అంగ న్‌వాడీల్లో అక్రమాలకు చెక్ పడేనా...?
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:41 PM
అంగన్‌వా డీ కేంద్రాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభు త్వం యోచిస్తోంది. తొలుత అంగన్ వాడీల్లో అక్ర మాలకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. అ క్కడక్కడ కొన్ని కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, సి బ్బంది చేతివాటంతో పిల్లలు, మహిళలకు అందాల్సి న గుడ్లు, పాలు, పప్పు, తదితర సామగ్రి బహిరం గ మార్కెట్‌లో దర్శనమిస్తున్న ఘటనలు చోటు చే సుకుంటున్నాయి.
-కార్యరూపం దాల్చని సీసీ కెమెరాలు ఏర్పాటు
-అమలుకాని బయోమెట్రిక్ విధానం
-కొత్తగా ఫొటో క్యాప్చర్ విధానానికి శ్రీకారం
-అసలు లబ్ధిదారులకే సరుకులు అందేలా చర్యలు
-జిల్లాకు 32 సొంత భవనాల మంజూరు
మంచిర్యాల, జూలై 1 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వా డీ కేంద్రాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభు త్వం యోచిస్తోంది. తొలుత అంగన్ వాడీల్లో అక్ర మాలకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. అ క్కడక్కడ కొన్ని కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, సి బ్బంది చేతివాటంతో పిల్లలు, మహిళలకు అందాల్సి న గుడ్లు, పాలు, పప్పు, తదితర సామగ్రి బహిరం గ మార్కెట్‌లో దర్శనమిస్తున్న ఘటనలు చోటు చే సుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేం ద్రాలు నామ మాత్రంగా నడుస్తున్నాయన్న ఆరో పణలు వినిపిస్తున్నాయి. కేంద్రాలకు వచ్చిన సరుకు లు, విద్యార్థులు హాజరు సహా అంగన్‌వాడీని పూర్తి గా పరిశీలించేలా కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకా రం చుడుతోంది. ఇందులో భాగంగా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ సంవత్సరం గడిచినా అది కార్యరూపం దాల్చలేదు. మరోవైపు బయోమెట్రిక్ విధానం అమలు చేయా లని అనుకున్నప్పటికీ అదీ సాధ్యపడలేదు. ప్రస్తుతం కొత్తగా ఫొటో క్యాప్చర్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
జిల్లాకు 32 సొంత భవనాలు మంజూరు...
అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పా టు చేసేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చే స్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాకు 32 సొంత భవనా లు మంజూరయ్యాయి. జిల్లాలోని 16 మండలాలకు గాను ఒక్కో మండలానికి రెండేసి భవనాల చొప్పున మొత్తం 32 భవనాలు పైలట్ ప్రాజెక్టు కింద మం జూరయ్యాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ. 20 లక్షలతో ఒక్కో భవన నిర్మాణం చేపట్టనున్నారు. జి ల్లాలో ఎన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనా లు ఉన్నాయి...అద్దె భవనాల్లో ఎన్ని ఉన్నాయి..ఎంత మంది టీచర్లు, సిబ్బంది ఉన్నారు...పిల్లలు, గర్భిణు లు, బాలింతలు సంఖ్య ఎంత అనే పక్కా సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ అధికారులు జిల్లా అధికారుల నుంచి ఇప్పటికే సేకరించారు. జిల్లాలో 969 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నా యి. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, లక్షెట్టిపేటలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఈ కేంద్రాలను నిర్వ హిస్తున్నారు. ఇప్పటికే భవనాలకు స్థలాల ఎంపిక పూర్తికాగా, త్వరలో పనులు చేపట్టేందుకు సన్నాహా లు జరుగుతున్నాయి. అయితే కేవలం 32 భవనాల నిర్మాణంతోనే సరిపెడతారా...? లేక అన్ని అంగన్‌వా డీలకు సొంత భవనాలు మంజూరు చేస్తారా...? అ న్న విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లే దు. అయితే జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రా లకు సొంత భవనాలు మంజూరు చేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.
ఫొటో క్యాప్చర్‌తో అక్రమాలకు చెక్..!
అంగన్‌వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేదుకు ప్రభుత్వం ఫొటో క్యాప్చర్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 1 నుంచే అన్ని కేంద్రాల్లో ఫొటో క్యాప్చర్ విధానాన్ని అమలు చేయా లని ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల కు పిల్లలు రాకపోయినా... వచ్చినట్లు హాజరు వేస్తూ అక్కడి సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరో పణలు ఉన్నాయి. గర్భిణులు, బాలింతలకు పౌష్టికా హారం ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజువారి ఆహారం కూడా వడ్డించడం లేదనే ప్రచా రం ఉంది. అంగన్‌వాడీ కేంద్రాలకు ఎంత మంది పి ల్లలు వస్తున్నారు..? వారికి ఏమి నేర్పుతున్నారు..? బాలింతలు, గర్భిణులు వస్తున్నారా..? వారికి మెనూ ప్రకారం ఆహారం ఇస్తున్నారా...?లేదా..? అనే విష యాలపై ఎప్పటికప్పుడు కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యాప్‌ల ద్వారా టీచర్లు సమాచారం ఇవ్వాల్సి ఉం టుంది. దీనికి అదనంగా ఫొటో క్యాప్చర్ విధానానికి శ్రీకారం చుట్టింది. అంగన్‌వాడీ కేంద్రంలో హాజరయ్యే పిల్లలను ఒక్కొక్కరిగా ఫొటోలు తీసి యాప్‌లలో పొందు పర్చాల్సి ఉంటుంది. అలాగే గర్భిణులు, బా లింతలు భోజనం చేసే సమయంలోనూ ఇదే విధా నం అమలు చేయాలి. తద్వారా ఎంత మంది పిల్ల లు, గర్బిణులు, బాలింతలు హాజరవుతున్నారనే ప క్కా సమాచారం ప్రభుత్వాలకు పక్కాగా చేరుతుంది. అయితే ఫొటో క్యాప్చర్ విధానం పిల్లల వరకు అయి తే అమలు చేయవచ్చుగానీ, గర్బిణులు, బాలింత లకు సాధ్యపడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. ప్రతి రోజూ కేంద్రాలకు వచ్చి ఫొటో క్యాప్చర్ ఇచ్చేంత వెసులుబాటు వారికి ఉంటుందా...? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఒక్కొక్కరి ఫొ టో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయడం కూడా అదన పు పనిభారమే అవుతుందనే అభిప్రాయాలను పలు వురు టీచర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బరువు లు, ఎత్తులు తూచడం, వంట చేయించడం, వంటి పనులతో సమయం సరిపోవడం లేదని, కొత్తగా ఫొ టో క్యాప్చర్ అమలు చేయడం ఎలా అన్న సందేహా లు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రభుత్వ నిర్ణయం పకడ్బంధీగా అమలు అయితే అంగన్‌వాడీల్లో అక్ర మాలకు చెక్ పడినట్లేనన్న అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి.