Share News

కర్నూలు ప్రమాదంతో... ప్రైవేటు బస్సులకు తగ్గిన ఆదరణ

ABN , Publish Date - Oct 28 , 2025 | 10:44 PM

కర్నూలు బస్సు ప్రమాదం ప్రజల కళ్లముందు ఇంకా కదలాడు తూనే ఉంది. ఆ ప్రమాదంలో ఓ ప్రైవేటు బస్సు అ గ్నికి ఆహుతికాగా, అందులో ప్రయాణిస్తున్న 19 మం ది మృత్యువాత పడ్డారు. ఇంకా ఆ చేదు జ్ఞాపకాలు చె దిరిపోకపోవడంతో దూర ప్రాంతాలకు బస్సు ప్రయా ణం అంటేనే ప్రజలు జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నా యి. ఈ నేపథ్యంలో ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం అం టేనే వెనుకంజ వేస్తున్నారు.

కర్నూలు ప్రమాదంతో...  ప్రైవేటు బస్సులకు తగ్గిన ఆదరణ

కర్నూలు ప్రమాదంతో...

ప్రైవేటు బస్సులకు తగ్గిన ఆదరణ

-గణనీయంగా తగ్గుముఖం పట్టిన బుకింగులు

-ఆర్టీసీ సర్వీసుల వైపే ప్రయాణికుల మొగ్గు

-నాలుగైదు రోజులుగా క్రమంగా పెరుగుతున్న రద్దీ

-దూర ప్రాంతాలకు అదనపు బస్సులు నడుపుతున్న ఆర్టీసీ

మంచిర్యాల, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కర్నూలు బస్సు ప్రమాదం ప్రజల కళ్లముందు ఇంకా కదలాడు తూనే ఉంది. ఆ ప్రమాదంలో ఓ ప్రైవేటు బస్సు అ గ్నికి ఆహుతికాగా, అందులో ప్రయాణిస్తున్న 19 మం ది మృత్యువాత పడ్డారు. ఇంకా ఆ చేదు జ్ఞాపకాలు చె దిరిపోకపోవడంతో దూర ప్రాంతాలకు బస్సు ప్రయా ణం అంటేనే ప్రజలు జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నా యి. ఈ నేపథ్యంలో ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం అం టేనే వెనుకంజ వేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే రైళ్లనో, ఆర్టీసీ బస్సులనో ఆశ్రయిస్తున్నారు తప్ప, ప్రైవేటు బస్సుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ పరిస్థితి ఉమ్మడి ఆదిలాబా ద్‌ జిల్లా వ్యాప్తంగా కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. క ర్నూలు ప్రమాదం జరిగిన నాటి నుంచి ప్రైవేటు బస్సు ల్లో బుకింగులు గణనీయంగా తగ్గుముఖం పట్టగా, ఆ ర్టీసీ సర్వీసులకు ఆధరణ పెరగడమే దీనికి నిదర్శనం గా నిలుస్తోంది.

ఉమ్మడి జిల్లా నుంచి ప్రైవేటు సర్వీసుల రాకపోకలు....

సాధారణ రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం పది వరకు ప్రైవేటు బస్సు సర్వీసులు మంచిర్యాల నుంచి హైదరాబాద్‌ మీదుగా బెంగుళూరు, కర్నూలు, అనంతపూర్‌ లాంటి దూర ప్రాంతాలకు వోల్వో ఏసీ, నాన్‌ ఏసీ, స్లీపర్‌, సీటర్‌ సర్వీసులు ప్రయాణికులను చేరవేస్తుంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యా ల, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి ని త్యం సగటున 200 మంది వరకు ప్రైవేటు బస్సులపై ఆధారపడి ప్రయాణాలు చేస్తుంటారు. పండుగలు, సె లవు దినాల్లో ప్రయాణికుల సంఖ్య మరింత అధికం గా ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన వంద లాది మంది యువత బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యో గాలు చేస్తుండగా, వారంతా ప్రత్యేక దినాల్లో సొంతూ ళ్లకు వస్తుంటారు. తిరుగు ప్రయాణంలో రవాణా సౌక ర్యం అంతగా అందుబాటులో ఉండక, వివిధ కంపెనీ లకు చెందిన ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తుంటారు. ఇందు కోసం నాలుగైదు రోజుల ముందే సీట్లు బుక్‌ చేసుకుంటారు. ప్రతి నిత్యం సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతం నుంచి ప్రైవేటు సర్వీసులు బయల్దేరుతుం డగా హైదారాబాద్‌ మీదుగా బెంగుళూరు వంటి దూర ప్రాంతాలకు ప్రయాణాలు సాగిస్తుంటాయి.

తగ్గుముఖం పట్టిన బుకింగులు...

కర్నూలులో బస్సు ప్రమాదం జరిగిన నాటి నుంచి ప్రైవేటు సర్వీసుల్లో బుకింగులు గణనీయంగా తగ్గుము ఖం పట్టినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి ని త్యం సగటున పది వరకు ప్రైవేటు సర్వీసులు నడవా ల్సి ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య సగానికి పడిపో యినట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా నుంచి ప్రై వే టు ఆపరేటర్లు నిర్వహించే కంపెనీలు ఐదారు ఉన్నా యి. వాటిలో మైత్రీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌, ఐఆర్‌ఏ ట్రాన్స్‌పోర్ట్స్‌, ఆరేంజ్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌, మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్స్‌, న్యూ ధనుంజయ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు మంచిర్యాల నుంచి హైదరాబాద్‌ మీదుగా బెంగుళూరుకు ప్రయాణాలు సాగిస్తాయి. గతంలో ఆ యా సర్వీసుల్లో నాలుగైదు రోజులు ముందుగానే బు కింగ్‌లు పూర్తయ్యేవి. ప్రస్తుతం వాటిలో ప్రయాణించే వారి సంఖ్య సగానికి పడిపోయినట్లు తెలుస్తోంది. దీ న్ని దృష్టిలో ఉంచుకుని ఆపరేటర్లు ఒక్కో టికెట్‌పై రూ. 500 వరకు రిబేటు ఇస్తున్నారు. అయినప్పటికీ ప్ర యాణికుల నుంచి పెద్దగా స్పందన లేదని సమాచారం.

ఆర్టీసీ బస్సులకు పెరిగిన ఆదరణ...

కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన తరువాత ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరిగినట్లు తె లుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి నేరుగా బెంగుళూరు వంటి దూర ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు లేకపోయి నా... ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ వరకు వెళ్లి అ క్కడి నుంచి బెంగుళూరు, తదితర ప్రదేశాలకు వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. ఆదిలాబాద్‌ ఆర్టీసీ రీజియన్‌లోని మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, ఆది లాబాద్‌ డిపోల నుంచి నిత్యం 160 సర్వీసులు హైదరా బాద్‌కు ప్రయాణికులను చేరవేస్తుంటాయి. కర్నూలు సంఘటన జరిగిన నాటి నుంచి మరో పది సర్వీలు పెంచినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పెరిగిన సర్వీసుల ద్వారా వందల సంఖ్యలో నిత్యం హైదరాబా ద్‌కు ప్రయాణం చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రైవేటు బస్సులను ఎక్కేందుకు ఇష్టపడని వారు ఆర్టీసీ సర్వీసు లను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆర్టీసీ సర్వీసుల ద్వారా ప్రయాణించే వారి సం ఖ్య క్రమేపీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల డిపో నుంచి గత ఆదివారం హైదరాబాద్‌కు వెళ్లే ప్ర యాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు ఇక్కడి అసిస్టెంట్‌ మేనేజర్‌ శ్రీలత తెలిపారు. గతంలో ఎన్న డూ లేని విధంగా రాత్రి సమయంలో రద్దీ పెరగడంతో అదనంగా మూడు సర్వీసులను నడిపినట్లు తెలిపారు.

ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది....

ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ భవానీ ప్రసాద్‌

గత నాలుగైదు రోజులుగా రాత్రి వేళల్లో హైదరాబా ద్‌కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిం ది. దీంతో రీజియన్‌ పరిధిలోని నాలుగు జిల్లాల నుంచి అదనంగా పది సూపర్‌ లగ్జరీ సర్వీసులను హైదరాబా ద్‌కు నడుపుతున్నాం. ఆయా సర్వీసుల ద్వారా నిత్యం 300 మంది వరకు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు సుశిక్షితులు కావడం, తరుచుగా బ్రీత్‌ అనలైజ ర్‌ పరీక్షలు నిర్వహిస్తుండటంతో మద్యం సేవించే అవ కాశాలు ఉండక సహజంగానే ప్రమాదాల సంఖ్య అతి తక్కువగా ఉండటంతోపాటు భద్రత ఉంటుందనే ఉద్దే శ్యంతో హైదరాబాద్‌ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నట్లు భావించాల్సి వస్తోంది.

Updated Date - Oct 28 , 2025 | 10:44 PM