Share News

అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేనా..?

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:47 PM

పర్మిట్‌లు ఉన్నాయన్న పేరుతో మట్టి, మొరం ఇష్టారీతిన తరలిస్తు న్నా రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారులు పట్టించుకోక పోవడంతో గ్రామస్థులు ఆందోళనబాట పడుతున్నారు. భా రీ వాహనాల రాకపోకలతో రోడ్డంతా బురదమయంగా మా రి, కాలినడక వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నా మని మొర పెట్టుకున్నా...వినేవారు కరువయ్యారు. గతం లోనూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గుట్ట లో మట్టి తవ్వకాలు జరుపుతూ ఇతర ప్రాంతాలకు తర లిస్తున్న విషయమై ‘కరుగుతున్న గుట్ట’ శీర్షికన ’ఆంధ్రజ్యో తి’ జిల్లా అనుబంధంలో కథనం ప్రచురితమైంది.

అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేనా..?

-మట్టి, మొరం తరలింపుపై గ్రామస్థుల ఆందోళన

-రోడ్లు చెడిపోతున్నాయంటూ వాహనాల అడ్డగింత

-అయినా ఖాతరు చేయని అక్రమార్కులు

-ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇతర ప్రాంతాలకు తరలింపు..?

మంచిర్యాల, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పర్మిట్‌లు ఉన్నాయన్న పేరుతో మట్టి, మొరం ఇష్టారీతిన తరలిస్తు న్నా రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారులు పట్టించుకోక పోవడంతో గ్రామస్థులు ఆందోళనబాట పడుతున్నారు. భా రీ వాహనాల రాకపోకలతో రోడ్డంతా బురదమయంగా మా రి, కాలినడక వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నా మని మొర పెట్టుకున్నా...వినేవారు కరువయ్యారు. గతం లోనూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గుట్ట లో మట్టి తవ్వకాలు జరుపుతూ ఇతర ప్రాంతాలకు తర లిస్తున్న విషయమై ‘కరుగుతున్న గుట్ట’ శీర్షికన ’ఆంధ్రజ్యో తి’ జిల్లా అనుబంధంలో కథనం ప్రచురితమైంది.

దండేపల్లి మండలం వందురుగూడ శివారులో గ్రామ శివారులో సర్వే నంబర్‌ 9లో సుమారు 70 ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంది. గుట్టలో ఉన్న మొరం, మట్టి మంచి నాణ్యతతో కూడింది కావడంతో దానికి రెక్కలు వచ్చాయి. ధన దాహంతో స్థానికంగా కొందరు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి గుట్టలో అక్రమ తవ్వకాలు చేపట్టడమే గాకుండా, బ హిరంగంగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు మొరం, మట్టి తర లిస్తూ అక్రమ మార్గంలో లక్షలు సంపాధిస్తున్న విషయా న్ని ’ఆంధ్రజ్యోతి’ తన కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. దీంతో కొంతకాలంపాటు స్తబ్దంగా ఉన్న అక్రమార్కులు, అనంతరం అనుమతులు తెచ్చుకున్నామని ప్రచారం చేసు కుంటూ ఇటీవల మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు.

సోలార్‌ ప్రాజెక్టు అవసరాల పేరుతో...

మండలంలోని అందుగులపేట గుట్టపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ప్రత్యేక చొరవతో ఒక మెగావాట్‌ సామర్థ్యంగల ఇందిరా మహిళాశక్తి సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుకు రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో రూపకల్పన చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు రెండు నెలల క్రితం శంకుస్థాన చేశారు. దాని సమీపంలోనే రాష్ట్ర ప్రభుత్వ పథకమైన యంగ్‌ ఇం డియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవనం నిర్మా ణం కూడా జరుగుతోంది. దీంతో వాహనాల రాకపోకల కో సం గుట్టపైన చదును చేశారు. వాహనాలు పైకి వెళ్లేందు కు రోడ్డును నిర్మించాల్సి ఉండగా, గుట్టలో తవ్విన మొరం, మట్టిని ఇందుకోసం వినియోగిస్తున్నారు. ఇదే అదునుగా తవ్విన మొరం, మట్టిని గుట్ట చుట్టూ ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇందిరమ్మ ఇళ్లకు వినియోగిస్తున్నామని...!

వందురుగూడ సమీపంలోని గుట్టలో మొరం, మట్టి తవ్వకాలకు అనుమతులు పొందామని చెబుతున్నప్పటికీ, నిబంధనల మేరకు ఆ మట్టిని కేవలం ఇందిరమ్మ ఇళ్ల అ వసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంది. అదికూడా దండేపల్లి మండల పరిధిలో మాత్రమే లబ్దిదారులకు అం దజేయాలి. ఈ విషయం మైనింగ్‌ శాఖ జారీ చేసిన ప్రొసీడింగులోనే పేర్కొనడం గమనార్హం. అలా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు గుట్టలో తవ్విన మట్టిని మండల పరిధులు దాటి ఇతర ప్రాంతా లకు తరలిస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ల వైఖరి కారణంగా గుట్ట కరిగిపో తుండగా, ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరిలిస్తున్న మ ట్టి రూపేణా ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతోంది. అలా మట్టి తరలింపుతో వచ్చిన సొమ్ము కాంట్రాక్టర్ల జే బుల్లోకి వెళుతున్నట్లు తెలుస్తోంది.

గ్రామస్థుల ఆందోళన....

వందురుగూడలో అనుమతుల పేరిట మొరం, మట్టి తవ్వకాలు జరుపుతున్న కాంట్రాక్టర్లు భారీ వాహనాలు ఉ పయోగిస్తూ వాటిని తరలిస్తున్నారు. దీంతో రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలుగా మారి, బురదమయం అవుతుందని వం దురుగూడ గ్రామస్థులు ఆందోళనలకు పూనుకుంటున్నా రు. భారీ వాహనాల రాకపోకల కారణంగా ఇటీవల కురి సిన వర్షాలకు రోడ్డంతా కాలినడకన కూడా నడవలేని స్థి తికి చేరుకుంది. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు వాహ నాలను అడ్డుకొని తమ నిరసనను తెలిపారు. దీంతో రెండు మూడు రోజులపాటు తవ్వకాలు నిలిపివేసిన కాం ట్రాక్టర్లు ఇటీవల మళ్లీ ప్రారంభించారు. దీంతో గ్రామస్థులు మళ్లీ ఆందోళనకు దిగారు. ఈ విషయమై గ్రామస్తులు అ ధికారులకు మొరపెట్టుకున్నా, పట్టించుకోవడం లేదనే అభి ప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుట్టలో మట్టి, మొరం తవ్వకాలను నిలిపివేయాలని కోరుతున్నారు.

Updated Date - Sep 08 , 2025 | 11:47 PM