మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తా
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:06 PM
మై నార్టీల సంక్షేమానికి కృషి చే స్తానని నాగర్‌కర్నూల్ ఎమ్మె ల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అ న్నారు.
- ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి
- జామే మసీద్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నాగర్‌కర్నూల్, సెప్టెంబ రు 25 (ఆంధ్రజ్యోతి) : మై నార్టీల సంక్షేమానికి కృషి చే స్తానని నాగర్‌కర్నూల్ ఎమ్మె ల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అ న్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జామే మసీద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయ న శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేను ముస్లింలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ చైర్మన్ రమణారావు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబ్, మాజీ కౌన్సిలర్ నిజాం, జామేమసీద్ కమిటీ ఉపాధ్య క్షుడు ఖాదర్, మత పెద్దలు షేక్ యాకుబ్, హబీబ్‌ఖాన్, ఖాజుబాబా, పేషీమామ్ అబ్దుల్‌హక్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలి
కందనూలు : ప్రభుత్వ పథకాల గురించి ప్ర జలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని నా గర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో గురువారం నాగర్‌కర్నూల్ పట్ట ణం, తాడూరు, బిజినేపల్లి మండలాలకు సం బంధించిన 81 కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక ్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మాజీ కౌ న్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ మం డలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యువ జన నాయకులు, మహిళా నాయకులు, లబ్ధిదా రులు పాల్గొన్నారు.
గాంధీజీ విగ్రహాల ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ
నాగర్‌కర్నూల్ టౌన్ : గాంధీజ్ఞాన్ ప్రతిష్ఠా న్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ స్వర్ణోత్సవాల సంద ర్భంగా అక్టోబరు 10, 11, 12, 13 తేదీల్లో హైద రాబాదు ఎల్బీ స్టేడియం గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కార్యక్రమానికి సంబంధించి ప్రచార పోస్టర్‌ను గురువారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి ఆవిష్కరించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ గాంధీ విగ్రహాల ప్రదర్శన స్వదేశీ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయ కులు, సభ్యులు పాల్గొన్నారు.