Share News

Relationship Crime: ప్రియుడితో భర్తను చంపించిన భార్య

ABN , Publish Date - Oct 16 , 2025 | 02:00 AM

వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని, అతడిని తన ప్రియుడితో కలిసి చంపించిందా భార్య. ఆపై ప్రియుడితో కలిసి ఘటనను రోడ్డు...

Relationship Crime: ప్రియుడితో భర్తను చంపించిన భార్య

  • వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే దారుణం

  • ఆమె, ప్రియుడు అరెస్టు.. సహకరించిన మరో ఇద్దరు

నాగర్‌కర్నూల్‌ క్రైం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని, అతడిని తన ప్రియుడితో కలిసి చంపించిందా భార్య. ఆపై ప్రియుడితో కలిసి ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రూరల్‌ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మైనగాని రాముడు (37)కు, పెద్దకొత్తపల్లి మండలం వెన్నచెర్లకు చెందిన మానసతో 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులు నాగర్‌కర్నూల్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆరు నెలల క్రితం మానసకు పెద్దముద్దునూర్‌కు చెందిన సురేశ్‌ గౌడ్‌తో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని మానస నిర్ణయించుకుంది. ప్రియుడు కౌకుంట్ల సురేశ్‌గౌడ్‌తో కలిసి పథకం వేసింది. ఈనెల 11న పెద్దమద్దనూర్‌లో పార్టీ ఉందని.. రాముడికి సురేశ్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. రాముడు పెద్దముద్దునూరుకు వెళ్లాక అందరూ కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత సురేశ్‌.. తన వెంట తెచ్చుకున్న పెద్ద ప్లాస్టర్‌ను రాముడి ముక్కు, నోటిపై అతికించాడు. దీంతో అతడు ఊపిరి ఆడక చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని కంకర రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. తన కుమారుడు మృతిపై అనుమానం ఉందంటూ పోలీసులకు రాముడి తండ్రి ఫిర్యాదు చేయగా.. అసలు విషయం బట్టబయలైంది. ఆమెతో పాటు, ప్రియుడు సురేశ్‌ సహకరించిన బాలపీరు, హనుమంతును అరెస్టు చేశారు.

Updated Date - Oct 16 , 2025 | 02:00 AM