kumaram bheem asifabad- బస్టాండు విస్తరణ జరిగేనా..?
ABN , Publish Date - Nov 11 , 2025 | 10:28 PM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడిన తరువాత జిల్లా కేంద్రానికి ప్రయాణికుల తాకిబొ పెరిగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మహలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడంతో బస్టాండులో రద్దీ పెరిగింది. కానీ ఆ మేరకు వసతులు మాత్రం కరువయ్యాయి. జిల్లాలో ఉన్న ఏకైక బస్ డిపో ఆసిఫాబాద్. జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్ లో రద్దికి తగినంత సదుపాయాలు లేవు. ప్రజలు తమ వ్యక్తిగత అవసరాల కోసం జిల్లా కేంద్రాన్ని సందర్శిస్తుండడం,మండలాలు,గ్రామాలనుంచి జిల్లా కేంద్రానికి తరుచు రాకపోకలు చేస్తుండటంతో బస్టాండ్‌లో రద్దీ రోజు రోజుకు పెరుగుతున్నది..
ఆసిఫాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడిన తరువాత జిల్లా కేంద్రానికి ప్రయాణికుల తాకిబొ పెరిగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మహలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడంతో బస్టాండులో రద్దీ పెరిగింది. కానీ ఆ మేరకు వసతులు మాత్రం కరువయ్యాయి. జిల్లాలో ఉన్న ఏకైక బస్ డిపో ఆసిఫాబాద్. జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్ లో రద్దికి తగినంత సదుపాయాలు లేవు. ప్రజలు తమ వ్యక్తిగత అవసరాల కోసం జిల్లా కేంద్రాన్ని సందర్శిస్తుండడం,మండలాలు,గ్రామాలనుంచి జిల్లా కేంద్రానికి తరుచు రాకపోకలు చేస్తుండటంతో బస్టాండ్‌లో రద్దీ రోజు రోజుకు పెరుగుతున్నది.. అయితే బస్టేషన్‌లో కేవలం ఐదు ప్లాట్ ఫాంలు మాత్రమే ఉండడంతో ప్రయాణికుల రద్దీ సమయాల్లో నీడ కల్పించలేని పరిస్థితి కొనసాగుతోంది. బస్టేషన్ విస్తరణ కోసం ఆర్టీసీ అధికారులు దృష్టి సారించక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
- మారుమూల మండలాల ప్రజలు..
గతంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు బెజ్జూరు, కౌటాల వంటి మారుమూల మండలాలకు చెందిన ప్రజలు తమ వ్యక్తిగత అవసరాల కోసం ఆదిలాబాద్‌కు చేరేందుకు ఆసిఫాబాద్, మంచిర్యాల మీదుగా ఆదిలాబాద్‌కు వెళ్లే వారు. కానీ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కావడంతో ఆదిలాబాద్‌కు రద్దీ భారీగా పడిపోయినట్లు ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. అదే సమయంలో ఆసిఫాబాద్‌కు క్రమంగా రద్దీ పెరుగుతున్నందున డిపో ఆదాయం కూడా పెరిగింది. .జిల్లాగా మారిన తరువాత అన్ని మండలాల నుంచి ప్రజలు ప్రభుత్వ పరమైన కార్యకలాపాల కోసం జిల్లా కేంద్రానికి ప్రజలు తరలి వస్తున్నారని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా సోమ, శని వారాల్లో రద్దీ అధికంగా ఉన్నట్లు ఆర్టీసీ సిబ్బంది మాటలను బట్టి అర్థమవుతోంది. ఆసిఫాబాద్ డిపో నుంచి ప్రతి రోజు అన్ని రూట్లలలో 81 షెడ్యూళ్లు 89 బస్సులను ఆయా పట్టణాలు, గ్రామా లు, శివారు గ్రామాలకు బస్సు సర్వీసులు నడుపుతోంది. సగటున ప్రతి రోజు 33,700 కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు సేవలు అందిస్తుండగా ఇందులో 30 వేల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రతీరోజు డిపో కు రూ 20 లక్షల ఆదాయం సమకురుతోంది. అధికారులు స్పం దించి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వసతులు పెరగలేదు..
- చిరంజీవి, ఆసిఫాబాద్
జిల్లా కేంద్రంగా ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచిన బస్టాండులో కనీస వసతులు మెరుగు పడలేదు. దూరప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో ప్రజ లు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్టాండు విస్తరణ చేపట్టాలి. మౌలిక సదుపాయాలు కల్పించక పోతే సమస్యలు మరింత పెరిగే ఆవకాశం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.