కొర్రమట్టల ప్రాజెక్టుకు మోక్షమెప్పుడో..?
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:15 PM
మంచిర్యా ల జిల్లాలో కొర్ర మట్టల (మంచినీటి చేపలు) పెంప కం కోసం ఏర్పాటు చేయదలచిన భారీ ప్రాజెక్టుకు ఏడాది గడుస్తున్నా మోక్షం కలగడం లేదు.
జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి రూపకల్పన
- ఏడాది గడుస్తున్నా ఊసెత్తని సర్కారు
- రూ. 15 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక
- స్థలం కేటాయించినా పట్టాలెక్కని ప్రాజెక్టు
మంచిర్యాల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మంచిర్యా ల జిల్లాలో కొర్ర మట్టల (మంచినీటి చేపలు) పెంప కం కోసం ఏర్పాటు చేయదలచిన భారీ ప్రాజెక్టుకు ఏడాది గడుస్తున్నా మోక్షం కలగడం లేదు. మంచిర్యాల జిల్లా గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద భారీ ప్రా జెక్టుకు రూపకల్పన చేయడం ద్వారా కొర్రమట్ట (కొర మీను) చేపలను పెంచాలని రాష్ట్రప్రభుత్వం గతే డాది నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ. 15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోయే ప్రాజెక్టు కోసం రెవెన్యూ శాఖ ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలో 30 ఎక రాల స్థలాన్ని కేటాయించింది. రాష్ట్రంలోనే తొలి సారిగా చేపట్టదలచిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్)కి చెందిన మంచినీటి చేపల పెంపకం సంస్థ అయిన సీఐ ఎఫ్‌ఏ (సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వా కల్చ ర్) సాంకేతిక సహకారంతో స్థాపించేందుకు సన్నా హాలు చేసింది. ప్రాజెక్టు కోసం అవసరమైన ప్రతి పాద నలు సమర్పించగా కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబ రు నెలలో ఆమోదం కూడా తెలిపింది. త్వరలోనే ప్రాజె క్టు కార్యరూపం దాల్చనుందని మత్స్యశాఖ అధికారు లు ప్రకటించగా, ప్రభుత్వం ఇప్పటి వరకు తిరిగి ఆ ఊసే ఎత్తకపోవడంతో అడుగులు ముందుకు పడలేదు.
ఫ ప్రజల్లో డిమాండ్..
ప్రజలు అమితంగా ఇష్టపడే కొర్రమట్ట చేపను దక్షి ణ తెలంగాణలో బొమ్మె చేపగా కూడా పిలుస్తారు. పొ డవుగా ఉండి, చదునైన శరీరాన్ని కలిగి ఉండే కొర్రమ ట్టకు పోషకాల గనిగా పేరుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో 600 రూపాయల వరకు ధర పలుకుతోంది. ఈ చేపకు ప్రజల్లో మంచి డిమాండ్ ఉండగా, దీన్ని తినేం దుకు ఎగువ మధ్యతరగతి, సంపన్నులు అమితంగా ఇష్టపడతారు. కాగా కొర్రమట్టను 2016లో అప్పటి ప్ర భుత్వం రాష్ట్ర చేపగా గుర్తించింది. ఈ రకం చేపల జా తిని కాపాడటం ద్వారా వాటి సంఖ్యను మరింతగా పెంచి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొర్రమట్టతోపాటు ఆ జాతికే చెం దిన బురద మట్టలు, చేపల విత్తన కేంద్రం, వాటి పెం పకానికి అవసరమైన హేచరీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తయ్యే పిల్లలను రాష్ట్రవ్యా ప్తంగా చేపల పంపిణీ పథకానికి వినియోగిస్తారు. కొర్రమట్ట పిల్లలను అస్తమా వ్యాధిగ్రస్తుల కోసం మృ గశిర కార్తెలో పంపిణీ చేసే చేప ప్రసాదంలో వాడ తారు. ప్రాజెక్టులో పెంచిన కొర్రమట్టలను ప్రజలు విని యోగించేందుకు వీలుగా మార్కెట్లలో అందుబాటులో ఉంచడంతోపాటు, రాష్ట్ర అవసరాలు పోను మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాలని ప్రణాళికలు తయారు చేశారు. అయితే ప్రాజెక్టుకు రూ పకల్పన జరిగి ఏడాది గడుస్తున్నా అది కార్యరూపం దాల్చలేదు.