Share News

కేసులతోనే సరిపెడతారా...?

ABN , Publish Date - Aug 09 , 2025 | 11:31 PM

అర్హత లేకపోయినా అక్రమార్కులకు రైతుబీమా పథకం కింద లబ్ది చేకూర్చి, ప్రజా ధనాన్ని పక్కదారి పట్టించిన బా ధ్యులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారు.

కేసులతోనే సరిపెడతారా...?

’’రైతుబీమా’’ నగదు రికవరీ ఊసేది

-నోటీసులు జారీ చేసి మిన్నకున్న అధికారులు

-ఆ పై చర్యలు తీసుకోవడంలో జాప్యం

-ఏళ్ల తరబడి సాగదీత

మంచిర్యాల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): అర్హత లేకపోయినా అక్రమార్కులకు రైతుబీమా పథకం కింద లబ్ది చేకూర్చి, ప్రజా ధనాన్ని పక్కదారి పట్టించిన బా ధ్యులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారు. బాధ్యులపై పోలీసులు కేసులు నమోదు చేయగా, ప్రస్తుతం కోర్టులో విచారణ సైతం జరుగు తోంది. అయితే అక్రమంగా లబ్దిపొందిన వారి నుంచి రెవెన్యూ రికవరీ యాక్టు కింద డబ్బులు తిరిగి సేకరిం చాల్సి ఉన్నా....సంబంధిత అధికారులు ఆ ఊసే ఎత్తడం లేదు.

రైతుల సంక్షేమం కోసం అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ప్రవేశపెట్టిన ’రైతుబీమా’ పథకంలో నెలకొన్న అవినీతి, అక్రమాలను ’’ఆంధ్రజ్యోతి’’ వెలుగులోకి తె చ్చింది. ’’రైతుబీమా పక్కదారి’’ శీర్షికన 2021జూలై 2న ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం పై స్పందించిన అప్పటి కలెక్టర్‌ భారతీ హోళికేరి మం చిర్యాల ఆర్డీవో దాసరి వేణును విచారణాధికారిగా ని యమించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్డీవో అదే రో జు దండేపల్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. బోగస్‌ పత్రాలు సృష్టించి పథ కానికి దరఖాస్తు చేశారని తేలడంతో 13-07-2021న వి చారణ అధికారి మండల తహసీల్దార్‌కు రెవెన్యూ రిక వరీ చట్టం 1864 ప్రకారం సొమ్ము రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నాలుగేళ్లు గడుస్తున్నా సొమ్ము రికవరీకి నోచుకోవడం లేదు.

అక్రమం జరిగిందిలా...

రైతుబీమా పథకంలో చేరేందుకు 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల వయస్సుగల రైతులు అర్హులు. అయితే దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన ఇద్దరు వ్యక్తుల పేరిట వయస్సు తగ్గించి పథకానికి దరఖాస్తు చేశారు. గ్రామానికి చెందిన గోపతి రాజయ్యకు 75 ఏ ళ్లు కాగా, బత్తుల రాజలింగయ్యకు 80 ఏళ్లు ఉన్న ప్పటికీ బోగస్‌ ఆధార్‌ కార్డులు సృష్టించి, వయస్సు త క్కువ చూపుతూ పథకంలో లబ్దిపొందారు. ఇదిలా ఉం డగా పై ఇద్దరు వ్యక్తులు వృద్ధాప్య పింఛన్లు కూడా పొందుతున్నారు. వృద్ధాప్య పింఛన్లు పొందాలంటే అ ప్పటి నిబంధనల ప్రకారం 59 ఏళ్లు పైబడి ఉండాలి. ఇందుకోసం ఒరిజినల్‌ ఆధార్‌కార్డులతో దరఖాస్తు చే సుకోగా, ఇద్దరి పేరిట పింఛన్లు మంజూరయ్యాయి. ఇలా అక్రమంగా రెండు పథకాలలో లబ్ది పొందుతున్న విషయాన్ని ’’ఆంధ్రజ్యోతి’’ వెలుగులోకి తెచ్చింది. ఈ త తంగమంతా నడిపించిన మధ్య దళారులతో కుమ్మ క్క యిన అప్పటి వ్యవసాయ శాఖ అధికారులు.... అర్హత లేకపోయినా పై ఇద్దరు రైతులకు రైతుబీమా పథకం వర్తింపజేశారు. రాజలింగయ్య 2019 మే 5న, రాజ య్య 2020 ఆగస్టు 28న చనిపోయారు. దీంతో బీమా సొమ్ము వారి నామినీల పేరిట చెరో రూ. 5 లక్షల చొ ప్పున మొత్తం రూ. 10 లక్షలు బ్యాంకు అకౌంట్లలో జ మ అయింది. అయితే అక్రమంగా పొందిన బీమా సొమ్మును లబ్దిదారుల నామినీల నుంచి రికవరీ చేయా లని కలెక్టర్‌ పోలీసులను సైతం ఆదేశించారు.

నోటీసులకే పరిమితం...

ఆర్డీవో ఆదేశాలతో సొమ్ము రికవరీ కోసం అధికా రులు బాధ్యులకు నోటీసులు జారీ చేశారు. రైతు బీమా లో అక్రమంగా సొమ్ము కాజేసిన బత్తుల రాజలింగ య్య, గోపతి రాజయ్యలకు నామినీలుగా ఉన్న బత్తుల రాజేశ్వరి, గోపతి నారాయణల నుంచి అక్రమంగా లబ్ది పొందిన సొమ్ము రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 10 లక్షలు రికవరీ చేయాలని ఆర్డీవో ఆదేశాలతో దండే పల్లి తహసీల్దార్‌ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు లబ్దిదారుల కుటుంబీకులు స్పందించకపోవడంతో వా రికి చెందిన భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇందు లో భాగంగా అదే నెలలో నామినీలు ఇరువురికి అప్పటి తహసీల్దార్‌ హన్మం త రావు సెక్షన్‌-7 కింద డిమాండ్‌ నోటీసులు జారీ చేశారు. కొర్విచెల్మలోని గోపతి నారాయణకు సంబంధించిన భూముల సర్వే నెంబర్లు 35/6ఏలో 1. 1 ఎకరాలు, 52/6/1లో 1. 2ఎకరాలు, 236/5/1లోని 0. 22 ఎకరాల భూము లతోపాటు ముత్యంపేటలోని బత్తుల రాజేశ్వరికి సంబంధించిన సర్వే నెంబ ర్లు 5/అలో 0. 4 ఎకరాలు, 39/అలో 0. 1 ఎకరాలు, 39/ఆలో 0. 32 ఎకరా లను జప్తు చేస్తున్నట్లు నోటీసులు జారీ అయ్యాయి. అక్రమంగా రైతు బీమా సొమ్ము పొందినందున తక్షణమే నామినీలు ఇద్దరు చెరో రూ. 5 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలని, లేనియెడల పైన పేర్కొన్న భూములను బహిరం గ వేలం ద్వారా విక్రయించి, సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమచేయ ను న్నట్లు తహసీల్దార్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నాలుగేళ్లు గడిచినా సొ మ్ము రికవరీ చేయకపోగా, కేవలం నోటీసుల జారీకే పరిమితం కావడం గమనార్హం.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు...

రైతు బీమా పక్కదారి సంఘటనలో నిందితులపై దండేపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. సంఘటనపై విచారణ జరిపిన మంచిర్యాల ఆర్డీ వో ఆదేశాలతో వ్యవసాయశాఖ అప్పటి ఏఈవో సాయికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ మార్గంలో రైతు బీమా పొందిన మృతులకు నామినీగా ఉన్న బత్తుల రాజేశ్వరి, ఆమె భర్త తిరుపతి, గోపతి నారాయణ తోపాటు మధ్యవర్తిత్వం నెరిపిన ముత్యంపేట ఎంపీటీసీ ముత్తె రాజయ్యపై ఐపీసీ 417, 420, 34 సెక్షన్ల కింద స్థానిక ఎస్సై శ్రీకాంత్‌ కేసు నమోదు చే శారు. ఈ విషయమై మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన కొండ నరేష్‌ అదే నెలలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. రైతు బీమా అక్రమాల విషయంలో రాజకీయంగా ప్రమేయం ఉన్నందున కేసు నీరుగారి పోకుండా ఉండే ఉద్దేశ్యంతో ఆయన హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశా రు. బాఽధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకావడంతో కోర్టులో విచారణ జరుగు తోంది. అయితే సొమ్ము రికవరీకి నోటీసులు జారీ చేసినప్పటికీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు.

Updated Date - Aug 09 , 2025 | 11:31 PM