kumaram bheem asifabad- ఎక్కడి చెత్త అక్కడే
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:03 PM
రాజంపేట గ్రామ పంచాయతీలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నది. జిల్లా కేంద్రంలో గత డిసెంబరు మాసంలో రాజంపేట కొత్తగా గ్రామపంచాయతీగా ఏర్పడింది. పంచాయతీకి ఇన్‌చార్జి కార్యదర్శి, ఒక జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్, ఇద్దరు కామా టీలను కేటాయించారు. రాజంపేటలో 10 వార్డులు ఉన్నాయి. ఆయా వార్డులలో పారిశుధ్య కార్యక్రమాలకు కార్మికులను కేటాయించలేదు. దీంతో ఆయా కాలనీలలో చెత్త సేకరణ నిలిచిపోయింది.
- పట్టించుకోని అధికారులు, నాయకులు
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రాజంపేట గ్రామ పంచాయతీలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నది. జిల్లా కేంద్రంలో గత డిసెంబరు మాసంలో రాజంపేట కొత్తగా గ్రామపంచాయతీగా ఏర్పడింది. పంచాయతీకి ఇన్‌చార్జి కార్యదర్శి, ఒక జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్, ఇద్దరు కామా టీలను కేటాయించారు. రాజంపేటలో 10 వార్డులు ఉన్నాయి. ఆయా వార్డులలో పారిశుధ్య కార్యక్రమాలకు కార్మికులను కేటాయించలేదు. దీంతో ఆయా కాలనీలలో చెత్త సేకరణ నిలిచిపోయింది. కాలనీల్లో చెత్తకుప్పలు, కాలువల్లో పూడిక నిండిపోయింది. చెత్త సేకరణకు ఇటీవలే రెండు వాహనాలు ఇచ్చినప్పటికీ వాటిని నడిపేందుకు కార్మికులను కేటాయించలేదు. దీంతో రోడ్ల పక్కనే చెత్త పడేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆసిఫాబాద్, జన్కాపూర్, గొడవెల్లి మూడు రెవెన్యూ గ్రామాలను కలిపి మున్సిపాలిటిగా మార్చారు. మరో రెవెన్యూ గ్రామం రాజంపేటను పంచాయతీగా ప్రకటించింది.
- పది వార్డులతో ఏర్పాటు..
రాజంపేట పంచాయతీ 10 వార్డులతో ఏర్పడింది. ఇందులో 700కు పైగా కుటుంబాలు, 3,600 వరకు జనాభా కలిగి ఉంది. పారిశుధ్య కార్మికులను కేటాయించకపోవడం, నియమించుకునేందుకు జిల్లా అదికారుల నుంచి అనుమతి రాకపోవడంతో పనులు చేపట్టే వారు లేక చెత్తాచెదారం పేరుకుపోతోంది. ఏ కాలనీలో చూసిన చెత్త కుప్పలు, కాలువల్లో పూడిక నిండి అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. ఇటివలే చెత్త సేకరణకు మూడు వాహనాలు ఇవ్వగా ఇందులో ఒకటి పని చేయడంలేదు. వాహనాలను ఇచ్చినప్పటికీ కార్మికులను కేటాయించలేదు. ఇటీవల కలెక్టర్ వెంకటే ష్ దోత్రే పంచాయతీకి కార్మికులను కేటాయించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవం లేదు. జూబ్లీ మార్కెట్ వద్ద వ్యాపారులు నిత్యం కుళ్లిన కూరగాయాలను పక్కనే పడేస్తుంటారు. దాన్ని తొలగించే సిబ్బంది లేక పోవడంతో దుర్గంధం వెదజ ల్లుతూ అటుగా వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నా యి. ఈ విషయాన్ని ప్రజలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో ఇటివల గ్రామపంచాయతీ అధి కారులు ప్రైవేటు కార్మికులతో చెత్తను తొలగించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో పారిశుధ్య కార్మికులను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం..
- శ్రీనివాస్, పంచాయతీ ప్రత్యేకాధికారి
రాజంపేట పంచాయతీలో నెలకొన్ని పారిశుద్ద్య కార్మికుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. పంచాయతీలో అత్యవసరం ఉన్నచోట ప్రైవేటు కార్మికులతో పనులు చేయిస్తున్నాం. త్వరలోనే సమస్యకు పరిష్కరం లబించనుంది.