kumaram bheem asifabad- ఓపీఎస్‌ల క్రమబద్ధీకరణ ఎప్పుడు..?
ABN , Publish Date - Oct 31 , 2025 | 10:23 PM
జిల్లాలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ జూనియర్ పం చాయతీ కార్యదర్శు(ఓపీఎస్)ల పరిస్థితి దయనీయంగా ఉంది. 2018లో జేపీఎస్ పరీక్ష ద్వారా 9,355 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శుల పోస్టులకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేసింది. ఇందులో సుమారు మూడు వేల మందికి ఇతర ఉద్యోగాలు రావడంతో ఆ ఖాళీల్లో తర్వాత స్థానాల్లో ఉన్న 2వేల మందిని 2019లో ఔట్ సోర్సింగ్ ద్వారా నియామాకాలను చేసింది.
- ఏజెన్సీ ద్వారానే వేతనాల చెల్లింపు
- జీతాలు సైతం తక్కువేనని ఆవేదన
కాగజ్‌నగర్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ జూనియర్ పం చాయతీ కార్యదర్శు(ఓపీఎస్)ల పరిస్థితి దయనీయంగా ఉంది. 2018లో జేపీఎస్ పరీక్ష ద్వారా 9,355 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శుల పోస్టులకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేసింది. ఇందులో సుమారు మూడు వేల మందికి ఇతర ఉద్యోగాలు రావడంతో ఆ ఖాళీల్లో తర్వాత స్థానాల్లో ఉన్న 2వేల మందిని 2019లో ఔట్ సోర్సింగ్ ద్వారా నియామాకాలను చేసింది. ఈ నియామాకాల్లో క్రమబద్ధీకరణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఒప్పందాలు జరిగాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వ కొలువు దొరుకుతుందన్న ఆశతో ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరారు. నాలుగేళ్ల ఒప్పంద కాలం పూర్తి అయినప్పటికీ కూడా ఇంత వరకు వీరిని క్రమబ ద్ధీకరించడం లేదు. దీంతో తమ భవిష్యత్తు ఎంటన్నీ అంశం వీరిలో ఇప్పుడు ఆందోళన రేకెత్తుతోంది. ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందన్న సంతోషమూ లేదు, క్రమబద్ధీకరణ కాక ఇంకా ఇబ్బం దులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తమకు ఉద్యోగ భద్రత లేక చాలా కష్టాలు పడుతున్నామని పలువురు ఆవేదన చెందుతున్నారు. క్రమబద్ధీకరణ కాక పోవడంతో ఇంక్రిమెంట్లు రాక పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- కుమరం భీం జిల్లాలో..
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఔట్ సోర్సిం గ్ విధానంపై 54 మంది విధులు నిర్వహిస్తున్నా రు. ప్రభుత్వం వీరిని క్రమబద్ధీకరించక పోవడంతో ఆందోళన చెందు తున్నారు. తాము రాత పరీక్ష ద్వారా ఎంపికైనప్పటికీ కూడా తమకు అన్యాయం జరుగుతోందని, తమకు వెంటనే న్యాయం చేయా లని సంబంధిత మంత్రులకు కూడా వినతి పత్రాలిచ్చినప్పటికీ కూడా ఇంత వరకు పురోగతి లేక ఇబ్బందులు పడాల్సిన దైన్య స్థితి ఏర్పడిందని అంతా వాపోతున్నారు. ఓపీఎస్‌లకు అరకొర వేతనాలే దిక్కయ్యాయి. రూ.18,231 వేతనంగా నిర్ధారించారు. ఇందులో ఏజెన్సీ కమిషన్, ఈపీఎఫ్, జీఎస్టీ, సర్వీస్ పోను నెలకు రూ.10,600 నుంచి రూ.15000 వరకు మాత్రమే వస్తున్నాయని వారు చెబుతున్నారు. ఒక్కో జిల్లాకు ఒక్కొక్క తీరుగా వేతనాలు వస్తున్నాయని ఔట్ సోర్సింగ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు వాపోతున్నారు. కొన్ని జి ల్లాలో మూడు నుంచి నాలుగు నెలల వరకు జీతాలు ఇంత వరకు రావడం లేదని పలువురు ఓపీఎస్ తెలిపారు. తమతో పాటు రిక్రూట్ అయని రెగ్యూలర్ అయిన పంచాయతీ కార్యదర్శులకు రూ.28వేల వేతనం వస్తోందని, తమకు మాత్ర సగం జీతం వస్తోందని, విధులు మాత్రం సమా నంగా నిర్వహిస్తున్నామని, ఇంత అన్యాయం జరుగటం చాలా దారుణమని పేర్కొన్నారు. గత నెలలో కూడా పంచాయతీ రాజ్ మంత్రి సీతక్కను కూడా కలిసి విన్నవించారు.
- సర్కార్‌కు పట్టింపు కరువు..
ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు(ఓపీఎస్‌లు) భవిష్యత్‌ను ప్రభుత్వం ప్రశ్నార్థకంలో పడేసింది. వీరి విషయంలో తన వైఖరి స్పష్టం చేయడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లుతున్నప్పటికీ కూడా వీరి క్రమబద్ధీకరణ విషయం ఇంకా తేలక పోవడంతో భవిషత్తు ఏంటని ఔట్ సోర్సింగ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీల్లో ఆందోళన నెలకొన్నది. ప్రస్తుతం జీపీఎస్‌ల పని తీరు ఆధారంగా రెగ్యూలరైజ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రస్తుతం రెగ్యూలర్‌గా పని చేస్తున్న జీపీఎస్‌ల్లో 90 శాతం రెగ్యూలర్ నియామాకాలు కుమరం భీం జిల్లాలో పూర్తి చేశారు. ఓపీఎస్‌లు గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం, హరితహారం, మొక్కల పెంపకం, న్సరీల నిర్వహణ, ఉపాధి హామీ పనుల కల్పన, పన్నుల విధింపు, గ్రామ సభలు, సమావేశాల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల గుర్తింపు, పంచాయతీ రికార్డుల నిర్వహణ, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటింటా సేకరించిన తడి, పొడి చెత్తను సెగ్రిగేషన్ షెడ్లు, డంప్ యార్డులకు తరలింపు వంటి పనులు రెగ్యూలర్ పంచాయతీ కార్యదర్శులతో సమా నంగా విధులు నిర్వహిస్తున్నారు. కానీ వీరి జీతాలు సమస్య, ఉద్యో గ భద్రత విషయంలో ఇంత వరకు ఎలాంటి అడు గులు పడక పోవడంతో భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.