Share News

కార్మిక సంక్షేమానికి నిధులు ఎందుకు కేటాయించరు

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:28 AM

సింగరేణిలో సంస్థ అభి వృద్ధితో పాటు దేశ ప్రగతే ధ్యేయంగా పాటుపడుతున్న సింగరేణి ఉద్యో గుల సంక్షేమానికి యాజమాన్యం నిధులు లేవని మొండిచెయ్యి చూపి స్తుందని ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ మండి పడ్డారు.

కార్మిక సంక్షేమానికి నిధులు ఎందుకు కేటాయించరు
మాట్లాడుతున్న ఏఐటీయుసీ నాయకులు

ఏఐటీయూసీ నాయకులు

మందమర్రిటౌన్‌, డిసెంబరు14(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో సంస్థ అభి వృద్ధితో పాటు దేశ ప్రగతే ధ్యేయంగా పాటుపడుతున్న సింగరేణి ఉద్యో గుల సంక్షేమానికి యాజమాన్యం నిధులు లేవని మొండిచెయ్యి చూపి స్తుందని ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ మండి పడ్డారు. ఆదివారం మందమర్రిలో విలేకరులతో మాట్లాడుతూ రెండు రో జుల క్రితం అర్జెంటీన ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సితో హైదరాబా ద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆడిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు రూ.10కోట్లుఎలా కేటాయిస్తారని మండిపడ్డారు. అంతేగాకుండా సింగరేణి నిధులు సింగరేణి ఉద్యోగులకు వినియోగించకుండా దారి మ ల్లుతున్నాయని మండిపడ్డారు. పాలకులు సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోడంతో నిధులు దారి మల్లుతున్నాయని తెలిపారు. గుర్తింపు సం ఘంగా దీనిని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో సింగరేణి లో రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతామని తెలిపా రు. సింగరేణిలో ఉద్యోగులకు కనీసం కార్పొరేట్‌స్థాయి వైద్యం అందడం లేదని వైద్యుల పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు. అంతేగాకుండా అనారో గ్యంతో బాధపడుతుననవారికి మెడికల్‌బోర్డు నిర్వహణ లేకపోవడం తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సింగరేణి ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీ ట వేయాల్సినటువంటి సంస్థ పట్టించుకోకపోవడంతో ఏమిటని ప్రశ్నిం చారు. అంతేగాకుండా గత బీఆర్‌ఎస్‌ పాలనలో యథేచ్చగా నిదులు దారి మళ్లితే ప్రజా ప్రబుత్వంలో కూడ అదే పద్ధతి కొనసాగడం సరికాదన్నారు. కార్మిక హక్కుల కోసం తాము గుర్తింపు సంఘంగా పోరాడుతామని తెలి పారు. ఈ సమావేశంలో నాయకులు కంది శ్రీనివాస్‌, గాండ్ల సంపత్‌, సో మిశెట్టి రాజేశం పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 12:28 AM