అంతర్జాతీయ ప్రమాణాలతో...
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:41 PM
అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అధునాతన సౌకర్యాలతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తె లంగాణ పబ్లిక్ స్కూళ్లను నిర్మించతలపెట్టిందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
- తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులపై కలెక్టర్ బదావత్ సంతోష్
వంగూరు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అధునాతన సౌకర్యాలతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తె లంగాణ పబ్లిక్ స్కూళ్లను నిర్మించతలపెట్టిందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అభివృద్ధికి పాఠశాల అభివృద్ధి క మిటీ సభ్యులు సమస్వయంతో పనిచేసి దేశం లోనే ఇది మోడల్ పబ్లిక్ స్కూల్‌గా ఏర్పాటు చే సేలా కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. బు ధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాలలో పలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చే సిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ అభివృద్ధి పనుల పై అధికారులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్ష స మావేశం నిర్వహించారు. రా ష్ట్రంలో ప్రథమంగా మండ లంలోని పోల్కంపల్లి గ్రామం లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 కోట్లతో తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తు న్నదని తెలిపారు. అధునా తనభవనాలను కమిటీ సభ్యు ల ఆధ్వర్యంలో నిర్మించడం విశేషమని, పనుల ను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూ చించారు. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్యాంపస్ విద్యాలయంగా ఉంటుందని అన్నారు. అంతకు ముందు వంగూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ డిజైన్‌ను, కంపౌండ్ వాల్ నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో డీఈవో రమేష్ కుమార్, తహసీ ల్దార్ మురళీమోహన్, ఏంఈవో మనోహరచారి, ఎంపీడీవో బ్రహ్మాచారి, సర్పంచ్ పురుగుల యాదయ్య, నర్సిరెడ్డి, కోటేశ్వ ర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.