Spousal conflict: ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:41 AM
వివాహేతర సంబంధానికి అడ్డోస్తున్నాడని ఓ భార్య తన ప్రియుడితో భర్తను హత్య చేయించింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపుర్ మండలంలో జరిగింది.....
ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
పరిగి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డోస్తున్నాడని ఓ భార్య తన ప్రియుడితో భర్తను హత్య చేయించింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపుర్ మండలంలో జరిగింది. కేసు వివరాలను పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ఆదివారం వెల్లడించారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రానికి చెందిన కర్రె రత్నయ్య, కవితలు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. రత్నయ్య పొలం పనులు చేస్తుండగా, కవిత ఓ కంపెనీలో లేబర్‌గా పని చేస్తోంది. కవిత అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణతో కొన్నేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం రత్నయ్య తెలిసి భార్యను పలుమార్లు మందలించాడు. పిల్లలు పెళ్లీడుకోచ్చారని పద్ధతి మార్చుకోమని హెచ్చరించాడు. భర్త హెచ్చరించిన విషయాన్ని కవిత ప్రియుడు రామకృష్ణకు తెలిపింది. ఇద్దరి మధ్య తన భర్త అడ్డుపడుతున్నాడని, అతన్ని చంపేస్తే తాము సంతోషంగా ఉండొచ్చని చెప్పగా కవిత ఒప్పుకుంది. ప్రణాళిక ప్రకారం శనివారం పొలానికి వెళ్ళి వస్తున్న రత్నయ్యను రామకృష్ణ ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. దీంతో రత్నయ్య మృతి చెందాడు. అనంతరం తన భర్త ప్రమాదంలో మృతి చెందాడని కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. రత్నయ్య తమ్ముడు దేవయ్య అనుమానం వ్యక్తం చేయడంతో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కవిత, రామకృష్ణలను విచారించగా, నేరాన్ని ఒప్పుకున్నారు. నిందుతులను ఆదివారం రిమాండ్‌కు తెరలించినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.