Dasarathi Rangacharya Passes Away: దాశరథి రంగాచార్య సతీమణి కన్నుమూత
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:22 AM
లుగు సాహిత్య దిగ్గజం దివంగత దాశరథి రంగాచార్య సతీమణి కమలమ్మ (92) కన్నుమూశారు. కొంతకాలంగా వయసు రీత్యా....
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలుగు సాహిత్య దిగ్గజం దివంగత దాశరథి రంగాచార్య సతీమణి కమలమ్మ (92) కన్నుమూశారు. కొంతకాలంగా వయసు రీత్యా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలో గల సొంతింట్లో తుదిశ్వాస విడిచారు. కమలమ్మ మృతికి తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారుడు కేవీ రమణాచారి, కవి యాకూబ్‌తోపాటు పలువురు కవులు, రచయితలు, దాశరథి అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం వెస్ట్‌మారేడ్‌పల్లి శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.