Share News

గాడిన పడేనా...?

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:36 PM

జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా చతికిలబడింది. ఆ రంగంపై ఆధారపడ్డ వ్యాపారులు, మధ్యవర్తుల పరిస్థి తి అత్యంత దయనీయంగా మారింది. వెంచర్లు ఏర్పా టు చేసేందుకు వ్యాపారులు పెద్ద మొత్తంలో అప్పు లు చేసి స్థలాలు కొనుగోలు చేసినప్పటికీ, భూముల స బ్‌ డివిజన్లకు రిజిస్ట్రేషన్లు జరుగకపోవడంతో దిక్కు తో చని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

గాడిన పడేనా...?

-దయనీయ పరిస్థితుల్లో స్థిరాస్థి వ్యాపారులు

-పూర్తిగా మందగించిన ప్లాట్ల అమ్మకాలు

-చతికిలపడ్డ నాన్‌ లే అవుట్‌ వెంచర్లు

-బిల్డర్ల పరిస్థితీ అంతంత మాత్రమే

-ఇతర రంగాలపైనా ప్రభావం

మంచిర్యాల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా చతికిలబడింది. ఆ రంగంపై ఆధారపడ్డ వ్యాపారులు, మధ్యవర్తుల పరిస్థి తి అత్యంత దయనీయంగా మారింది. వెంచర్లు ఏర్పా టు చేసేందుకు వ్యాపారులు పెద్ద మొత్తంలో అప్పు లు చేసి స్థలాలు కొనుగోలు చేసినప్పటికీ, భూముల స బ్‌ డివిజన్లకు రిజిస్ట్రేషన్లు జరుగకపోవడంతో దిక్కు తో చని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్లాట్లు కొను గోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రాక పోవడంతో చేసిన అప్పుల వడ్డీలు తీర్చేందుకు కొత్త అ ప్పులు చేస్తూ పీకల్లోతు ఊబిలో మునిగిపోయారు. ముఖ్యంగా నాన్‌ లే అవుట్‌ వెంచర్లు ఏర్పాటు చేసిన వ్యాపారుల పరిస్థితి మరింత ఆద్వానంగా తయారైం ది. రెండేళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఏ మాత్రం కలిసి రాకపోవడం, దాని ప్రభావం ఇతర రంగాల పై కూడా పడటంతో జిల్లాలో బిజినెస్‌ అంతా కుదేలైంది.

అసెంబ్లీ ఎన్నికలతో మొదలు....

అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ కారణంగా భూముల రిజి స్ట్రేషన్లు భారీగా పడిపోగా, ఆ తరువాత కూడా పుం జుకోకపోవడంతో నగదు చలామణిలేక రియల్‌ ఎస్టేట్‌ రంగం కునారిల్లుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబం ధించి కోడ్‌ అమల్లోకి రావడంతో నగదు చలామణి ఆ గిపోయింది. ఆ ఎన్నికలు ముగిసి ’కోడ్‌’ ఎత్తివేసినా రి యల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ పుంజుకోకపోవడం గమనార్హం. భూముల క్రయ, విక్రయాలు పూర్తిగా నిలిచిపోగా, వి నియోగదారులు లేక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వెల వెలబోతున్నాయి. ఎన్నికల కోడ్‌ రాకముందు ని త్యం సగటున వంద వరకు రిజిస్ట్రేషన్లు జరుగగా ’’కో డ్‌’’ అమల్లోకి వచ్చిన తరువాత ఒక్కసారిగా వాటి సం ఖ్య సగానికి పడిపోయింది. రిజిస్ట్రేషన్ల సమయంలో భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి పెద్ద మొ త్తంలో డబ్బులు అవసరం కాగా, కోడ్‌ కారణంగా వాటి ని తీసుకెళ్లడం కష్టసాధ్యంగా మారింది.

నగదు తరలించే సమయంలో పోలీసులకు దొరికి పోతే డబ్బంతా సీజ్‌ అయ్యే అవకాశం ఉండటంతో స్థి రాస్థి వ్యాపారులు భూముల క్రయ, విక్రయాల జోలికి వెళ్లలేదు. ఎన్నికల ప్రక్రియ ముగిసి పరిస్థితులు అను కూలంగా మారినా బిజినెస్‌ ఊపందుకోలేదు. ఆ తరు వాత ఎంపీ ఎన్నికలు, అనంతరం పంచాయతీ ఎలక్షన్ల కు షెడ్యూలు విడుదల కావడంతో పరిస్థితిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

తగ్గుముఖం పట్టిన డాక్యుమెంటేషన్‌...

ఎన్నికల కోడ్‌ ప్రారంభమైన నాటి నుంచి రిజిస్ట్రేష న్లు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. అంతకు ముందు సగటున నిత్యం 80 డాక్యుమెంట్ల వరకు రాగా, ఎన్నిక ల సమయంలో వాటి సంఖ్య సగానికి పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నెలకు రూ. కోటిపైగా సమకూరిన ఆదాయం, ఆ తరువాత అందులో సగా నికి పడిపోయింది.

పంచాయతీ ఎన్నికలతో మళ్లీ బ్రేక్‌....

రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పరిస్థితులు మెరుగుపడతాయని భా వించిన రియల్టర్లకు ఆశినిపాతమే ఎదురైంది. ప్రస్తు తం పంచాయతీ ఎన్నికల సమయం కావడంతో రియ ల్‌ ఎస్టేట్‌ ఊపందుకునే పరిస్థితులు కానరావడం లే దు. సాధారణంగా ప్రతియేటా నవంబరు నుంచి జూన్‌ మధ్యకాలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపు మీద ఉంటుంది. ఈ కాలంలో భూముల క్రయ, విక్రయాలు జోరుగా సాగుతాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా అధికం గానే ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికల కాలం కావడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంపై దాని ప్రభావం పడింది. కనీ సం ఈ ఏడాదైనా వ్యాపారం పుంజుకుంటుందని ఆశిం చిన రియల్‌ వ్యాపారులకు మళ్లీ గడ్డు పరిస్థితులే ఎదు రయ్యాయి. రెండు, మూడు ఎకరాల తక్కువ విస్తీర్ణం లో వెంచర్లు ఏర్పాటు చేసే వ్యాపారులు లే అవుట్‌కు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించవు. లే అవుట్‌కు వెళితే 10 శాతం భూమి స్థానిక సంస్థల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాల్సి ఉంటుంది. తక్కువ వి స్తీర్ణం కావడం, అందులోని కొంత భూమి గ్రామ పం చాయతీలు, మున్సిపాలిటీల పేరిట మార్చాల్సి రావడం తో వచ్చే లాభాలు కాస్త ఆ భూమి రూపంలో కోల్పో వలసి వస్తుంది. ఈ కారణంగా వ్యాపారులు లే అవుట్‌ లేకుండానే వెంచర్లు ఏర్పాటు చేసి, పరిచయం ఉన్న వారితో ప్లాట్లు కొనుగోలు చేయిస్తుంటారు. ప్రస్తుతం లే అవుట్‌ లేని వెంచర్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచి పోవడంతో చిన్న వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది.

Updated Date - Nov 16 , 2025 | 11:36 PM