Share News

ప్లాస్టిక్‌ వినియోగం తగ్గేనా?

ABN , Publish Date - May 19 , 2025 | 12:06 AM

నిత్యం ప్లాస్టిక్‌ వాడకం ఎక్కువవడంతో జీవ వైవిధ్యానికి పెనుముప్పు కలుగుతుంది. నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లు విచ్చలవిడిగా ప్రతి దుకాణాల్లో వాడుతున్నా సంబంధితశాఖ అధికారులు దృష్టి సారించడం లేదు.

 ప్లాస్టిక్‌ వినియోగం తగ్గేనా?

ప్లాస్టిక్‌ వినియోగం తగ్గేనా?

రోగాల బారిన పడుతున్న జంతువులు, ప్రజలు

పట్టించుకోని అధికారులు

చింతపల్లి, మే 18 (ఆంధ్రజ్యోతి): నిత్యం ప్లాస్టిక్‌ వాడకం ఎక్కువవడంతో జీవ వైవిధ్యానికి పెనుముప్పు కలుగుతుంది. నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లు విచ్చలవిడిగా ప్రతి దుకాణాల్లో వాడుతున్నా సంబంధితశాఖ అధికారులు దృష్టి సారించడం లేదు.

విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వాడకం

చింతపల్లి మండలంలోని 34 గ్రామపంచాయతీల్లో ప్లాస్టిక్‌ కవర్లు వాడ కం విచ్చలవిడిగా పెరిగిపోతోం ది. అటవీ, పర్యావరణ పరిరక్షణ 1986 చట్టం ఉత్తర్వు 25 ప్రకారం 40 మైక్రాన్లు (మం దం) కంటే తక్కువ పాలిథీ న సంచులను వాడకూడదు. తెలుపు కవర్లు తప్ప (నలు పు, నీలం) రంగు కవర్లు వాడటానికి ఆస్కారం లేదు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు వీటిని పర్యవేక్షిస్తారు. నిబంధనలు ఉన్నా రహస్య ప్రాంతాలు, గోదాముల్లో నిల్వచేసి పలు దుకాణాలు, హోటళ్లకు తక్కువ మైక్రాన్లు ఉన్న వాటిని విక్రయిస్తున్నారు. కవర్లతో మండలంలో లక్షల్లో వ్యాపారం జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు దాడులు, కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు.

అవగాహన కల్పిస్తే తగ్గనున్న వాడకం

ప్లాస్టిక్‌ వాడటంతో కలిగే అవర్థాల గురించి అధికారులు గ్రామస్థాయిలో కళాజాతా బృందాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి. పేపర్‌ గ్లాసులు, జూట్‌ సంచులు వినియోగించేలా అధికారులు చొరవ చూపాలి. ప్లాస్టిక్‌ నిషేధంపై యువకులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తే కొంతవరకు ప్లాస్టిక్‌ కవర్ల నియంత్రణకు అడ్డుకట్ట వేయవచ్చు.

ప్లాస్టిక్‌తో కలిగే నష్టాలు

వాతావరణంలో కాలుష్యం పెరుగుతుంది.

ప్లాస్టిక్‌లో ఉండే రసాయనాలు మొక్కలు

పెరగకుండా అడ్డుకుంటాయి.

భూసారం దెబ్బతింటుంది.

వేడి ఆహార పదార్థాలు వీటిలో నిల్వ

చేయడంతో ఆహారం పూర్తిగా విష పదార్థంగా మారుతుంది.

ప్లాస్టిక్‌ రీసైక్లినింగ్‌లో వచ్చే క్లోరినేటెడ్‌ హైడ్రోకార్బన నాడీ మండలాన్ని దెబ్బతీస్తుంది.

మెదడుపై ప్రభావం చూపుతుంది.

పిల్లలు ఊబకాయలుగా మారుతారు.

లక్ష సంవత్సరాలు అయినా కరిగిపోదు.

ప్లాస్టిక్‌ తినడం ద్వారా పశువులు, మేకలు, గొర్రెలు మూగజీవాలు మృత్యువాత పడతాయి.

అధికారులు చర్యలు తీసుకోవాలి

బోదాసు శ్రీనివాస్‌, పాఠశాల కరస్పాడెంట్‌ వీటీనగర్‌

దుకాణాల్లో నాణ్యత లేని ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పంచాయతీ కార్యదర్శులు తగినచర్యలు తీసుకోవాలి. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్‌ నియంత్రించేలా తగిన చర్యలు తీసుకోవాలి.

జూట్‌ సంచులపై అవగాహన కల్పించాలి

కుక్కుడపు రామకృష్ణ, చింతపల్లి

రోజు రోజుకి ప్లాస్టిక్‌ వస్తువులు, కవర్లు అధికమవుతున్నాయి. జూట్‌ సంచులు (బట్ట సంచులు)లపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్చించాలి. అధికారులు స్పందించకుంటే వాతావరణ కాలుష్యం ఏర్పడి జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

కేసులు నమోదు చేస్తాం

సుజాత, ఎంపీడీవో, చింతపల్లి

40 మైక్రాన్ల కంటే తక్కువ నాణ్యత గల పాలిథీన కవర్లు వాడితే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం. కొన్ని గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి సు మారుగా 2 క్వింటాళ్ల వరకు ప్లాస్టిక్‌ కవర్లు సీజ్‌ చేశాం. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. జరిమానాలు విధిస్తున్నాం. ఎవరైనా వినియోగిస్తే మా దృష్టికి తీసుకురావాలి.

Updated Date - May 19 , 2025 | 12:06 AM