Share News

kumaram bheem asifabad-చేయూత పింఛన్‌ పెంపేదీ..?

ABN , Publish Date - Oct 28 , 2025 | 10:01 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్న చేయూత పెన్షన్ల పెంపు ఊసేత్తడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2,016 పెన్షన్‌ ఇచ్చింది. తాము అధికారంలోకి వ స్తే చేయూత పెన్షన్లు రెండింతలు చేస్తామని చెప్పిం ది. కుటుంబంలో ఇద్దరికి సమానంగా పెన్షన్లు ఇస్తామని 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నాయకులు హామీ ఇచ్చారు. కాని ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్న హామీ అమలు కావడం లేదని పెన్షన్‌దారులు ఆవేదన చెందుతున్నారు.

kumaram bheem asifabad-చేయూత పింఛన్‌ పెంపేదీ..?
పోస్టాపీసు వద్ద వేచి ఉన్న పింఛన్‌దారులు

- స్పష్టత ఇవ్వని సర్కార్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్న చేయూత పెన్షన్ల పెంపు ఊసేత్తడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2,016 పెన్షన్‌ ఇచ్చింది. తాము అధికారంలోకి వ స్తే చేయూత పెన్షన్లు రెండింతలు చేస్తామని చెప్పిం ది. కుటుంబంలో ఇద్దరికి సమానంగా పెన్షన్లు ఇస్తామని 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నాయకులు హామీ ఇచ్చారు. కాని ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్న హామీ అమలు కావడం లేదని పెన్షన్‌దారులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం వస్తున్న పింఛన్‌ తమ అవసరాలకు ఉపయోగపడుతున్నప్పటికీ ప్రస్తుతం నిత్యవసరాల ధరలు భారీగా పెరుగడంతో ప్రభుత్వం పెన్షన్‌ డబ్బులు ఏ మాత్రం సరి పోవడం లేదని పెన్షన్‌ దారులు వాపో తున్నారు. ప్రభుత్వం పింఛన్‌ పెంపు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

- మేనిఫెస్టో ద్వారా..

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వృద్ధులు, దివ్యాం గులు, ఒంటకి మహిళలకు చేయూత పథకం కింద అదనంగా రెండు వేల రూపాయలు పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ సర్కార్‌ పింఛన్ల పెంపుపై స్పష్టత ఇవ్వక పోవడంతో లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. హామీల్లో భాగంగా ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీ అమల్లో నిమగ్నమైన ప్రభుత్వం పింఛన్‌ పెంపు విషయం మరిచి పోయిందని పెన్షన్‌ లబ్ధిదారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కొలువు తీరిన ప్రభుత్వం తమ పింఛన్‌ పెంచుతుందని ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నామని పెన్షన్‌దారులు వాపోతున్నా రు. వృద్ధులకు ఇచ్చే పింఛన్‌ రూ.2,016 నుంచి రూ.4,016కు, దివ్యాంగులకు రూ.4,016 నుంచి రూ.6,016కు పెంచుతామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెబుతున్నారు. ఆ హామీ ప్రకారం చేయూత పింఛన్‌ పెంచి ఆదుకోవాలని లబ్ధిదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

- పింఛన్‌దారులు ఇలా..

జిల్లాలో మొత్తం 56,225 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఇందులో వృద్ధాప్య పింఛన్‌దారులు 24,23 5, దివ్యాంగులు 5,974, వితంతులు 22,095, చేనేత పింఛన్‌ 489, గీత కార్మికులు 139, బీడీ కార్మికులు 86, ఒంటరి మహిళలకు 2,605, ఫైలేరియా బాదితులు 567, డయాలసిస్‌ బాధితులు 35 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ. 13కోట్లపెగా చేయూ త పింఛన్ల ద్వారా అందజేస్తున్నారు.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..

- ఇస్లాంబీన్‌ హసన్‌, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి

ప్రభుత్వం చేయూత పింఛన్ల పెంపునకు చర్యలు తీసుకోవాలి. నిత్యవసర ధరలు విపరితంగా పెరిగా యి. గత ప్రభుత్వం దివ్యాంగులకు చేయూత పింఛ న్‌ కింద రూ.4,016 ఇచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వృద్ధులుకు ఇచ్చే పింఛన్‌ రూ.2,016 నుంచి రూ.4,016, దివ్యాంగులకు రూ.4,016 నుంచి రూ, 6,016 ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచి అందజేయాలి.

Updated Date - Oct 28 , 2025 | 10:01 PM