kumaram bheem asifabad- చలికాలం జరభద్రం
ABN , Publish Date - Nov 22 , 2025 | 10:46 PM
చలికాలంలో వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో జలుబు, దగ్గు, కాస్త ఎక్కువ. ఎందుకంటే వీటికి కారణమయ్యే వైరస్‌లు చల్లటి వాతావారణంలో తేలికగా, వేగంగా వృద్ధి చెందుతాయి. వ్యాపిస్తాయి. జాగ్రత్తలు పాటించకుంటే చిన్న పాటిగా వచ్చే రోగాలు కూడా ప్రాణాలకే ముప్పు తెస్తాయి.
చింతలమానేపల్లి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): చలికాలంలో వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో జలుబు, దగ్గు, కాస్త ఎక్కువ. ఎందుకంటే వీటికి కారణమయ్యే వైరస్‌లు చల్లటి వాతావారణంలో తేలికగా, వేగంగా వృద్ధి చెందుతాయి. వ్యాపిస్తాయి. జాగ్రత్తలు పాటించకుంటే చిన్న పాటిగా వచ్చే రోగాలు కూడా ప్రాణాలకే ముప్పు తెస్తాయి. ఉదయం వాకింగ్, జాగింగ్‌లకు వెళ్తే చర్మం పొడి బారి బిగుతుగా మారే అవకాశం ఉంటుంది. కాళ్లు పగుళ్లు, పెదాలు తడారడం లాంటి సమస్యలు వస్తాయి. ఉబ్బసం, ఆయాసం, గుండె జబ్బులు కలిగే అవకాశం ఉంది. చలి కాలంలో వివిధ రుగ్మతలు ఉన్నవారు జాగ్రత్తలు పాటిస్తే చలికూడా హాయిగానే ఉంటుంది.
- చలి మంటలు..
చలి కాలం అనగానే తెల్లవారు జామునే ఆరు బయట మంటలు వేసుకోవడం అల వాటు. మంటలు వేసుకొనే సమయంలో చిన్నారులను దగ్గర వెళ్లకుండా చూసుకోవాలి. మహిళలు చీర కొంగులను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. చలికాలంలో అస్థమా వ్యాధి బారిన పడిన వారు నిత్యం వాడే మందులను సిద్ధంగా ఉంచుకోవాలి. సిగరెట్ అలవాటు ఉన్నవారు మానేయాలి. దుమ్మూ దూళీ పనులకు దూరంగా ఉండాలి. చల్లని గాలిలో ఎక్కువగా తిరుగవద్దు. శ్వాస నాళాలు మూసుకోకుండా డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. ఇన్‌హేలర్, నెబులైజర్ వంటి వాటిని వాడితే మంచి పలితం ఉంటుంది. ముక్కు భాగంలో ఇన్‌ఫెక్షన్ ఎక్కువై, తెమడ పేరుకు పోయి ఇబ్బంది పడే వారు సిరప్‌లు వాడాలి. చలి కాలంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిం చే వారు హెల్మెట్ తప్పని సరిగా ఉపయోగించాలి. స్వెట్టర్ ధరించాలి.
- గుండె జబ్బు ఉన్నవారు..
చలి కాలంలో గుండె జబ్బు ఉన్నవారు గుండె ఆపరేషన్ చేయించుకున్నవారు వాకింగ్ చేయవద్దు. చలిలో ఎక్కువగా తిరుగడం వల్ల రక్త నాళాలు సంకోచించి గుండెకు సంబంధిత సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. బీపీ, షుగర్ ఉన్నవారు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. ఉన్న ఫలంగా చాతిలో నొప్పి, నడవలేక పోవడం, చెమటలు పట్టడం వంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్లను సంప్రదించాలి. చిన్నారులకు జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలి నుంచి రక్షణ కోసం స్వెట్టర్లను వేయాలి. వేడి నీటితో స్నానం చేయించాలి. ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారంలో ఆకు కూరలు ఎక్కు వగా ఉండేలా చూసుకోవాలి. సీతాఫలాలు, ఇస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు ఎట్టి పరిస్థితుల్లో తినిపించకూడదు.
- పాదాలు పగిలితే..
పాదాలు పగిలితే ఉప్పు నీరు కలిపిన గోరువెచ్చని నీటిలో పాదాలను 10 నిమిషాలు ఉంచాలి. ప్రతీ రోజూ పడుకునే ముందు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. నీటిలో ఉంచిన తర్వాత సబ్బుతో శుభ్ర పరుచుకొని పొడి గుడ్డతో తుడవాలి. పగిలిన చోట మాయిశ్చరైజ్ క్రీమ్ రాయాలి. విటమిన్-ఈ క్రీమ్ రాస్తే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్లను తప్పని సరిగా సంప్రదించాలి. ఉన్ని దుస్తులు, గ్లిజరిన్ సబ్బులు వాడడం వల్ల చలి కాలంలో ప్రతీ ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది.