Share News

kumaram bheem asifabad-అంగన్‌వాడీల భర్తీ ఎప్పుడో..?

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:26 PM

జిల్లాలో అంగన్‌ వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోవడం లేదు. టీచర్‌, ఆయా పోస్టులు భర్తీ చేయక పోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యత పక్కన ఉన్న కేంద్రాల టీచర్‌కు అప్పగించడంతో వారిపై అదనపు భారం పడుతోంది. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో సరిపడా సిబ్బంది లేక అవస్థలు తప్పడం లేదు.

kumaram bheem asifabad-అంగన్‌వాడీల భర్తీ ఎప్పుడో..?
రెబ్బెనలోని అంగన్‌వాడీ కేంద్రం

అదనపు పని భారంతో సిబ్బంది అవస్థలు

- నోటిఫికేషన్‌ కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు

రెబ్బెన, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అంగన్‌ వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోవడం లేదు. టీచర్‌, ఆయా పోస్టులు భర్తీ చేయక పోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యత పక్కన ఉన్న కేంద్రాల టీచర్‌కు అప్పగించడంతో వారిపై అదనపు భారం పడుతోంది. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో సరిపడా సిబ్బంది లేక అవస్థలు తప్పడం లేదు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంతో పాటు శిశువులకు టీకాలు వేయడం, పోలియోను అరికట్టడంలో కీలక పాత్ర పోషించడం వంటి ప్రత్యేక కార్యక్రమాలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయా పోస్టులను ఏళ్ల తరబడి భర్తీ చేయడం లేదు. సమీపంలోని కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లకు అదనపు బాఽధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో అంగన్‌వాడీ టీచర్‌పై అదనపు భారం పడుతోంది. ఐసీడీఎస్‌ ఆధ్వ ర్యంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో వందల సంఖ్యలో ఉన్న ఖాళీలతో పిల్లలు, గర్భిణులకు, బాలింతలకు నష్టం జరుగుతోంది.

- జిల్లాలో 973 కేంద్రాలు..

జిల్లాలో ఆసిపాబాద్‌, కాగజ్‌నగర్‌, సిర్పూరు(టి), జై నూరు, వాంకిడి ప్రాజెక్టులో మొత్తం 973 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ప్రతి కేంద్రానికి ఒక టీచర్‌, ఒక ఆయా ఉండాలి. ఆయా కేంద్రాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి కచ్చితమైన ప్రకటన విడుదల కాక పోవడంతో సందిగ్ధం నెలకొంది. వందల పోస్టులు ఖాళీగా ఉండ డంతో దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో జైనూరు, సిర్పూరు(యు), కెరమెరి, తిర్యాణి, లింగాపూర్‌ ప్రాంతాల్లో ఆదివాసీగిరిజనులు అధికంగా ఉన్నారు. ఆయా మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుతున్న మహిళలు చాలా తక్కువ వంది ఉన్నారు. గత నిబంధనల ప్రకారం అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌, ఆయాగా పని చేయాలంటే స్థానికత ఆధారంగా తీసుకునే వారు. వివాహం అనంతరం అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామానికి చెందిన వారై ఉండాలి. మారుమూల ఆదివాసీ గ్రామాల్లో చదువుకున్న మహిళలు తక్కువగా ఉండడంతో పోస్టులు భర్తీ కావడం లేదు. పలితంగా ఇన్‌చార్జిలతో నెట్టుకరావాల్సిన పరిస్థితి ఉంది. అంగన్‌వా డీ టీచర్‌గా పని చేయాలంటే కనీస అర్హత ఇంటర్‌తో నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని సమాచారం. విద్యార్హ కలిగి ఏని గ్రామాల్లో భర్తీపై సంశయం నెలకొంది. అంగన్‌వా డీ టీచర్‌ పోస్టులకు సంబంధించి ప్రాజెక్టుల వారిగా ఖాళీలను పరిశీలిస్తే ఆసిఫాబాద్‌లో 260 పోస్టులకు 235 మంది విధులు నిర్వహిస్తున్నారు. 25 ఖాళీలున్నాయి. కాగజ్‌నగర్‌లో 173 పోస్టులకు 166 మంది పని చేస్తున్నారు. ఏడు పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సిర్పూరు(టి) లో 5, జైనురులో 24, వాంకిడిలో 37 ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో మొత్తం 973 పోస్టులకు 875 మంది పని చేస్తుండగా, 98 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రభు త్వం నుంచి నోటిఫికేషన్‌ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 07 , 2025 | 11:31 PM