Share News

భూముల లెక్క తేలేదెప్పుడు...?

ABN , Publish Date - Jun 29 , 2025 | 11:32 PM

జిల్లా కేం ద్రంలోని అత్యంత ఖరీదైన స్థలం కబ్జా విషయమై అధి కారులు నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారు. కబ్జాకు గురైందని ప్రచారంలో ఉన్న ప్రభుత్వ స్థలం అసలు కబ్జాకు గురైందో...లేదో తేల్చడానికి తటపటాయి స్తున్నా రు. ఏళ్ల తరబడి సర్వేల పేరుతో కాలయాపన చేస్తుం డటంతో అధికారుల తీరుపై అనుమానాలు రేకెత్తుతు న్నాయి.

భూముల లెక్క తేలేదెప్పుడు...?

-సర్వేలతోనే సరిపెట్టిన అధికారులు

-కబ్జా విషయం తేల్చడంలో నిర్లక్ష్యం

-వివాదాస్పద స్థలంలో యథేచ్ఛగా వెలుస్తున్న భవనాలు

-కోర్టులో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయడంలోనూ నిర్లక్ష్యం

మంచిర్యాల, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేం ద్రంలోని అత్యంత ఖరీదైన స్థలం కబ్జా విషయమై అధి కారులు నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారు. కబ్జాకు గురైందని ప్రచారంలో ఉన్న ప్రభుత్వ స్థలం అసలు కబ్జాకు గురైందో...లేదో తేల్చడానికి తటపటాయి స్తున్నా రు. ఏళ్ల తరబడి సర్వేల పేరుతో కాలయాపన చేస్తుం డటంతో అధికారుల తీరుపై అనుమానాలు రేకెత్తుతు న్నాయి. ఇదే విషయమై స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన సదరు స్థలంలో సర్వే జరపాలని హై ద్రాబాద్‌లోని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్‌ కార్యా లయానికి లేఖ రాశారు. దీంతో హైద్రాబాద్‌ బృందం సంవత్సరం క్రితం మూడు నెలల వ్యవధిలో రెండు సా ర్లు సర్వే జరిపారు. సర్వే రిపోర్ట్‌ను వారం రోజుల్లో కలె క్టర్‌కు అందజేస్తామని అధికారులు తెలిపినాఏడాది గ డిచినా పరిష్కారం లభించడం లేదు.

అధికారుల నాన్చుడు ధోరణి...!

హైద్రాబాద్‌లోని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ జా యింట్‌ డైరెక్టర్‌ ప్రసన్నలక్ష్మి నేతృత్వంలో అధికారులు గతేడాది జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వెనకాల ఉన్న సర్వే నెంబర్లు మంచిర్యాల శివారులోని 422, గర్మిళ్ల శివారులోని 92,93 గల 13.38 ఎకరాల పై చిలుకు ప్ర భుత్వ భూమిలో సర్వే జరిపారు. కొంతకాలంగా ఈ స్థ లం విషయమై తీవ్ర వివాదం నెలకొంది. అది ప్రభు త్వ భూమి కాగా, కొందరు అక్రమంగా కబ్జా చేశారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ, స్థానిక ల్యాండ్‌ సర్వే అధికారులు పలుమార్లు సర్వేలు జరిపినాఅది పట్టా భూమో, ప్రభుత్వ స్థలమో నిర్దారించకపోవడంతో వివా దం రోజు రోజుకూ ముదురుతోంది.

కలెక్టర్‌కు ఫిర్యాదుతో....

మంచిర్యాల శివారు సర్వే నెంబరు 422లో ప్రభుత్వ భూములు పెద్ద మొత్తంలో కబ్జాలకు గురవుతున్నా యని, వాటిని కాపాడాలని పట్టణానికి చెందిన తులా మధుసూధన్‌రావు అనే వ్యక్తి పలుమార్లు కలెక్టర్‌ కు ఫి ర్యాదులు చేశారు. మంచిర్యాల ఆర్డీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా మున్సిపల్‌ అధికారులు నిర్మాణ అనుమతు లు ఇచ్చారని, ఆర్డీవో నివేదికలో దొర్లిన సాంకేతిక లో పాలను గమనించనించకుండానే అనుమతులు మం జూరు చేశారని, కలెక్టర్‌ స్పందించి కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అప్పటి కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ నాయక్‌ హైద్రాబా ద్‌లోని ల్యాండ్‌ సర్వే అధికారులకు లేఖ రాశారు. ఇదే విషయమై ‘జిల్లా కేంద్రంలో భూకబ్జా’ శీర్షికన 2023 జూలై 18న ’ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీంతో మార్చి 28న హైద్రాబాద్‌కు చెందిన అధికారుల బృందం స్థానిక రైల్వే స్టేషన్‌ నుంచి ఆర్టీసీ డిపో వరకు సర్వే నిర్వహించారు. భూమి సర్వే జరిపిన జాయింట్‌ డైరెక్టర్‌ ప్రసన్నలక్ష్మి రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివే దికను కలెక్టర్‌కు అందజేస్తామని అప్పట్లో మీడియా సమక్షంలో తెలిపారు. మూడు నెలల అనంతరం హై ద్రాబాద్‌కు చెందిన అదే అధికారుల బృందం తిరిగి రెండోసారి సర్వే జరిపినందున ఇప్పుడైనా భూ కబ్జా విషయం తేల్చుతారా అన్న సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.

వెలుస్తున్న భవనాలు....

మరోవైపు వివాదాస్పద స్థలంలో రోజు రోజుకూ నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ఓ వైపు అఽధికారు ల బృందం సర్వే జరిపి, రిపోర్టు పెండింగులో ఉండ గానే బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు జరుగు తుండటం గమనార్హం. మూడు నెలల క్రితం హైద్రా బాద్‌ బృందం సర్వే జరిపినప్పుడు నిర్మాణంలో ఉన్న భవనం ప్రస్తుతం అన్ని హంగులు పూర్తి చేసుకుంది. దీంతోపాటు సమీపంలో మరికొన్ని నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. అసలు భూమి స్వభావం తేలకుండా శాశ్వత నిర్మాణాలు చేపట్టడం పట్ల ప్రజలు విస్మయం చెందుతున్నారు. ఇదిలా ఉండగా అధికారులు సర్వే జర పడంతో భూమి తమదని భావిస్తున్న పలువురు హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. భూమి తమదేనని, అధికారులు చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరు తూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒకవేళ సదరు స్థలం ప్ర భుత్వ భూమి అయితే అధికారులు ఎందుకు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయడం లేదనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలమని కోర్టులో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయడమో, లేదా ప్రైవేటు భూమిగా భావించి వదిలి వేయడమో చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 29 , 2025 | 11:32 PM