Share News

మార్పు వచ్చేనా..?

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:37 AM

ఎవరికి వారే..యమునా తీరే అన్నట్లుగా మారింది మి ర్యాలగూడ మునిసిపాలిటీ పరిస్థితి. పాలకవర్గం లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆటగా మా రింది. విభాగానికో అధికారి పెత్తనం చెలాయి స్తూ అవినీతికి పాల్పడుతున్నాడనే ప్రచారం జరుగుతోంది.

 మార్పు వచ్చేనా..?
మిర్యాలగూడ మునిసిపల్‌ కార్యాలయం

మార్పు వచ్చేనా..?

మునిసిపల్‌ కార్యాలయంపై ప్రత్యేక దృష్టి

స్పెషల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్‌

(మిర్యాలగూడటౌన, ఆంధ్రజ్యోతి)

ఎవరికి వారే..యమునా తీరే అన్నట్లుగా మారింది మి ర్యాలగూడ మునిసిపాలిటీ పరిస్థితి. పాలకవర్గం లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆటగా మా రింది. విభాగానికో అధికారి పెత్తనం చెలాయి స్తూ అవినీతికి పాల్పడుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే గ్రీన బడ్జెట్‌ పేరుతో నిధులు స్వాహా జరిగిందనే వార్త గుప్పుమనగా, సమగ్ర విచారణ జరిపించాలని మునిసిపల్‌ మాజీ చైర్మన కలెక్టర్‌, ఎమ్మెల్యేలను సోషల్‌ మీడియా వేదికగా కోరారు. అవెన్యూ ప్లాంటేషన పేరుతో మునిసిపల్‌ అధికారులు రూ.70లక్షలు కాజేసేందుకు చెక్కులు జారీ చేశా రు. ఇదే విషయం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మిర్యాలగూడ మునిసిపాలిటీ స్పెషల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే కార్యాలయంలోని పలువురు ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో కార్యాలయ పనితీరులో మార్పు వచ్చేనా.. అని పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

మెమోలు జారీ చేసిన అదనపు కలెక్టర్‌

మునిసిపల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అమిత నారాయణ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. వెనువెంటనే కార్యాలయ అధికారుల పనితీరుపై ఆరా తీశారు. అవెన్యూ ప్లాంటేషన పేరున మొక్కలు నాటకుండానే బిల్లులు ఎలా రికార్డు చేశారంటూ ప్రశ్నించారు. జారీ చేసిన చెక్కులు పాస్‌ కాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. కార్యాలయంలో పలువురు అధికారులు, ఉద్యోగు ల శాఖలు మార్చారు. టౌన ప్లానింగ్‌ ఆఫీసర్‌ సోమయ్య విధులకు సక్రమంగా హాజరు కాని కారణంగా ఆ శాఖ డైరెక్టరేట్‌కు సరెండర్‌ చేశా రు. ఇంజనీరింగ్‌ విభాగ ఉన్నతాధికారి, అకౌంటెంట్‌, ఆపరేటర్‌, అసిస్టెంట్లకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. విధులపై నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పౌరసేవలు అందించడంలో జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు.

ఆ రెండు శాఖలే కీలకం

మునిసిపల్‌ కార్యాలయంలోని ఇంజినీరిం గ్‌, పట్టణ ప్రణాళిక విభాగాల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అక్కడుండే అధికారులు ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. ఇంజనీర్లు ఫీల్డ్‌ వర్క్‌ అని కాంట్రాక్లర్లతో చక్కర్లు కొడుతుండగా, అదనపు బాధ్యతలు, డిప్యుటేషన్లంటూ టౌన ప్లానింగ్‌ అధికారులు లైసెన్సడ్‌ ఇంజనీర్లతో మమేకమవుతున్నారు. ఈ తరుణంలో పనుల నిమిత్తం ఆ యా సెక్షన్లకు వచ్చిన సాధారణ పౌరులకు అ క్కడుండే దిగువ స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు

స్పెషల్‌ ఆఫీసర్‌ ఆదేశాలతో కార్యాలయంలోని ప్రతీ విభాగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. అవినీతి, అక్రమాలకు తావులేకుండా చూస్తున్నాం. విధులపై నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై చర్యలు తప్పక ఉంటాయి. పలు విభాగాల అధికారులు, ఉద్యోగులను మార్చడంతో పాటు కొందరికి నోటీసు ఇవ్వడం జరిగింది.

- యూసుఫ్‌, కమిషనర్‌

Updated Date - Jun 03 , 2025 | 12:37 AM