Share News

తెరుచుకునేనా..?

ABN , Publish Date - May 30 , 2025 | 12:50 AM

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అంతేకాక విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం చేపట్టింది.

 తెరుచుకునేనా..?
చందంపేట మండలంలో మూతపడిన అచ్చంపేటపట్టి ప్రభుత్వ పాఠశాల

తెరుచుకునేనా..?

గతేడాది 116 పాఠశాలల మూసివేత

ఈ విద్యా సంవత్సరమైనా ప్రారంభమయ్యేనా?

ప్రారంభించాలని గిరిజనుల వేడుకోలు

పాఠశాలలు మూసివేయడంపై ఎస్టీ కమిషనకు ఫిర్యాదు

దేవరకొండ, మే 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అంతేకాక విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం చేపట్టింది. కానీ దేవరకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలో ప్రభు త్వం విద్యాభివృద్ధికి నిధులు కేటాయుస్తుంది. డి జిటల్‌ తరగతులు ఏర్పాటు చేసి మెరుగైన వి ద్యాబోధన అందించేందుకు అన్ని చర్యలు చేపడుతుంది. దేవరకొండ నియోజకవర్గం గిరిజన ప్రాంతం. గిరిజనులు అధికమొత్తంలో ఉండటం తో పాఠశాలలు మూతపడుతుండటంతో విద్యార్థులు విధిలేని పరిస్థితిలో ప్రైవేట్‌ పాఠశాలల ను చేరే పరిస్థితి నెలకొంది. పిల్లలకు తమ దుస్థి తి రాకూడదని విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల కు చదువు చెప్పించాలని ఉద్దేశ్యంతో డబ్బులు ఖర్చుచేసి ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలోనైనా నియోజకవర్గంలో మూతపబడిన ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకుంటాయన్న ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చే స్తున్నారు.

మూతపడిన 116 ప్రభుత్వ పాఠశాలలు

గత విద్యాసంవత్సరం దేవరకొండ నియోజకవర్గంలో 116 ప్రభుత్వ పాఠశాలలు వివిధ కారణాలతో మూతపడ్డాయి. దీంతో విధిలేని పరిస్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పించే పరిస్థితి ఏర్పడింది. అందుకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. డివిజన పరిధిలో దేవరకొండలో 6, చందంపేటలో 36, నేరేడుగొమ్ములో 15, కొండమల్లేపల్లిలో 13, చిం తపల్లి 11, డిండి 17, గుడిపల్లి 4, పీఏపల్లి మండలంలో 14మొత్తం నియోజకవర్గంలో 116 ప్రభుత్వ పా ఠశాలలు మూతపడ్డాయి. లక్షల రూపాయలు ఖర్చుచేసి ప్ర భుత్వం పాఠశాలల భవనాలు ఏర్పాటు చేస్తే పాఠశాలలు మూతపడటంతో పాఠశాలల భవనాలు నిరుపయోగంగా మారాయి. అందుకు కారణం ఉపాధ్యాయుల కొరత, విద్యార్థులు సరిపడా లేకపోవడమే కారణమని పలువురు పేర్కొంటున్నారు. ఈ విద్యాసంవత్సరంలోనైనా ఎస్టీ నియోజకవర్గమైన దేవరకొండ నియోజకవర్గంలోని మూతపడిన పాఠశాలలను తెరిపించి అక్కడి విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తుందని ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలలను తెరిపించాలి

దేవరకొండ నియోజకవర్గంలోని 116 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడంతో విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. పా ఠశాలల మూసివేయడంతో గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పాఠశాలలను ఓపెన చేయాలని జాతీయ ఎస్టీ కమిషనకు ఫిర్యాదు చేశాను. గిరిజనతండాలు, గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు అధికారుల నిర్యక్షం వల్లే మూతపడ్డాయి. ఈ విద్యాసంవత్సరంలోనైనా నియోజకవర్గంలో మూసివేసిన పాఠశాలలు తెరిచి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి.

కేతావత లాలునాయక్‌, బీజేపీ రాష్ట్ర నాయకుడు

Updated Date - May 30 , 2025 | 12:50 AM