పరిహారం చెల్లించేదెప్పుడో?
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:38 PM
జిల్లాలోని గుడిపేట వద్ద గోదావరి నదిపై నిర్మించిన శ్రీపాద ఎ ల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యలు దశా బ్ధాలు గడుస్తున్నా తీరడం లేదు. 2004 జూలై 28వ తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్‌రెడ్డ్ది ప్రాజెక్ట్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. నత్తనడకన సాగిన పనుల కారణంగా మూడేళ్లల్లో పూర్తి కావలసిన ప్రాజెక్టు నిర్మాణం 12 ఏళ్ల సుధీ ర్ఘ కాలం తరువాత 2015లో పూర్తయింది.
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్వాసితుల బాధలు వర్ణణాతీతం
-భూములు కోల్పోయిన రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు
-ఏళ్లుగా తప్పని ఎదురు చూపులు
-కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఆశలు
మంచిర్యాల, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గుడిపేట వద్ద గోదావరి నదిపై నిర్మించిన శ్రీపాద ఎ ల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యలు దశా బ్ధాలు గడుస్తున్నా తీరడం లేదు. 2004 జూలై 28వ తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్‌రెడ్డ్ది ప్రాజెక్ట్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. నత్తనడకన సాగిన పనుల కారణంగా మూడేళ్లల్లో పూర్తి కావలసిన ప్రాజెక్టు నిర్మాణం 12 ఏళ్ల సుధీ ర్ఘ కాలం తరువాత 2015లో పూర్తయింది. అప్పటి ఉ మ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా నడుమ గోదావ రిపై ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించేందుకు అప్పటి ప్ర భుత్వం 2004లో సుమారు రూ. 6 వందల కోట్లు కేటా యించింది. 20.175 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఆనకట్ట నిర్మాణానికి రూ. 408. 85 కోట్లు కే టాయించగా గేట్ల నిర్మాణానికి సుమారు రూ. 191 కో ట్లు కేటాయించారు. మంచిర్యాల వైపున మట్టికట్ట పొ డవు 2.10కిలోమీటర్లు, ఎల్లంపల్లి వైపున పొడవు 2.30కి కిలో మీటర్లు నిర్మించారు. ఆనకట్ట పొడవు 1.118 కిలో మీటర్లు కాగా 62గేట్లు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో ఏడు గ్రామాలు, లక్షెట్టిపే ట మండలంలో రెండు గ్రామాలు ముంపునకు గురవు తుండటంతో ప్రజల కోసం పునరావాస ఏర్పాట్లు చేశారు.
పరిహారం కోసం ఎదురు చూపులు...
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద మంచిర్యాల జిల్లాలోని తొమ్మిది గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. హాజీపూర్ మండలంలోని గుడిపేట, నంనూర్, చందనాపూర్, రాపల్లి, కొండపల్లి, కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాలతో పాటు లక్షెట్టిపేట మండలంలోని గు ళ్లకోట, సూరారం గ్రామాలను ముంపు కింద ఎంపిక చేశారు. హాజీపూర్ మండలంలోని చందనాపూర్ గ్రా మానికి సంబంధించి మొత్తం 183 నివాస గృహాలు ఉండగా వీరికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదు. మేజర్‌సన్స్, ఇతర చెల్లింపులను చేయలేదు. అలాగే కొండపల్లి గ్రామంలో మొత్తం 253 నివాస గృహాలుం డగా ఎఫ్‌ఆర్‌ఎల్ కింద సుమారు 90 నివాస గృహాలు న్నాయి. కర్ణమామిడిలో 176 ఎఫ్‌ఆర్‌ఎల్ కింద నివాస గృహాలున్నాయి. పడ్తనపల్లిలో 30 ఎఫ్‌ఆర్‌ఎల్ కింద నివాస గృహాలున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ద శాబ్ద కాలం గడుస్తున్నప్పటికీ పరిహారం చెల్లించలేదని నిర్వాసితులు వాపోతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇండ్లు త్యాగం చేసినప్పటికీ అధికారులు, ప్రభుత్వం పరిహారం చెల్లించడంలో విపలమయ్యారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు.
చెల్లింపుల్లో జాప్యం....
ఎల్లంపల్లి ముంపు బాధితుల కోసం పునరావాస కా లనీలు ఏర్పాటు చేసి, అప్పటి ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. హాజీపూర్, లక్షెట్టిపే ట మండలాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల చివరి విడుత రూ. 70 వేల చొప్పున 1180 మందికి ఇప్పటి వరకు చెల్లించలేదు.
-హాజీపూర్ మండలం కొండపల్లి ఆర్‌అండ్‌ఆర్ కాల నీలో నెలకొన్న సమస్యల కారణంగా 59 కుటుంబాలు ప్లాట్లు తీసుకునేందుకు అంగీకరించలేదు. దీంతో అప్ప ట్లో ఒక్కో కుటుంబానికి రూ. 2.70 లక్షల పరిహారం ప్ర కటించారు. అవి కూడా ఇప్పటి వరకు చెల్లించలేదని బాధితులు వాపోతున్నారు.
-ముంపు బాధితుల పిల్లలు 18 ఏళ్లు నిండిన వారికి మేజర్ సన్స్ కింద పరిగణించి ఒక్కొక్కరికి రూ. 2 లక్ష ల ప్యాకేజ్ ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు కూడా ఇప్ప టికీ అందలేదని బాధితులు చెబుతున్నారు. మొత్తంగా దాదాపు రూ. 4 కోట్లమేర పునరావాస బకాయిలు ఉన్న ట్లు ప్రజలు తెలిపారు. అయితే పదేళ్లు పాలించిన బీ ఆర్‌ఎస్ ప్రభుత్వం ముంపు బాధితులను పట్టించుకో కపోవడంతో సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి.
పొరుగు జిల్లాల్లో అందిన పరిహారం...
ఇదిలా ఉండగా 2024 అక్టోబర్ 26న అప్పటి ఎమ్మె ల్యే అడ్లూరి లక్ష్మణ్ చొరవతో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం ముంపు బాధితులకు 126 కుటుం బాలకు రూ. 18 కోట్లకు సంబంధించిన చెక్కులను అందజేసినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే త మకు పరిహారం చెల్లింపుల్లో జాప్యం పట్ల జిల్లా బాధి తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మించింది...రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్ర భుత్వమే కాబట్టి ఇప్పటికైనా తమకు పూర్తిస్థాయి పరిహారం అందించాలని ప్రాజెక్టు ముంపు బాధితులు కోరుతున్నారు.
ఇందిరమ్మ ఇల్లు, డబ్బులు ఇస్తలేరు...లగిశెట్టి రాజమౌళి, గుడిపేట
ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపులో ఇల్లు, ఇంటి స్థలం కోల్పోయాను. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కింద మరో రూ. 70వేలు చెల్లిస్తామని ప్రక టించారు. సంవత్సరాలు గడిచినా ఎవరూ స్పందించ డంలేదు. ప్రాజెక్టు నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రస్తుతం అధికారంలో ఉన్నందున వెంటనే పరిహారం చెల్లించాలి.
మేజర్ సన్ పరిహారం నేటికీ అందలేదు....సంగెం అభిలాష్, గుడిపేట
ప్రాజెక్టు ముంపు బాధితులు 18 ఏళ్లు నిండిన వారి కి మేజర్ సన్స్ స్కీం కింద రూ. 2 లక్షలు పరిహారం చెల్లించాల్సి ఉంది. మేజర్ సన్ స్కీం కింద నాకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ విషయమై ఇప్పటికి అనేకమార్లు జిల్లా అధికారులు, ప్రజా ప్ర తినిధులకు విన్నవించినా ఫలితం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు స్పందించి పరిహారం చెల్లించాలి.