Share News

పంట నష్టం చెల్లించేదెప్పుడో...?

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:37 PM

ఈ యేడు భారీ వర్షాల కారణంగా పంటలు కోల్పోయిన రైతంగా నికి ఇప్పటి వరకు పరిహారం అందించలేదు. ఆగస్టు 28న జిల్లాలో కురిసిన భారీ వర్షాలు రైతులకు తీరని నష్టం మిగిల్చాయి. అల్పపీడన ప్రభావం కారణంగా అ ప్పుడు రెండు రోజులపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో పంటలకు నష్టం వాటిల్లింది.

పంట నష్టం చెల్లించేదెప్పుడో...?

-గోదావరి ఉప్పొంగడంతో నీట మునిగిన వరి, పత్తి

-జిల్లాలో 13వేల పై చిలుకు ఎకరాలు వరదలపాలు

-ప్రకృతి వైపరిత్యాలతో రైతులకు తీరని నష్టం

-ప్రతిపాదనలకే పరిమితం అవుతున్న పరిహారం చెల్లింపులు

-సీఎం హామీ ఇచ్చినా ముందుకు కదలని ప్రక్రియ

మంచిర్యాల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఈ యేడు భారీ వర్షాల కారణంగా పంటలు కోల్పోయిన రైతంగా నికి ఇప్పటి వరకు పరిహారం అందించలేదు. ఆగస్టు 28న జిల్లాలో కురిసిన భారీ వర్షాలు రైతులకు తీరని నష్టం మిగిల్చాయి. అల్పపీడన ప్రభావం కారణంగా అ ప్పుడు రెండు రోజులపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో పంటలకు నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా నాట్ల దశలో ఉన్న వరి వరదల్లో కొట్టుకుపోగా, ఏపుగా పెరుగుతున్న పత్తిపం ట పూర్తిగా నీట మునిగింది. ఈ సంవత్సరం వర్షాకా లం సీజన్‌ ప్రారంభమైన నాటి నుంచి నాలుగు దఫా లుగా వర్షాలు రైతులను కడుపుకోతకు గురిచేశాయి.

జిల్లాలో 13వేల ఎకరాల్లో నష్టం...

ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షం కారణంగా జిల్లా లో 7781 మంది రైతులకు చెందిన 13126 ఎకరాల్లో పంటలు వరదపాలయ్యాయి. జిల్లాలోని భీమిని, తాం డూరు, మందమర్రి, నెన్నెల, వేమనపల్లి, కన్నెపల్లి, కోట పల్లి, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, కాసిపేట, హాజీపూర్‌, చె న్నూరు, జైపూరు, జన్నారం మండలాల్లో 3215 మంది రైతులకు చెందిన 4964 ఎకరాల వరి పంట నీట ము నగగా, 4538 మంది రైతులకు చెందిన 8107 ఎకరాల పత్తి చేలలో నీరు నిలిచింది. అలాగే 13 మంది రైతు లకు చెందిన 35 ఎకరాల మిర్చి, 15 మందికి చెందిన 20 ఎకరాల కూరగాయల సాగు సైతం వర్షార్పణం అ యింది. వర్షాల కారణంగా వరికి ఎకరాకు రూ. 10వేల చొప్పున రూ. 4 కోట్ల 96 లక్షల 40 వేల వరకు నష్టం వాటిల్లగా, పత్తి పంటకు ఎకరాకు రూ. 15వేల చొప్పున మొత్తం 12 కోట్ల 16 లక్షల 5వేల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. భారీ వర్షాలకు తోడు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు తెరవడంతో గోదావరి ఉగ్ర రూపం దాల్చిన కారణంగా నది పరివాహక ప్రాంతాల్లో అదే నెల 29న వేలాది ఎకరాల్లో ఏపుగా పెరిగిన పంట ముంపునకు గురైంది. అలాగే మార్చి, ఏప్రిల్‌, మే నెల ల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా వివిధ రకాల చేతికి వచ్చిన పంట పెద్ద మొత్తంలో నీటి పాలైంది. పై మూడు నెలల్లో ఏకంగా 2310 మందికి చెదిన 3505 ఎకరాల పంట నీట మునగా, ఆగస్టులో వేలాది ఎకరా లు నీట మునగగా, బాధిత రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

ప్రతిపాదనలకే పరిమితం....!

అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రై తులకు ఎకరాకు రూ. 10వేల పరిహారం అందిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే మార్చి నుం చి మొదలుకొని ఆగస్టు వరకు కురిసిన వర్షాల కార ణంగా రైతులకు జరిగిన నష్టాన్ని వ్యవసాయశాఖ అధి కారులు అంచనా వేసి, సంబంధిత రిపోర్టును ప్రభు త్వానికి అందజేశారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇ ప్పటి వరకు బాధిత రైతులకు పరిహారం అందలేదు. మార్చి నుంచి మే వరకు జరిగిన నష్టం అధికారుల అంచనా ప్రకారం రూ. 3 కోట్ల 50 లక్షల 63వేల 250 ఉంటుంది. అలాగే ఆగస్టులో 28వ తేదీ వరకు సుమా రు రూ. 25 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

సీఎం హామీ ఇచ్చినా అందని పరిహారం...!

భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చ డంతో ముఖ్యంగా రైతులకు భారీ నష్టం సంభవిం చిం ది. వరదల ప్రభావాన్ని పరిశీలించేందకు ముఖ్యమం త్రి రేవంత్‌ రెడ్డి ఆగస్టు 28న చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఏరి యల్‌ సర్వేలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టును సంద ర్శించారు. అక్కడ అధికారులతో మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని అంచనా వేసి రిపోర్టును తక్షణమే ప్రభుత్వా నికి అందజేయాలని సీఎం ఆదేశించారు. స్వయంగా సీ ఎం ఆదేశించడంతో అధికారులు ఉరుకులు, పరుగుల మీద నష్టం అంచనా వేసి, నివేదికను ప్రభుత్వానికి అం దజేయగా, పరిహారం అందుతుందేమోనని రైతులు ఆశపడ్డారు. అయితే సీఎం హామీ ఇచ్చి 40 రోజులు గ డుస్తున్నా రైతులకు నష్ట పరిహారం అందకపోవడం గమనార్హం.

Updated Date - Oct 07 , 2025 | 11:38 PM