క్రీడల్లో గెలుపోటములు సహజం
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:43 PM
క్రీడల్లో గెలుపోటములు సహ జమని క్రీడాకారులు స్నేహపూర్వకంగా క్రీడల్లో పాల్గొనాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు.
మంచిర్యాల అదనపు కలెక్టర్ చంద్రయ్య
లక్షెట్టిపేట, నవంబరు6 (ఆంధ్రజ్యోతి): క్రీడల్లో గెలుపోటములు సహ జమని క్రీడాకారులు స్నేహపూర్వకంగా క్రీడల్లో పాల్గొనాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. గురువారం లక్షెట్టిపేట పట్టణం లోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకులంలో 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలిచినా ఓడినా సమానమే అన్నా రు. ఓటమి అనేది విజయానికి నాంది అన్నారు. ప్రతీ ఒక్కరూ స్నేహ బా వాలను అలవర్చుకుంటూ క్రీడల్లో పాల్గొనాలన్నారు. ప్రతీ ఏటా ఇక్కడ క్రీ డలను నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడలను అట్టహాసంగా పూర్తి చేయాలని సూచించా రు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈకార్యక్ర మంలో అడీషనల్ కలెక్టర్ వెంట తహసీల్దార్ దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ రమకళ్యాణి, సీనియర్ అ ధ్యాపకుడు మహేశ్వర్‌రావుతోపాట క్రీడల ఇన్‌చార్జి మల్లిక, ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాధరాణితోపాటు వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్, పీఈటీలు, క్రీడా కారులు, పేరెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.