ఈసారైనా అనుకూలించేనా...?
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:36 PM
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి త్వరలో రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గ్రామ పంచాయతీలకు సెప్టెంబరు 30 లోపు ఎన్నికలు నిర్వ హించాలని ఇటీవల హై కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే జూలై నెలాఖరులోపు రిజర్వేషన్ ప్రక్రియ ముగించా లని కూడా తీర్పులో పేర్కొంది. ఈ క్రమంలో మొదట రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టక తప్పని పరిస్థితులు ఉన్నా యి.
-గూడెం గ్రామానికి రిజర్వేషన్ పంచాయితీ
-గిరిజనులు లేకున్నా నోటిఫైడ్ ఏరియాగా నమోదు
-పోటీ చేసే వారు లేక ప్రత్యేక అధికారుల పాలన
-దశాబ్దాలుగా పదవులకు నోచుకోని గ్రామస్థులు
మంచిర్యాల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలకు సంబంధించి త్వరలో రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గ్రామ పంచాయతీలకు సెప్టెంబరు 30 లోపు ఎన్నికలు నిర్వ హించాలని ఇటీవల హై కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే జూలై నెలాఖరులోపు రిజర్వేషన్ ప్రక్రియ ముగించా లని కూడా తీర్పులో పేర్కొంది. ఈ క్రమంలో మొదట రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టక తప్పని పరిస్థితులు ఉన్నా యి. ఈ నేపథ్యంలో దండేపల్లి మండలం గూడెం గ్రా మ పంచాయతీకి ఈ సారైనా రిజర్వేషన్లు అనుకూలి స్తాయేమోనన్న గంపెడాశతో ప్రజలు ఎదురు చూస్తు న్నారు. గూడెం గ్రామ పంచాయతీలో మూడు దశాబ్దా లకు పైగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఎ న్నిక లు జరగడం లేదు. గ్రామంలో ఒక్క గిరిజనుడు లేక పోయినా గ్రామ సర్పంచ్‌తోపాటు పలు వార్డు సభ్యు ల పదవులను మాత్రం షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ) కుల స్థులకు రిజర్వ్ చేశారు. దీంతో 35 ఏళ్లుగా ఎన్నికలు జరుగకపోవడంతో పంచాయతీ ప్రత్యేకాధికారుల పాల నలో కొనసాగుతోంది.
నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించడంతో...
గూడెం గ్రామ పంచాయతీలో 1800పై చిలుకు మం ది ఓటర్లు ఉన్నారు. గూడెంలో ఒక్కరు కూడా గిరిజనులు లేకపోయినా 1950లో అప్పటి ప్రభుత్వం గ్రామా న్ని నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించింది. రిజర్వేషన్ ప్ర కారం గిరిజనులు ఎవరూ లేకపోవడంతో పోటీ చేసే వారు లేక అప్పటి నుంచి అ గ్రామంలో ఇన్‌చార్జిల ద్వా రా పాలనను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, 1987 నుంచి గ్రామ సర్పంచు స్థానాన్ని సైతం ఎస్టీకి రి జర్వు చేశారు. సర్పంచు పదవితో పాటు గ్రామంలోని 10 వార్డు సభ్యుల స్థానాల్లో ఐదింటిని గిరిజనులకు కేటియించారు. అప్పటి నుంచి సుమారు 35 ఏళ్లుగా గూ డెం గ్రామ పంచాయతీకి సర్పంచు, వార్డు సభ్యుల స్థా నాలకు పోటీ చేసేందుకు అర్హులు లభించడం లేదు. దీంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడింది. ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేకుండా పోయాయి. అయినప్పటికీ ప్రతిసారీ పంచా యతీ ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల చే యడం...నామినేషన్లు దాఖలు కాకపోవడం షరా మామూలైంది.
ఆందోళనలు చేసినా ఫలితం శూన్యం...
దశాబ్దాలుగా గూడెం పంచాయతీకి ఎన్నికలు జరు గకపోవడంతో గ్రామస్థులు ఎలాంటి పదవులకూ నోచు కోవడం లేదు. రాజకీయాలపై మక్కువ ఉన్నవారు, ప్ర జా సేవలో ఉండాలని ఉవ్విళ్లూరుతున్నవారు ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా...రిజర్వేషన్ అనుకూలించడం లేదు. గ్రామంలో ఎస్టీ జనాభా లేదని, రిజర్వేషన్‌లో మార్పు చేయాలని గ్రామస్థులు పలుమార్లు ఆందోళనలు కూ డా చేశారు. రిజర్వేషన్లు మార్చాలని సామూహిక నిరహర దీక్షలు, రాస్తారోకోలు, వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. ఈ ఏడాది సెప్టెంబరులో ఎన్నికలు జరుగనుండటంతో రి జర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఈ మేరకు సర్పం చ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై పూర్తి వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరనుంది. కనీసం ఈ సారైనా రిజర్వేషన్‌లో మార్పులు చేసి, తమ గ్రామ పంచాయతీ తలరాతను మారుస్తారేమోనని, గ్రామస్థులు ఆశగా ఎ దురు చూస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పంచాయతీల కు చివరిసారిగా 2019లో ఎన్నికలు జరిగాయి. ప్రస్తు త సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం 31 జనవరి 2024తో ముగిసింది. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే 16 నెలలు ఆలస్యం అయింది. ఈ క్రమంలో హైకోర్టు ఆ దేశాలతో ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమిషన్ కు అనివార్యం అయింది. త్వరలో రిజర్వేషన్లు ప్రకటిం చే అవకాశం ఉండటంతో ప్రజా ప్రతినిధులు తమకు అనుకూలించేలా కృషి చేయాలని గూడెం గ్రా మస్థులు కోరుతున్నారు.