Share News

రోడ్లు బాగుపడేదెప్పుడో?

ABN , Publish Date - Aug 17 , 2025 | 01:06 AM

శాలిగౌరారం మండలంలో ఏ రోడ్డు చూసిన ఏమున్నది గర్వకారణం.. సమస్తం గుంతలమయం.. గతుకుల రోడ్లతో..ప్రయాణికుల అయోమయం.... అన్న చం దంగా మారాయి.

 రోడ్లు బాగుపడేదెప్పుడో?
అధ్వానంగా మారిన శాలిగౌరారం గ్రామ పీఆర్‌ రోడ్డు

రోడ్లు బాగుపడేదెప్పుడో?

నరకకూపాలుగా మారిన రహదారులు

అడుగడుగునా గుంతలు,

ప్రయాణికుల అవస్థలు..

పట్టించుకోని అధికారులు

శాలిగౌరారం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): శాలిగౌరారం మండలంలో ఏ రోడ్డు చూసిన ఏమున్నది గర్వకారణం.. సమస్తం గుంతలమయం.. గతుకుల రోడ్లతో..ప్రయాణికుల అయోమయం.... అన్న చం దంగా మారాయి. ఈ గుంతలరోడ్లపైన ఎన్నోసార్లు ఎంపీ, ఎమ్మెల్యే వెళ్లినా ఇంత వరకు రోడ్ల మరమ్మతులకు హామీలు తప్ప ఆచరణలో ఆమడదూరంగా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శాలిగౌరారం మండల కేంద్రం నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్లు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోడ్ల రూపురేఖలే మారిపోయా యి. ఫలితంగా ఈ రోడ్లపై కనీసం పాదచారులు కూడా నడవలేని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా గుంతలతో గంట ప్రయాణం రెండు గంటలు పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. మరికొన్ని రోడ్లు వర్షం పడినపుడు కుంటలను తలపిస్తున్నా యి. నకిరేకల్‌ -గురజాల ప్రధాన రహదారిలో రామగిరి నుంచి గురజాల వరకు ఉన్న ఆర్‌బీ రోడ్డు 3 కిలోమీటర్లు అధ్వానంగా మారి రాకపోకలకు తీవ్రఅంతరాయం కలుగుతుంది. ఇదే రోడ్డు అమ్మనబో లు, మోత్కూరు వరకు, అడ్డగూడూరు, తిరుమలగి రి వరకు అనుసంధానంగా ఉండటం వల్ల నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి. అడుగడుగునా గుంతలు, కంప చెట్లతో నరకకూపంగా మారడంతో ఈ రోడ్డులో ప్రయాణం అంటేనే భయపడుతున్నా రు. గురజాల గ్రామంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఈ రోడ్డు పెద్ద గుంతలాగా మారి కుంటను తలపిస్తోంది. ఈ రోడ్డును పదేళ్ల క్రితమే డబుల్‌ రోడ్డుగా మార్చే అవకాశం ఉన్నా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే ఈ 3 కిలోమీటర్ల రోడ్డును డబుల్‌ రోడ్డుగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. శాలిగౌరారం బస్‌ స్టేజీ నుంచి హాస్పిటల్‌ మార్గంలో దొనబండ బైరవునిబండ ఎక్స్‌రోడ్డు వర కు ఉన్న పంచారుతీరాజ్‌ విభాగం రోడ్డు కూడా అస్తవ్యస్తంగా మారింది. ఈ రోడ్డును దాదాపు 25 ఏళ్ల క్రితం బీటీగా మార్చారు. ఇంతవరకు ఈ రోడ్డు కు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో కంక ర తేలి గుంతలతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ 2 కిలోమీటర్లు రోడ్డును సీసీతో డబుల్‌ రోడ్డుగా మార్చాలని శాలిగౌరారం గ్రామస్థులు కోరుతున్నారు. శాలిగౌరా రం మార్కెట్‌ అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి భైరవునిబండ మీదుగా అమ్మనబోలు వరకు ఉన్న రోడ్డు కూడా అధ్వానంగా మారింది. వంగమర్తి నుంచి గురజాల వరకు, పావురాలగూడెం నుంచి చౌల్లగూ డెం వరకు, ఊట్కూరు నుంచి బండమీదిగూడెం వరకు, శాలిగౌరారం నుంచి వయా ఆకారం నుంచి కట్టంగూరు వరకు, శాలిలింగోటం నుంచి అంబారిపేట వరకు, శాలిలింగోటం నుంచి తుడిమిడి వరకు, అంబారిపేట నుంచి చిత్తలూరు వరకు ఉన్న రోడ్లు అస్తవ్యస్తంగా తయారై రాకపోకలకు అంతరాయం కలుగుతున్నా పట్టించుకోననే నాథుడే లేడని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు బాగా లేనందున ప్రమాదాలు కూడా నిత్యం జరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు. ఇక్కడి రోడ్ల అస్తవ్యస్తం మారడంతో ఆర్టీసీ అధికారులు బస్సులు కూడా నడపడం లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ రోడ్లకు మరమ్మతులు చేయించి రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని మండల ప్రజలు కోరుతున్నారు.

రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలి

శాలిగౌరారం మండలంలోని ప్ర ధాన రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మా రాయి. ఏగ్రామానికి వెళ్లాలన్నా రహదారులన్నీ గుంతలమయం, కంపచెట్లతో అధ్వానంగా మారాయి. పాలకు లు, ప్రభుత్వాలు మారుతున్నా శాలిగౌరారం రోడ్లు మాత్రం మరమ్మత్తులకు నోచుకోవడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ గుంతలమయంగా ఉండటం వల్ల వరదనీటితో చిన్న చిన్న కుంటలుగా కనిపిస్తున్నాయి. రోడ్లు బాగా లేనందు వల్ల బస్సులు కూడా సరిగ్గా రావడం లేవు.వెంటనే సంబంధిత అధికారులు, ప్రజా ప్ర తినిధులు అన్ని రోడ్లను పక్కాగా ఏర్పాటు చేయాలి.

- కంది మహేష్‌, శాలిగౌరారం

Updated Date - Aug 17 , 2025 | 01:06 AM