Share News

కొత్త పింఛన్లు ఎప్పుడో...?

ABN , Publish Date - May 22 , 2025 | 11:16 PM

అసెంబ్లీ ఎన్ని కల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పొందు పరిచిన విధంగా కొత్త పింఛన్లు మంజూరుకు మోక్షం కలగడం లేదు. ఏడాదిన్నర గడిచినా ఆ ప్రక్రియ అక్క డే ఆగిపోయింది. చేయూత పథకం కింద పింఛన్లను పెంచబోతున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ, గి రిజన శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. 2024 జూలై లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖలపై మంత్రి నిర్వహించిన సమీక్షలో పై విధంగా ప్రకటన చేశారు.

కొత్త పింఛన్లు ఎప్పుడో...?

-ఏడాదిన్నర గడిచినా ముందుకు కదలని ప్రక్రియ

-జిల్లాలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు

-ఓఏపీ మినహా ఇతర పింఛన్లకు కలగని మోక్షం

-మరికొన్ని పథకాలదీ అదే దారి

మంచిర్యాల, మే 22 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్ని కల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పొందు పరిచిన విధంగా కొత్త పింఛన్లు మంజూరుకు మోక్షం కలగడం లేదు. ఏడాదిన్నర గడిచినా ఆ ప్రక్రియ అక్క డే ఆగిపోయింది. చేయూత పథకం కింద పింఛన్లను పెంచబోతున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ, గి రిజన శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. 2024 జూలై లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖలపై మంత్రి నిర్వహించిన సమీక్షలో పై విధంగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కొత్త పిం ఛన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సం బంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. అంతా సవ్యంగా సాగితే అదే సంవత్సరం ఆగస్టు 1 నుంచే కొత్త పింఛన్లు అందుతాయనే ప్రచారం జరగ డంతో దరఖాస్తుదారులు ఆశపడ్డారు. అయితే నేటి వర కు ఆ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు.

ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా...

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత వివిధ రకాల పథకాల కోసం స్వీకరించిన దర ఖాస్తుల ఆధారంగానే పింఛన్‌దారుల నివేదికను అ ధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ఆయా దరఖా స్తులతోపాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పెండిం గులో ఉన్న పింఛన్ల లిస్టును కూడా పరిగణలోనికి తీ సుకున్న అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ప్రస్తుతం చేనేత, పైలేరియా రోగులు, వృద్ధులు, వితం తువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఎయిడ్స్‌ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్రంలో పింఛన్లు అందజేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆసరా పథకం కింద రూ. 2016, దివ్యాంగులకు రూ. 3016 ఇవ్వగా, కాంగ్రెస్‌ హయాంలో చేయూత పథకం ద్వారా వాటిని రూ. 4 వేలకు పెంచుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది.

దరఖాస్తుల పరిశీలన పూర్తయినా....

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కోసం అర్హులైన పే ద ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజుల్లోనే ప్రజా పాలన కార్యక్రమం ఏర్పాటు చేసి దరఖాస్తులు ఆహ్వానించింది. చేయూత పథకం అమలుకు ప్రభు త్వం సన్నాహాలు చేస్తుండటంతో ఆయా విభాగాలకు చెందిన దరఖాస్తుల పరిశీలనను కూడా అధికారులు పూర్తి చేశారు. జాబితాను కంప్యూటరైజ్‌ చేసిన అనంత రం అర్హుల తుది జాబితాను ప్రభుత్వానికి అందజేశా రు. కాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత బ స్సు సౌకర్యం, రూ. 500 వంట గ్యాస్‌ సబ్సిడీ పథకా లు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయి. కాగా ప్రకటించిన వాటిలో మిగతా పథకాలు ప్రారంభం కాలేదు.

లక్షల్లో దరఖాస్తులు...

ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా వివిధ పథకాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా లక్షల్లో దరఖాస్తులు అందగా, అర్హతగల వాటిని అధికారులు ఆమోదించారు. కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అంగవైకల్యం కింద మొత్తం 6591 దరఖాస్తులను అధి కారులు ఆమోదించారు. అలాగే ఇతర విభాగాలకు చెం దిన పింఛన్ల కోసం 50,467 దరఖాస్తులు అర్హత సా ధించాయి. అంగవైకల్యం కింద జిల్లాలోని అర్హులకు పింఛన్లు అందజేసేందుకు నెలకు రూ. 3 కోట్ల 95 లక్ష ల 46 వేలు అవసరం కాగా ఇతర విభాగాల వారికి పింఛన్లు మంజూరు చేసేందుకు నెలకు రూ. రూ 20 కోట్ల 18 లక్షల 68 వేలు అవసరం అవుతాయి. ఈ మొ త్తాన్ని ప్రభుత్వం లబ్దిదారులకు అందజేయాల్సి ఉండ గా, కేవలం ఓల్డ్‌ ఏజ్‌ పింఛన్లు మాత్రం అమలుకు నో చుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా కొత్తగా భర్త చనిపోయి న స్త్రీలు 2,891 మందికి పింఛన్లు సక్రమంగా అందు తున్నాయి. ఇదిలా ఉండగా గృహిణులకు రూ. 2500 పథకం కింద 2,10,614 దరఖాస్తులు రాగా పథకం అ మలుకు నోచుకోలేదు. అలాగే కౌలు రైతులకు రూ. 12,000 పథకం కింద 1,06,365, ఉద్యమకారులకు 323 చదరపు గజాల ఇంటి స్థలం పథకం కింద 2534 దర ఖాస్తులు వచ్చాయి. వాటికి ఏడాదిన్నర గడిచినా మో క్షం లభించడంలేదు.

Updated Date - May 22 , 2025 | 11:16 PM