సమస్యలు చెబుతామంటే అరెస్టు చేస్తారా?
ABN , Publish Date - May 19 , 2025 | 11:16 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్లమల పర్యటనకు వస్తున్నందున నియోజకవ ర్గంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్త లను పోలీసులు ముందుస్తు అరెస్టు చేశారు.
- పలు ప్రాంతాల్లో బీజేపీ నాయకుల ముందస్తుగా అరెస్ట్
అచ్చంపేటటౌన్/ అమ్రాబాద్/ తెలకపల్లి, మే 19 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్లమల పర్యటనకు వస్తున్నందున నియోజకవ ర్గంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్త లను పోలీసులు ముందుస్తు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుంటారన్న స మాచారంతో ఎక్కడికక్కడా బీజేపీ నాయకుల ను అరెస్టు చేశారు. అచ్చంపేటలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు బల్మూరి జానకి, రామచంద్రయ్య, బాలాజీ, తేజస్విని, రవి, సాంబయ్యను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. నల్లమలలో నెలకొన్న సమస్యల ను సీఎం దృష్టికి తీసుకెళ్దామంటే తమను అరె స్టు చేయడం ఎంత వరకు సమం జసమని అరె స్టయిన బీజేపీ నాయకులు ప్రశ్నించారు.
ఫ అమ్రాబాద్‌లో అరెస్ట్ చేసిన వారిలో బీజే పీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు, మండల అధ్యక్షు డు గోలి నాగరాజు, నాయ కులు శంకర్‌గౌడ్, ఉప్పల ప రమేష్, పరమేష్‌గౌడ్, సా యి. శంకర్‌లు ఉన్నారు. సీ ఎం నల్లమల ప్రాంతానికి శా శ్వత సాగునీరు ప్రాజెక్టులు ప్రకటించాలని నాగరాజు డిమాండ్ చేశారు.
ప్రశ్నించే గొంతుకలను కట్టడి చేసేందుకే అక్రమ అరెస్టులు : స్వేరోస్
తెలకపల్లి, మండల కేంద్రంలో ఉన్న స్వేరోస్ నాయకులను సోమవారం పోలీసులు ముంద స్తు అరెస్టు చేశారు. స్వేరోస్ జిల్లా ప్రధాన కార్య దర్శి రెడ్డపాకుల శివశంకర్ మాట్లాడుతూ... గు రుకులంలో ఒకేషనల్ విద్య కోర్సులను తొలగిం చడంపై ప్రశ్నిస్తున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్ములను కట్టడి చేసే ప్రయత్నం చేస్తుందని ఈ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని హెచ్చరించారు. పరమేశ్వర్, బల్మూర్ మల్లేష్‌ను మార్గమధ్యలో అరెస్టు చేశారు.