kumaram bheem asifabad- ఎవరి ఎ‘జెండా’ వారిదే..
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:02 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిలిచే అభ్యర్థులు సొంత ఎజెండాకే మొగ్గు చూపుతున్నారు. పంచాయ తీ ఎన్నికల్లో గెలుపు ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారింది. పార్టీలకతీతంగా జరిగే పల్లె పోరులో పార్టీ జెండా ఎగురవేయాలని తహతహ లాడుతున్నాయి. తమ పార్టీ మద్దతుదారులను బరిలో దించేందుకు గ్రామాల్లో నేతలు మంతనాలు జరుపుతున్నారు. ప్రజల్లో పలుకుబడి, ఆర్థిక స్థోమత ఉన్న అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు.
- సర్పంచ్ స్థానాల్లో పాగాకు పార్టీల తహతహ
- తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు వ్యూహాలు
- ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే కాంగ్రెస్ ఆశలు
- బీసీ ఓట్లపై ప్రతిపక్షాల గురి
- 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ మాట తప్పిందని ప్రచారం
బెజ్జూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిలిచే అభ్యర్థులు సొంత ఎజెండాకే మొగ్గు చూపుతున్నారు. పంచాయ తీ ఎన్నికల్లో గెలుపు ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారింది. పార్టీలకతీతంగా జరిగే పల్లె పోరులో పార్టీ జెండా ఎగురవేయాలని తహతహ లాడుతున్నాయి. తమ పార్టీ మద్దతుదారులను బరిలో దించేందుకు గ్రామాల్లో నేతలు మంతనాలు జరుపుతున్నారు. ప్రజల్లో పలుకుబడి, ఆర్థిక స్థోమత ఉన్న అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి నినాదంగా పల్లెల్లో పాగా వేసేందుకు అధికార కాంగ్రెస్ పావులు కదుపుతుండగా, బీసీ జెండానే ఎజెండాగా ప్రతిపక్షాలు పల్లె పోరులో కాంగ్రెస్‌ను డీకొనేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, పార్టీ పునాదులను పటిష్టం చేసుకునే దిశగా అన్ని పార్టీలు ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుంటున్నాయి.
- పార్టీలకు అతీతంగా..
పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నారు. పార్టీ గుర్తులు, రాజకీయ హామీ లు లేకుండా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. అయితే పల్లె పోరులో పైచేయి సాధించేందుకు ఆయా పార్టీల నేతలు తమ మద్దతు దారులను బరిలో దించుతున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 335గ్రామ పంచాయతీలు, 2,874 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ స్థానాలను అప్పటి అధికార పార్టీ బీఆర్‌ఎస్ కైవసం చేసుకుం ది. ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్రంగా గెలిచిన సర్పంచ్‌లు కూడా అభివృద్ధి కోసం గులాబీ కారెక్కారు. ప్రస్తుతం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేరు. దీంతో మెజార్టీ స్థానాలు ఎలాగైనా హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను అమలు చేస్తుంది. ఇప్పటికే పోటీ లేనిచోట్ల నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా ఉన్న దండె విఠల్ సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన వారే కావడంతో నియోజకవర్గంలో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు. పోటీ ఎక్కువగా ఉన్న గ్రామాల్లో పోటీదారుల మద్య రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. సర్పంచ్ పదవి పోటీ నుంచి తప్పుకుంటే ఎంపీటీసీకి అవకాశం ఇస్తామని కొన్నిచోట్ల మామీలు ఇస్తున్నారు.
- బలమైన అభ్యర్థుల వేటలో..
మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులకు దీటుగా బరిలో దించేందుకు బీఆర్‌ఎస్ కూడా ఆర్థికంగా బలమైన నేతలను, పార్టీకి నమ్మకంగా ఉన్నవారిని గుర్తించి బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌లు వేర్వేరుగా తమతమ అభ్యర్థులను పోటీ చేయించేందుకు గట్టిగా పావులు కదుపుతున్నారు. అయితే బీఆర్‌ఎస్‌లో రెండు వర్గాల కారణంగా స్థానిక పోరులో ఫలితాలు ఏవిధంగా ఉంటా యోనని విశ్లేషకులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. అదిష్ఠానం ఇద్దరిని ఏ మేరకు బుజ్జగిస్తుందో వేచి చూడాలి మరి.
- బీజేపీ సైతం..
బీజేపీ స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉంది. జిల్లాలో ఆ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా హరీశ్ బాబు ప్రాతినిత్యం వహిస్తున్నారు. నియోజకవర్గం లో స్థానిక పోరులో ఎలాగైనా పట్టునిలుపుకునేం దుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీ బలంతో పాటు యువతను ఎక్కువగా ఆకర్శించేం దుకు ఎత్తులు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అండతో పాటు గ్రామాల అభివృద్ధికి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాల్లో వివరిస్తూ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది.
- అధికారంలోకి వచ్చి..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు కావ డంతో ఆ పార్టీ ప్రజా తీర్పును తమకు అనుకూ లంగా వచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు గ్యాస్ సబ్సిడీ, 200యూనిట్ల ఫ్రీ విద్యుత్తు, తదితర సంక్షేమ పథ కాలతో తమను ప్రజలు ఆదరిస్తారని ఆశతో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. సన్న బియ్యం, సన్న వడ్లకు రూ.500సబ్సిడీ కూడా ఓట్లు రాలుస్తాయని ధీమాతో కాంగ్రెస్ ఉంది. ఇక ప్రతిపక్షాలు ప్రధానం గా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ను ఇరకా టంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. 42శాతం రిజర్వేష న్ల అమలుపై కాంగ్రెస్‌ను నిలదీస్తున్నాయి.
- ఎంతో కీలకం..
గ్రామపంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. బీఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్యగా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న క్రమంలో జరుగుతున్న ఎన్ని కలు కావడంతో గెలుపు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో మెజార్టీ స్థానాలను గెలవడం ఆ పార్టీకి సవాల్‌గా మారింది. బీఆర్‌ఎస్ కూడా గత వైభవాన్ని నిలుపుకునేందుకు పావులు కదుపుతు న్నాయి. 2023అసెంబ్లీ ఎన్నికల ఓటమి తరువాత వరుసగా వస్తున్న అన్ని ఎన్నికల్లో ఓటమిని ఎదు ర్కొంది. నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్నా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక జిల్లాలో ఏకైక బీజేపి ఎమ్మెల్యేగా ఉన్న పాల్వాయి హరీశ్ బాబు కూడా తన నియోజకవర్గంలో ఎలాగైని స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు గట్టి ప్రయ త్నా లు చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ పార్టీ నుంచి గ్రామాల్లో సర్పంచ్‌లను గెలిపించు కున్న దాఖలా లు లేవు. కానీ ఈసారి ఉనికి చాటుకునే ప్రయ త్నాలు చేస్తోంది.