Share News

రహదారి సమస్య తీరేదెన్నడు..?

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:06 PM

దశాబ్ధాల రహదారి సమస్యకు పరిష్కారం చూపడంలో మున్సిప ల్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తు న్నారు. ప్రైవేటు స్థలం అయినందున రోడ్డు ఏర్పాటుకు అడ్డంకులు కలుగుతుండగా, పట్టణ ప్రజలు ఇబ్బందు లు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

రహదారి సమస్య తీరేదెన్నడు..?
ప్రైవేటు స్థలమంటూ గతంలో యజమాని ఏర్పాటు చేసిన బోర్డు

సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు

-భూ సేకరణలో తాత్సారం

-దశాబ్ధాల పాటు కొనసాగుతూనే ఉన్న చర్చలు

-ప్రైవేటు స్థలమంటూ బోర్డు ఏర్పాటు

మంచిర్యాల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): దశాబ్ధాల రహదారి సమస్యకు పరిష్కారం చూపడంలో మున్సిప ల్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తు న్నారు. ప్రైవేటు స్థలం అయినందున రోడ్డు ఏర్పాటుకు అడ్డంకులు కలుగుతుండగా, పట్టణ ప్రజలు ఇబ్బందు లు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మంచిర్యాల జి ల్లా కేంధ్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో రహదారి సమ స్య పుర: ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుండగా బెల్లం పల్లి చౌరస్తాలో మాత్రం రోడ్డు నిర్మాణానికి తీవ్ర అ డ్డంకులు ఏర్పడుతున్నాయి. బెల్లంపల్లి చౌరస్తా నుంచి పడమర వైపున ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఇస్లాంపురలో ప్రయాణించేందుకు సరియైన రహదారి లేదు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థలం చౌరస్తాలో అందుబాటులో ఉన్నప్పటికీ అది ప్రైవేటు భూమి కా వడంతో పనులు చేపట్టడంలో యంత్రాంగానికి బ్రేకులు పడుతున్నాయి. స్థలానికి సంబంధించి కోర్టులో కేసు న డుస్తుండటంతో పరిష్కారం దిశగా ఆలోచనలు చేసేం దుకు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ తీ సుకోవడం లేదు. దీంతో బెల్లంపల్లి చౌరస్తాలో తరు చు గా ట్రాఫిక్‌ జాం అయి ప్రయాణికులు ఇబ్బందులు ప డుతున్నారు. ఇరుకైన రోడ్డు కావడంతో ఇరువైపులా వె ళ్లే వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని...

బెల్లంపల్లి చౌరస్తాలో ఇస్లాంపుర వైపు ఉన్న రోడ్డును విస్తరించాలటే స్థలం యజమాని అంగీకారం తప్పని స రి. ప్రైవేటు భూమి కావడంతో నష్టపరిహారం చెల్లిస్తే గానీ పనులు ముందుకు సాగే పరిస్థితులు లేవు. ఈ విషయమైౖ అనేక సార్లు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశా ల్లో చర్చ జరిగినప్పటికీ కేవలం నష్టపరిహారం చెల్లిం చాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో అప్పటి పాలక వర్గాలుగా నీ, అధికారులుగానీ చొరవ చూపలేదు. దీంతో సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయా రు కాగా ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నె లకొన్నాయి. ప్రజాధనం ప్రజల కోసం ఖర్చు చేయడం లోనూ తాత్సారం చేయడంతో అప్పట్లో తేలికగా పరి ష్కారం అయ్యే సమస్య ప్రస్తుతం జఠిలమై కూర్చుంది. మంచిర్యాల పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ తరువాత దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం మున్సిపల్‌ కా ర్పొరేషన్‌గా రూపాంతరం చెందడంతో నగరంలో జన సంచారం కూడా విపరీతంగా పెరిగింది. ప్రధాన రహ దారులు ఎప్పుడు రద్దీగా ఉంటున్నాయి. నగరం నడిబొ డ్డున ఉన్న బెల్లంపల్లి చౌరస్తా అత్యంత ముఖ్యమైన కూడలి. ఈ కూడలి ద్వారా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ప్రస్తుత పరిస్థితు ల్లో రోడ్డు వెడల్పు అనివార్యం అయింది. అంతేకాకుండా ఇస్లాంపుర ప్రస్తుతం మెడికల్‌ హబ్‌గా మారింది. ఆ ప్రాంతంలో పదుల సంఖ్యలో వివిధ ప్రత్యేకతలు గల ఆసుపత్రులు ఏర్పాటయ్యాయి. నిత్యం వందల సంఖ్య లో రోగులు, వారి కుటుంబీకులు బెల్లంపల్లి చౌరస్తా మీ దుగానే ఆసుపత్రులకు వెళ్తుంటారు. అలాగే రాళ్లపేట లోని రోడ్డు నెంబరు 1 నుంచి మొదలుకొని 5 వరకు ని వాసం ఉంటున్న ప్రజలు కూరగాయల మార్కెట్‌, వివి ధ షాపింగ్‌ల నిమిత్తం బెల్లంపల్లి చౌరస్తా మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే రోడ్డు సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో వారంతా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

చొరవ తీసుకోని వైనం...

బెల్లంపల్లి చౌరస్తాలో నెలకొన్న సమస్యను పరిష్క రించడంలో దశాబ్ధాల కాలంగా మున్సిపల్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవడం లేదనే ఆరోపణ లు ఉన్నాయి. స్థలం యజమాని 1970లో సదరు భూ మిని కొనుగోలు చేశాడు. అనంతరం 1973లో మున్సి పాలిటీ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించింది. మాస్టర్‌ ప్లాన్‌ కు ముందే స్థలం కొనుగోలు చేసినందున న్యాయబ ద్దంగా యజమాని కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూ డా యజమానికి నష్టపరిహారం చెల్లించి స్థలం సేకరిం చాలని మున్సిపాలిటీకి సూచించింది. దీంతో సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టీ పట్టనట్లు వ్యవహించారు. ఇది లా ఉండగా దాదాపు మూడున్నరేళ్ల క్రితం సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్‌ అధికారులు కొంతమేర ప్రయత్నించారు. భూ యజమానితో మాట్లాడటం ద్వా రా నష్టపరిహారం తీసుకొనేలా ఒప్పించగలిగారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్‌ (ప్రభుత్వం ధర) విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయిం చారు. దీనికి సంబంధించిన ఫైలును కలెక్టర్‌ ఆమోదం కోసం కూడా పెట్టారు. అయితే ఖరీదైన స్థలం కావడం, రూ. 6 కోట్ల మేర చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో అ ప్పటి కౌన్సిల్‌ అభ్యంతరం తెలపడంతో ఆ ప్రక్రియ అక్కడితో నిలిచిపోయింది. అయితే సమస్యను పరిష్క రించడంలో జాప్యం కారణంగా....యజమాని అది ప్రైవే టు భూమి అని, ఆక్రమణ చేయడం చట్ట విరుద్దమం టూ అప్పట్లో రోడ్డు మధ్యలో అడ్డంగా బోర్డు ఏర్పాటు చేశారు. అయినా మున్సిపాలిటి నుంచి స్పందన లేకపో వడంతో యజమాని తిరిగి రోడ్డుకు అడ్డంగా సిమెంట్‌ స్తంబాలు ఏర్పాటు చేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆ తరువాత సిమెంట్‌ స్తం భాలు తొలగించినప్పటికీ రోడ్డు సమస్య ఎప్పటిలాగే ఉంది. మంచిర్యాల నగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మారినందున ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు, జి ల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ర హదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 02 , 2025 | 11:07 PM