Share News

KTR: ఈ రేస్‌తో మొబిలిటీ హబ్‌గా హైదరాబాద్‌

ABN , Publish Date - Oct 12 , 2025 | 03:33 AM

తమ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసు కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదని, ఆవిష్కరణలు, క్లీన్‌ మొబిలిటీ, అత్యాధునిక...

KTR: ఈ రేస్‌తో మొబిలిటీ హబ్‌గా హైదరాబాద్‌

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): సాంకేతికతకు తెలంగాణను కేంద్రంగా నిలిపిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఫార్ములా ఈ రేసుతో హైదరాబాద్‌ గ్లోబల్‌ మొబిలిటీ హబ్‌గా మారిందని చెప్పారు. తమిళనాడులోని కోయంబత్తూరులో శుక్రవారం జరిగిన 10వ ఎఫ్‌ఎంఏఈ నేషనల్‌ స్టూడెంట్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ పోటీలకు ఆయన హాజరై మాట్లాడారు. ఈ రేసు దాదాపు రూ.700 కోట్ల ఆర్థిక కార్యకలాపాలను సృష్టించి, అంతర్జాతీయ దృష్టిని హైదరాబాద్‌ వైపు మళ్లించిందని పేర్కొన్నారు. యువత అవకాశాలకోసం ఎదురుచూడకుండా, వాటిని సృష్టించుకోవాలని సూచించారు.

Updated Date - Oct 12 , 2025 | 03:33 AM