సాగు సమస్య తీరేనా...?
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:03 PM
ప్రభుత్వ భూ ముల్లో సాగు చేసుకుంటున్న పేదలకు ఇకనైనా మేలు జరుగుతుందా...అంటే ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ అ వకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భూములు లేని ని రుపేదలు, ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో ప్రభుత్వ భూ ముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ఇబ్బందు లు తప్పడం లేదు.
నిర్వీర్యమైన అసైన్‌మెంట్ చట్టం
జిల్లాస్థాయి నూతన కమిటీకి ప్రభుత్వం సన్నాహాలు
ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న వందలాది మంది
అధికారికంగా పత్రాలు లేకపోవడంతో తప్పని ఇబ్బందులు
మంచిర్యాల, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూ ముల్లో సాగు చేసుకుంటున్న పేదలకు ఇకనైనా మేలు జరుగుతుందా...అంటే ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ అ వకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భూములు లేని ని రుపేదలు, ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో ప్రభుత్వ భూ ముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ఇబ్బందు లు తప్పడం లేదు. గతంలో ఈ సమస్యను పరిష్క రిం చేందుకు అప్పటి ప్రభుత్వాలు అసైన్‌మెంట్ చట్టానికి రూపకల్పన చేశాయి. ఇందులో భాగంగా భూ ములు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూములను అసైన్ చేయ డం ద్వారా అధికారికంగా వారికి సాగు హక్కులను క ల్పించేవారు. దీంతో లబ్ధిదారులు ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం గడిపేవారు. ఇందులో భా గంగా లబ్దిదారుల ఎంపిక, అర్హులకు భూములు పంపి ణీ చేసేందుకు అసైన్‌మెంట్ కమిటీలు సమావేశం అ య్యేవి. అయితే 13 ఏళ్లుగా అసైన్‌మెంట్ కమిటీ సమా వేశాలు ఏర్పాటు కాకపోవడం, ప్రభుత్వాలు సైతం ఈ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అ సైన్‌మెంట్ చట్టం రాష్ట్రంలో నిర్వీర్యం అయింది.
వెంచర్లుగా మారిన ప్రభుత్వ భూములు....
అసైన్‌మెంట్ చట్టం అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ భూములు పొందిన లబ్ధిదారులు వాటిని సా గు చేసుకున్నా...కాల క్రమంలో వాటికి రెక్కలు వచ్చా యి. లబ్ధిదారుల్లో అనేక మంది తమ పేరిట అసైన్ అ యిన భూములను విక్రయించగా, ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వాస్తవానికి అసైన్ భూములు లబ్దిదారు లు, ఆ తరువాత వారి వారసులు సాగు చేసుకోవడానికి మాత్రమే ఉద్దేశించినవి. ఆయా భూములను విక్రయిం చడం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరం. అయినప్ప టికీ జిల్లాలో పెద్ద మొత్తంలో అసైన్డ్ భూములు ఇత రుల పేరిట పట్టాలుగా మారడం గమనార్హం. లబ్ధి దా రుల నుంచి అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తున్న పలువురు వాటిని ప్లాట్ల వెంచర్లుగా మార్చి విక్రయిస్తు న్నా అడిగేవారు లేరు.
కమిటీ ప్రమేయం లేకుండానే....
అసైన్‌మెంట్ కమిటీ ప్రమేయం లేకుండానే ప్రభుత్వ భూములు ఇతరుల పేరిట పట్టాలుగా మారిన సంఘ టన దండేపల్లి మండలం అందుగుల పేటలో ఇటీవల చోటు చేసుకుంది. సర్కారు భూములను అసైన్‌మెంట్ పేరుతో అక్రమంగా కట్టబెట్టిన దాఖలాలు వెలుగు చూ శాయి. అధికారులు వాటికి లావుణి పట్టాలు జారీ చేశా రు. పైగా కమిటీ ప్రమేయం లేకుండానే నేరుగా రెవె న్యూ అధికారులు పట్టాలు జారీ చేయడం గమనార్హం. వాటికి పాసు పుస్తకాలు కూడా పుట్టుకొచ్చాయి. అందు గులపేటలో సర్వే నెంబర్లు 9, 49లో సుమారు 55 ఎక రాలను అసైన్‌మెంట్ చట్టాన్ని తుంగలో తొక్కుతూ గ్రా మానికి చెందిన 50 మంది పేర్లను అక్రమంగా రికా ర్డుల్లో నమోదు చేసిన రెవెన్యూ అధికారులు వాటికి ప ట్టాలు జారీ చేశారు. సర్వే నెంబర్ 9లో 28 ఎకరాలకు పట్టాలు పుట్టుకురాగా, సర్వే నెంబర్ 49లో మరో 27 ఎకరాలు ఇతరుల పేరిట పట్టాలుగా మారాయి. స్థానిక నాయకులు కొందరు సహకారంతో అధికారులు పట్టా లు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో అసైన్‌మెంట్ కమిటీ గుర్తించినందునే పట్టాలు జారీ చేసినట్లు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు.
నిర్వీర్యమైన కమిటీలు..
ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట లావుణి పట్టా గా మార్చాలంటే అసైన్‌మెంట్ కమిటీ ఆమోదం ఉండా లి. రెవెన్యూ డివిజన్ పరిధిలో అసైన్‌మెంట్ కమిటీ చై ర్మన్‌గా నియోజకవర్గ ఎమ్మెల్యే వ్యవహరిస్తుండగా, కన్వీ నర్‌గా ఆర్డీవో, సభ్యుడిగా తహసీల్దార్ ఉంటారు. వారి ఆమోదంతో ఎలాంటి జీవనాధారం లేని నిరుపేద వర్గా లకు చెందిన ఎస్టీ, ఎస్టీ, బీసీ కులస్థులకు నిబంధనల మేరకు ప్రభుత్వ భూములను సాగు చేసుకునేందుకు అసైన్ చేసే వెసులుబాటు ఉంది. అయితే ఇందుకో సం ముందుగా గ్రామంలో అర్హులుగా పేర్కొంటూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తీర్మానం ఆధారంగా అసైన్ మెంట్ కమిటీ సమావేశం కావాల్సి ఉంటుంది. ఆసమా వేశంలో దరఖాస్తుదారుల అర్హతలను బట్టి భూము ల ను అసైన్ చేస్తారు. జిల్లాలో చివరిసారిగా 2012- 13లో అసైన్‌మెంట్ కమిటీ. సమావేశం జరిగింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఎక్కడా కూడా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయకపోగా, అవి పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. అయినప్పటికీ రెండు, మూడేళ్ల వ్యవధిలో ఏకంగా 55 అ క్రమ పట్టాలు పుట్టుకు రావడం గమనార్హం. అధికారుల వైఖరి కారణంగా ఓ వైపు ఎలాంటి జీవనాధారంలేని పేదలు సాగు భూములులేక ఇబ్బందు లు పడుతుండగా, మరోవైపు అక్రమంగా అవి ఇతరుల చేతుల్లోకి వెళ్తున్నా యి. ఇలాంటివి దండేపల్లి మండలంలోనే గాక, ఇతరు చోట్లా ఉన్నాయి.
ప్రభుత్వ నిర్ణయంతోనైనా
మేలు జరుగుతుందా..?
ఇదిలా ఉండగా అసైన్‌మెంట్ కమిటీలకు పూర్వవైభవం తెచ్చేందుకు రే వంత్‌రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా పాత అసైన్ మెంట్ కమిటీలను రద్దు చేసి, కొత్తగా జిల్లాస్థాయిలో ఒకే కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. కమిటీ చైర్మన్‌గా జిల్లా ఇన్‌చార్జి మంత్రికి బాధ్యత లు అప్పగిస్తుండగా, జిల్లాకు చెందిన ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, ఎంపీలు సభ్యులుగా ఉండనున్నారు. అలాగే కలెక్టర్ కోచైర్మన్‌గా లేదా కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకునే పే దలకు పాస్ పుస్తకాలు అందించడం, పీవోటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్)చట్టం కింద కొనుగోలు చేసిన భూములను క్రమబద్దీకరించే అంశంపై నా అసైన్ మెంట్ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తద్వారా పేదలు సాగు చేసుకుంటున్న ఏజెన్సీ, ఇతర ప్రభుత్వ భూము లను వారికే అసైన్ చేయడం ద్వారా వారికి మేలు చేకూర్చే దిశగా ప్రభు త్వం సన్నాహాలు చేస్తోంది.