విద్యాహక్కు చట్టం అమలయ్యేనా..?
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:22 PM
రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుకాకపోవడంతో ప్రత్యేక విభాగాలకు చెందిన విద్యార్థులు తీవ్ర అన్యాయం జ రుగుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ ప్రకారం దేశంలోని 6 నుంచి 14 ఏళ్ల వయస్సుగల పిల్లలందరికీ తప్పనిసరిగా ఉచిత, నిర్బంధ విద్య అమలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా పిల్లల కు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (1 నుంచి 8 తరగతు లు)ను ఉచితంగా అభ్యసించే హక్కును కల్పించింది.

-2009 చట్టానికి ఆదిలోనే పాతర
-ఉచిత విద్యకు నోచుకోని పేద విద్యార్థులు
-ప్రైవేటు బడుల్లో అమలుగాని 25 శాతం రిజర్వేషన్
-కోర్టు ఆదేశాలతోనైనా కదలిక వచ్చేనా...?
మంచిర్యాల, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుకాకపోవడంతో ప్రత్యేక విభాగాలకు చెందిన విద్యార్థులు తీవ్ర అన్యాయం జ రుగుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ ప్రకారం దేశంలోని 6 నుంచి 14 ఏళ్ల వయస్సుగల పిల్లలందరికీ తప్పనిసరిగా ఉచిత, నిర్బంధ విద్య అమలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా పిల్లల కు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (1 నుంచి 8 తరగతు లు)ను ఉచితంగా అభ్యసించే హక్కును కల్పించింది. ఏదేని కారణం చేత ఎలిమెంటరీ విద్యను అభ్యసిం చని యెడల ఎలాంటి ప్రాథమిక విద్య చదవాల్సిన అవసరం లేకుండానే విద్యార్థి నేరుగా తన వయస్సు కు సరిపడా తరగతిలో చేరే అవకాశాన్ని కూడా ఆర్టికల్ 21ఏ కల్పించింది.
అమలుకాని చట్టం...
ఎలిమెంటరీ స్థాయిలో పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య అమలు చేసేందుకు గాను 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా విద్యాహక్కు చట్టం -2009ని రూపొందించింది. ఇందులో భాగంగా ప్ర భుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తమ విద్యార్థులకు తప్పనిసరిగా విద్యాహక్కు చట్టం అమలు చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఈ చట్టం అమలుకు నో చుకోకపోవడంతోపాటు ఆదిలోనే చట్టం నిర్వీర్యం అయింది. ప్రభుత్వాల వైఖరి కారణంగా ప్రత్యేక అ ర్హతలుగల విద్యార్థులకు తీరని అన్యాయం జరు గుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చట్టాన్ని విస్మ రించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏ పాఠశాలలోనూ అది అమలు కావడం లేదు. విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం పిల్లలను చేర్చుకోవడంలో ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రత్యేక పాఠశాలలు 25 శాతం రిజర్వేష న్ అమలు చేయాల్సి ఉంది. చట్టం ప్రకారం అనాధ లు, అంగవైకల్యంగల పిల్లలు, హెచ్‌ఐవీ సోకిన పిల్ల లకు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యలో 5 శాతం ఉచిత విద్యను అందించాల్సి ఉండగా, షెడ్యూల్డ్ కు లాల(ఎస్సీ)కు 10 శాతం, షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) లకు 4 శాతం, బలహీన వర్గాలు (బీసీ), మైనారి టీ లకు-6 శాతం ఉచితంగా విద్యను బోధించాల్సి ఉంది.
ఉచిత విద్యకు ప్రైవేటు విద్యాసంస్థల వెనుకంజ..
విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రత్యేక అర్హతలు గల విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు ప్రైవేటు యాజమాన్యాల కింద పనిచేసే విద్యాసం స్థలు వెనుకంజ వేస్తున్నాయి. బడ్జెట్ పాఠశాలలను మినహాయిస్తే దనార్జనే ధ్యేయంగా పని చేస్తున్న కా ర్పొరేట్, ఇతర ప్రైవేటు విద్యా సంస్థలు చట్టాన్ని తుంగలో తొక్కడమేగాకుండా, ప్రశ్నించిన వారికి అ డ్మిషన్లు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నట్లు తెలుస్తోం ది. జిల్లాలో 200 వరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఉండగా, పదుల సంఖ్యలో కా ర్పొరేట్ విద్యా సంస్థలు పని చేస్తున్నాయి. అన్ని ప్రై వేటు విద్యాలయాల్లో కలిపి దాదాపు 60వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆయా పాఠశా లల్లో ఎక్కడ కూడా విద్యాహక్కు చట్టం అమలు కా వడం లేదు. ప్రశ్నించే వారు లేక విద్యా సంస్థల ని ర్వాహకులు వేలకు వేలు ఫీజుల రూపంలో వసూ లు చేస్తున్నారు. విద్యార్థుల పక్షాన పోరాడాల్సిన వి ద్యార్థి సంఘాల నాయకులు కూడా విద్యాహక్కు చ ట్టంపై యాజమాన్యాలను ప్రశ్నించకపోవడం గమ నార్హం. రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విషయమై ధృష్టిసారించకపోవడంతో చ ట్టం నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సె లవులు ఉన్నాయి. అనంతరం జూన్‌లో రాష్ట్ర వ్యా ప్తంగా పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. వి ద్యా సంవత్సరం ఆరంభం నుంచే విద్యాహక్కు చ ట్టం అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడితే ప్ర త్యేక అర్హతలుగల విద్యార్థులకు మేలు చేకూర్చిన ట్లు అవుతుంది.
కోర్టు ఆదేశాలతోనైనా కదలిక వచ్చేనా...?
పేదలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం రిజ ర్వేషన్ల కల్పనపై హామీ ఇవ్వాలని ఇటీవల రాష్ట్ర ప్ర భుత్వానికి హై కోర్టు ఆదేశించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం అమలుకోసం జారీ చేసిన మెమోను నిజమైన స్పూర్తితో అమలు చేస్తామని అండర్ టేకింగ్ కోరింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడం లే దంటూ 2020లో హైకోర్టులో పలు ప్రజాప్రయో జ న వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇదే విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు కూడా రెం డుసార్లు విచారణ చేపట్టింది. మరోవైపు రాష్ట్ర ప్రభు త్వం గతేడాది అక్టోబర్ 19న మెమో జారీ చేసినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. హైకోర్టు ఆదే శాలతోనైనా రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకుంటుందా అనే ప్రశ్నలు పోషకుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.