kumaram bheem asifabad-క్రీడల్లో గెలుపోటములు సహజం
ABN , Publish Date - Dec 21 , 2025 | 09:54 PM
క్రీడల్లో గెలుపోటములు సహజమని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి అబ్దుల్ నదీమ్ ఖుద్దుషీ అన్నారు. స్థానిక తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలలో జరిగిన మూడో జోష్ జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు సభలో ఆదివారం ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా విద్యార్థులను ప్రోత్సహిస్తుందన్నారు.
కాగజ్‌నగర్ టౌన్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): క్రీడల్లో గెలుపోటములు సహజమని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి అబ్దుల్ నదీమ్ ఖుద్దుషీ అన్నారు. స్థానిక తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలలో జరిగిన మూడో జోష్ జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు సభలో ఆదివారం ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా విద్యార్థులను ప్రోత్సహిస్తుందన్నారు. కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమార స్వామి మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఓటమి చెందిన వారు నిరుత్సాహ పడకుండా భవిష్యత్తులో మరింత కృషి చేయాలన్నారు. క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునన్నారు. అనంతరం బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మైనారిటీ గురుకులాల ఆర్‌ఎల్‌సి రాజేందర్, విజిలెన్స్ అధికారి తాహెరుద్దీన్, ఆయా ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.