హక్కు’ కార్యక్రమం ద్వారా బ్యాంకులు, బీమా సంస్థలు, పోస్టాఫీసు ఖాతా లు కలిగి క్లైయిమ్ చేయని సొమ్మును తిరిగి పొందేందుకు అవకాశం కల్పిం చారని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండి యా ఏజీఎం చేతన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం అప ర్ణరెడ్డితో కలిసి అన్‌క్లైయిమ్ ఖాతాల నుంచి సెటిల్ అయిన ఖాతాలకు సం బంధించిన చెక్కులను సంబంధిత లబ్దిదారులకు అందజేశారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదేళ్లు దాటి ఖాతాల్లో నిల్వ ఉండి వినియో గించని నగదు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన డిపాజిటర్ ఎ డ్యుకేషన్ అండర్ అవర్నెస్ ఫండ్‌లో జమ చేస్తారన్నారు. ఈ క్లైయిమ్ చే యని నగదుకు సంబంధించి ఎవరైనా సంబంధిత బ్యాంకులో కేవేసీ డాక్యు మెంట్, ఇతర సంబంధిత ధృవపత్రాలు సమర్పించడం ద్వారా నగదును తిరిగి పొందవచ్చని తెలిపారు. అన్ క్లైయిమ్ నగదు సంబంధిత వివరా లను బ్యాంకుకు వెళ్లి ఉద్గం పోర్టల్ ద్వారా తెలుసుకోవాలన్నారు. అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రత్తమంగా ఉండాలన్నారు. జిల్లాలోని 475 ఖాతాలకు సంబంధించి రూ. 2.88 కోట్ల క్లైయిమ్ సొమ్మును సెటిల్ చేశా మన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకుల ఉన్నతాధికారులు ప్రశాంత్, రవికి శోర్, కిరణ్‌కుమార్, తిరుపతి, జిల్లా అధికారులు దుర్గాప్రసాద్, పురుషోత్తం, రాజేశ్వరి, భాగ్యవతి పాల్గొన్నారు.