Share News

టికెట్లు దక్కేదెవరికో..?

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:28 PM

స్థానిక ఎ న్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపికలో అధికార పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో గెలుపు అవకాశాలు కాంగ్రెస్‌కే ఉన్నప్పటికీ ఎక్కడా కూడా అవకాశం వదులు కోకూడ దనే పట్టుదలతో అధిష్టానం ఉంది. ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ కావడంతో అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేల భుజస్కందాలపై పడింది.

టికెట్లు దక్కేదెవరికో..?

-ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థుల ఎంపిక

-గెలుపు గుర్రాలకే కాంగ్రెస్‌ పెద్దపీట

-అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలదే తుది నిర్ణయం

-జిల్లా ఇన్‌చార్జి మంత్రి ద్వారా ప్రభుత్వానికి జాబితా

మంచిర్యాల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎ న్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపికలో అధికార పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో గెలుపు అవకాశాలు కాంగ్రెస్‌కే ఉన్నప్పటికీ ఎక్కడా కూడా అవకాశం వదులు కోకూడ దనే పట్టుదలతో అధిష్టానం ఉంది. ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ కావడంతో అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేల భుజస్కందాలపై పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి సంవత్సరం దాటినం దున ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాలను అధి ష్టానం ఇప్పటికే సేకరించింది. ఆ నివేదిక ప్రకారం ఎ న్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలనే సూచనలు జారీ చేసింది. ఒక్కో స్థానానికి కనీసం ముగ్గురు బల మైన, ప్రజాధారణ కలిగిన అభ్యర్థులను ఎన్నుకోనున్నా రు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కిరాగా ఎమ్మె ల్యేలు అందజేసే తుది జాబితా జిల్లా ఇంచార్జి మంత్రి ద్వారా ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందనుంది.

తుది నిర్ణయం అధిష్టానిదే...

ప్రతి స్థానానికి ముగ్గురు చొప్పున తయారు చేసిన అభ్యర్థుల జాబితా జిల్లాల నుంచి రాగానే అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ము గ్గురు ప్రతిపాదిత అభ్యర్థుల నుంచి ఒకరిని ఎంపిక చే సి, తిరిగి జిల్లాలకు పంపనున్నారు. అధిష్టానం సూచిం చిన అభ్యర్థికి పార్టీ టికెట్‌ను అందజేయనున్నారు. త ద్వారా వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవడం కోసం ఒక నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నారు. త ద్వారా ప్రతిపక్ష పార్టీలకు స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల చుట్టు ప్రదక్షిణలు...

మొదటి విడుతలో జరుగబోయే జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి టికెట్ల కోసం ఆశావహులు ఎ మ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌ అనుకూలించి, గతంలో పోటీచేసి విజయం సాధించినవారు మరోసారి అవకాశం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయగా, బీ సీలకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో కొత్తవారు కూడా పోటీ చేయాలనే కు తూహలంతో ఉన్నారు. ఇదిలా ఉండగా మండల, జిల్లా పరిషత్‌ ఎన్నిల నోటిఫికేషన్‌ ఈ నెల 9న విడుదల కా నుంది. అదే రోజు నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుండగా, 11వ తేదీతో ముగుస్తుంది. నోటి ఫికేషన్‌ విడుదలైన తరువాత కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అప్పటిలోగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయడమేగాకుండా, నామినేషన్లు కూడా దాఖలు చేయాల్సి ఉంది. నామినేషన్‌ దాఖలు గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ అధిష్టానం సైతం అభ్యర్థు ల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది.

జడ్పీ పీఠం దక్కేదెవరికో....?

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటి విడుత లో జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠం రిజర్వేషన్‌లో భాగంగా బీసీ మహిళకు కేటాయించారు. జిల్లాలో 16 మండ లాలు ఉండగా 10 స్థానాల్లో బీసీ మహిళలు పోటీపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి వరించనుండటంతో బీసీ జన రల్‌ స్థానాల్లోనూ మహిళలనే రంగంలోకి దింపాలనే ఆ లోచనతో ముఖ్యనాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. జి ల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవి కోసం జిల్లాలోని మం చిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాల పరిధి లో అధికార కాంగ్రెస్‌కు చెందిన బీసీ మహిళలు పోటీకి సిద్ధపడుతున్నారు. ఇందులో భాగంగా తమకే టికెట్‌ కేటాయించేలా నియోజకవర్గ ఎమ్మెల్యేలైన కొక్కిరాల ప్రేంసాగర్‌రావు (మంచిర్యాల), గడ్డం వివేకానంద (చెన్నూరు), గడ్డం వినోద్‌ (బెల్లంపల్లి)ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రజాధారణ ఉన్న నా యకులు జిల్లా పరిషత్‌ పీఠం కోసం దస్తీ వేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్‌ పీఠాన్ని దక్కించుకోవడం ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీం తో జడ్పీటీసీ సభ్యుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉండగా మూడు నియోజక వర్గాల ఎమ్మెల్యేల ఒకే పార్టీకి చెందిన వారైనప్పటికీ వారి మ ధ్య సఖ్యత లేకపోవడంతో జడ్పీ చైర్‌పర్సన్‌ స్థానం ద క్కించుకోవడం ద్వారా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించా లనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అందు కోసం ఎ మ్మెల్యేలు ముగ్గురూ ఎవరికి వారే అధిష్టానం దగ్గర తమదైన శైలిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్ర చారం జరుగుతోంది.

Updated Date - Oct 04 , 2025 | 11:28 PM