అడవి జంతువు సంచారం?
ABN , Publish Date - Jul 20 , 2025 | 12:18 AM
యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని రెడ్డినాయక్‌తండా, పచ్చ ర్లబోడుతండా, మూసీ పరీవాహక ప్రాంతాల్లో అడవి జంతువు సంచరిస్తోందని పుకార్లు వస్తు న్నాయి.
భువనగిరి రూరల్, జూలై 19(ఆంధ్ర జ్యోతి): యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని రెడ్డినాయక్‌తండా, పచ్చ ర్లబోడుతండా, మూసీ పరీవాహక ప్రాంతాల్లో అడవి జంతువు సంచరిస్తోందని పుకార్లు వస్తు న్నాయి. జిల్లా ఫారెస్టు అధికారి పద్మ జారాణి ఆదేశాల మేరకు సెక్షన్ ఆఫీసర్ శ్రీను, బీట్ ఆఫీసర్ లక్ష్మణ్ శనివారం ఆయా గ్రామాల్లో పర్యటించారు. గ్రామ సమీపంలోని వ్యవ సాయ పొలాల వద్ద అడవి జంతువు కంటపడిందని, ఈ క్రమంలో కుక్కలపై దాడిచేసి సమీపంలోని గుట్టలపైకి పారిపోయిందని స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్టు అధికారులు అప్రమత్తమై అడవి జంతువు సంచరిస్తోందన్న ప్రాంతాల్లో పాదాల ముద్రల కోసం వెతికారు. చుట్టు పక్కల ఎలాంటి ఆనవాళ్లు లేవని ప్రాథమికంగా అంచనా వేశారు. రాత్రి వేళల్లో రైతులు ఒంటరిగా వ్యవసాయ బావుల వద్దకు వెళ్లొద్దని తెలిపారు. గ్రామాల్లో గస్తీ నిర్వహిస్తున్నామని తెలిపారు.